తొలుత హేతుబద్ధీకరణ! | Telangana University Faculty Recruitment Review | Sakshi
Sakshi News home page

తొలుత హేతుబద్ధీకరణ!

Oct 29 2026 12:52 PM | Updated on Oct 29 2026 1:20 PM

Telangana University Faculty Recruitment Review

అధ్యాపక నియామకాల్లో కొత్త ట్విస్ట్‌

హేతుబద్ధీకరణ తర్వాతే నోటిఫికేషన్లకు సర్కారు నిర్ణయం!

కొన్నేళ్ల క్రితం నాటి ప్రతిపాదనలపై దృష్టి

అవసరం లేనిచోట అత్యధిక పోస్టులు.. విద్యార్థులు ఎక్కువగా చేరే కోర్సులకు తక్కువ ఫ్యాకల్టీ

ఓయూలో సివిల్‌ విభాగానికి 15 పోస్టులు..అత్యధిక డిమాండ్‌ ఉన్న సీఎస్‌ఈకి 4 పోస్టులే

విద్యార్థులే లేని అరబిక్, జర్మన్, కన్నడకూ పోస్టులు

జేఎన్‌టీయూహెచ్‌కు ఒక్క పోస్టూ మంజూరు చేయని వైనం

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీపై సందిగ్ధత నెలకొంది. వీసీల ప్రతిపాదనపై ప్రభుత్వం పునరా లోచనలో పడింది. హేతుబద్ధీకరణ చేపట్టా లని భావిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామక నోటిఫికేషన్లు విడుద లయ్యే వీలుంది. విద్యార్థులు ఎక్కువ చేరే కోర్సుల్లో కనీస స్థాయిలో పోస్టులు లేవు. విద్యార్థులే చేరని కోర్సుల్లో మాత్రం రెట్టింపు పోస్టులు మంజూరు చేశారు. దీనివల్ల సమ తూకం దెబ్బతింది. ఈ అంశాన్ని కొంతమంది సీఎం దృష్టికి తీసుకెళ్ళారు.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి సోమవారం వీసీలతో సమావేశం నిర్వహించారు. కొన్నేళ్ళ క్రితం చేసిన ప్రతిపాదన మేరకు పోస్టులు మంజూరు అయ్యాయని వీసీలు తెలిపారు. అయితే తాజా అవసరాన్ని గుర్తించలేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్నట్టు తెలిసింది. దీనికి వీసీల నుంచి సరైన సమాధానం రాలేదు. మరోవైపు పోస్టుల మంజూరులో హేతుబద్ధీకరణ లోపించినట్టుగా ఉన్నత విద్యా మండలి గుర్తించింది. దీనిపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి తెలిపినట్టు తెలిసింది.

అలాగే ప్రస్తుతం కాంట్రాక్టు పోస్టుల్లో ఉన్న అధ్యాపకుల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తేవాలని భావిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది.

ఇష్టానుసారం పోస్టులు మంజూరు
ప్రభుత్వం ఏడు యూనివర్సిటీలకు 429 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను మంజూరు చేసింది. ఇప్పటికే ఈ యూనివర్సిటీల్లో 2 వేలకు పైగా కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరిలో కొంతమంది కొత్త పోస్టుల వైపు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది పదవీ విరమణ వయసుకు దగ్గరగా ఉన్నారు. అయితే ఏ ఫ్యాకల్టీలో ఎంతమంది ఉన్నారు? ఏ బ్రాంచీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు? అవస రం ఉన్న పోస్టులేంటి? అనే అంశాలపై వీసీలు కసరత్తు చేయలేదనే విమర్శలు న్నాయి. కొన్నేళ్ళుగా ఉన్న ఖాళీల జాబితానే ప్రభుత్వానికి పంపారు.

వాస్తవానికి గత పదేళ్లలోనే డిమాండ్‌ కోర్సుల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ అంశాలను వీసీలు పరిగణనలోనికి తీసుకోలేదని అంటున్నారు. ఇక మంజూరైన 429 పోస్టుల్లో అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 252 ఉన్నాయి. ఈ యూని వర్సిటీలో గడచిన నాలుగేళ్ళుగా 75 శాతం విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో చేరుతున్నారు. సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీలకు డిమాండ్‌ పడిపోయింది. అయినప్పటికీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుకు కేవలం 4 పోస్టులే కేటాయించారు. కనీసం 12శాశ్వత పోస్టుల అవసరం ఉందని అక్కడి ప్రొఫెసర్లు చెబుతున్నారు.

సివిల్‌ విభాగంలో డిమాండ్‌ పూర్తిగా పడిపోయి నప్పటికీ, ఈ బ్రాంచీకి ఏకంగా 15 పోస్టులు మంజూరు చేశారు. ఇక విద్యార్థులు మెకా నికల్‌ ఇంజనీరింగ్‌ వైపే చూడటం లేదు. అయినా ఈ విభాగానికి ఏకంగా 12 పోస్టులు మంజూరు చేశారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో చేరేవారి సంఖ్య నామ మాత్రంగా ఉంటోంది. ఈ విభాగానికి ఏకంగా 13 పోస్టులు ఇచ్చారు. న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌కు ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయినా ఈ విభాగానికి 16 పోస్టులు ఇచ్చారు.

అతి తక్కువ అడ్మిషన్లు ఉండే అరబిక్, ఫ్రెంచ్, జర్మనీ, కన్నడ, రష్యన్‌ వంటి విదేశీ భాషల అధ్యాపకులకు పోస్టులు మంజూరు చేశారు. బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ పోస్టులు మాత్రం అవసరమైన మేర ఇవ్వలేదు. ఇలా వీసీలు ఇష్టానుసారం చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై సీఎంవో దృష్టి పెట్టినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

జేఎన్‌టీయూహెచ్‌కు ఎగనామం!
రాష్ట్రవ్యాప్తంగా సాంకేతిక విద్యను అందించే ఏకైక యూనివర్సిటీ జేఎన్‌టీయూహెచ్‌. 149 ప్రైవేటు కాలేజీలకు ఇది అనుబంధ గుర్తింపు ఇస్తోంది. ఈ వర్సిటీ పరిధిలో కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా అధ్యాపకుల కొరత ఉంది. ఈ విషయాన్ని పాలక మండలి ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కనీసం 120 పోస్టులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాజా నియామకాల్లో జేఎన్‌టీయూహెచ్‌కు ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్ళాలని జేఎన్‌టీయూహెచ్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు, జేఎన్‌టీ æయూహెచ్‌కు మధ్య వివాదమే పోస్టులపై నిర్లక్ష్యానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. వివాదం గవర్నర్‌ వరకూ వెళ్తే బాగుండదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ వర్సిటీకి పోస్టులపైనా చర్చించాకే నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.

ఇదీ చదవండి: మోడల్‌ స్కూళ్లలో 776 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement