ఎమ్మెల్యే మాధవిరెడ్డి హుకుం.. ఓటర్లకు నో స్లిప్స్‌ | Kadapa Corporation Elections, YSRCP Alleges Madhavi Reddy Role In Stopping Door-to-Door Voter Slip Distribution | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాధవిరెడ్డి హుకుం.. ఓటర్లకు నో స్లిప్స్‌

Oct 30 2026 2:06 PM | Updated on Oct 30 2026 2:33 PM

MLA Madhavi Reddy Orders No Slips For Voters In Kadapa

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కడపలో ఎన్నికల ప్రక్రియ.. అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. కడప కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఇంతవరకూ ఓటరు స్లిప్పులు పంచలేదు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి ఒక్క ఓటరుకూ ఇంటికి ఓటరు స్లిప్పులు అందించాల్సి ఉంది. 

బీఎల్‌వోలు అడుగు బయటపెట్టడం లేదు.. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాలతోనే ఓటరు స్లిప్పులు పంచకుండా కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటరు స్లిప్పులు కావాల్సిన వారు సచివాలయం వచ్చి తీసుకెళ్లాలని ఆడియో మెసేజ్‌లు పంపుతున్నారు. అదీ మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే ఇస్తామంటూ సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. తమ బాధ్యతను వీడి.. సచివాలయంలో పంపిణీ ఏంటని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. ఓటర్‌ స్లిప్పుల పంపిణీలో కార్పొరేషన్‌ ఎన్నికల అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబూ.. నీ తప్పులు చాలా దూరం వెళ్తాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement