చంద్రబాబూ.. నీ తప్పులు చాలా దూరం వెళ్తాయి! | YS Avinash Reddy Questions Chandrababu Over Unfulfilled Election Promises And Attacks On YSRCP Candidates, Check More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. నీ తప్పులు చాలా దూరం వెళ్తాయి!

Oct 30 2026 11:41 AM | Updated on Oct 30 2026 12:34 PM

Pulivendula: Ysrcp Mp Ys Avinash Reddy Fires On Chandrababu

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: మీరు ఏం చేశారని ప్రజలు  ఓట్లు వేస్తారంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హౌసింగ్‌ కాలనీల్లో ఒక్క రూపాయి పనులైనా చేశారా?. పులివెందులకు  మెడికల్‌ కాలేజీ వస్తే మీరే వద్దన్నారు. ఎన్నికల్లో ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి?. ఈ మూడేళ్లల్లో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగగలరా?’’ అంటూ అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘చంద్రబాబు ఎంత బలహీనుడో రాష్ట్రం మొత్తానికి అర్థమైంది. బీటెక్‌ రవి ప్రచారం వింతగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఏ  హామీ నెరవేర్చారని టీడీపీ నేతలు ఓట్లు అడుగుతున్నారు?. వైఎస్సార్‌సీపీ కార్పొరేట్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులను నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్నారు. మధ్యాహ్నం 1:30కు నామినేషన్లు వేసుకోవచ్చని చెప్పి పోలీసులే అడ్డుకున్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌ ముందు ఆగి నామినేషన్లు వేసుకోవడానికి అనుమతి అడిగాం. నామినేషన్లకు అనుమతివ్వమని పోలీసులు స్పష్టంగా చెప్పారు’’ అని వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘ప్రచారం కూడా వైఎస్సార్‌సీపీ నేతలను ప్రశాంతంగా చేసుకోనివ్వడం లేదు. ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులపై దాడులు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులపై దాడులు చేసిన వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. పనికి మాలిన పనుల్నీ చంద్రబాబు హయాంలో జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు గతంలో ఏనాడూ జరగలేదు

..వేలాది మందిని బయట నుంచి తీసుకొస్తున్నారు. బయట నుంచి వచ్చిన వారికి పోలీసులే సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏజెంట్లను, ఓటర్లను బ్లాక్‌ చేసి దొంగ ఓట్లు వేసుకోవడానికి స్కెచ్‌. టీడీపీ నీచ ప్రణాళికలకు కోయ ప్రవీణ్‌ పూర్తిగా సహకరిస్తున్నాడు. టీడీపీ కుట్రలను ఎస్‌ఈసీ దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లింది. ఫ్యాక్షనిజాన్ని చంద్రబాబు తట్టి లేపుతున్నాడు. చంద్రబాబు.. నీవు చేసే తప్పుడు పనులు చాలా దూరం వెళ్తాయి’ అని వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఏంటి బాబూ.. ఈ పచ్చి అబద్ధాలు!

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement