ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు | Floodwater: Traffic Halted At Andhra Odisha Border | Sakshi
Sakshi News home page

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు

Oct 30 2026 8:29 AM | Updated on Oct 30 2026 10:26 AM

Floodwater: Traffic Halted At Andhra Odisha Border

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఒడిశాలో భారీ వర్షాలతో మహేంద్ర తనయ నదికి భారీగా వరద ప్రవాహం రావడంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో రాకపోకలు నిలిచిపోయాయి. పాతపట్నం-పర్లాకిమిడి NH-326A రహదారిని  అధికారులు మూసివేశారు. ముందస్తు జాగ్రత్తగా రహదారిపై రాకపోకలను ఏపీ-ఒడిశా అధికారులు నిలిపేశారు. వరద ఉధృతి నేపథ్యంలో ఇరు రాష్ట్రాల యంత్రాంగం అప్రమత్తమయ్యారు.

కాగా, బాహుదానది ఉగ్రరూపం దాల్చడంతో ఇచ్ఛాపురం మండలంలోని నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు అర్ధరాత్రి తుఫాన్‌ ప్రభావం.. మరోవైపు ఒడిశా ప్రభుత్వం భగలట్టీ డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో నదిలో వరద ఉద్ధృతి పెరిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

నుంచి బాహుదానది, పద్మనాభపురం(దండు) గెడ్డలు ఉప్పొంగడంతో ఇన్నేశుపేట, డొంకూరు, లక్ష్మీపురం, జగన్నాథపురం, శాసనాం, బిర్లంగి, బి.తోటూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, లొద్దపుట్టి, తేలుకుంచి, రత్తకన్న, మశాఖపురం, బొడ్డబడ గ్రామాల్లోకి నీరు చొచ్చుకురావడంతో ఇళ్లు మునిగిపోయాయి.

స్థానిక 16వ నంబర్‌ జాతీయ రహదారి పూర్తిగా జలమయం కావడంతో కోల్‌కతా నుంచి చెన్నై రాకపోకలు సాగించే లారీలు, బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని వాహనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని తోటి డ్రైవర్లు చెబుతున్నారు. నీటిలో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రక్షించాయి.

ఇదీ చదవండి: అండమాన్‌లో మరో అల్పపీడనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement