ఊరిపై ఉప్పెన | - | Sakshi
Sakshi News home page

ఊరిపై ఉప్పెన

Oct 30 2026 7:42 AM | Updated on Oct 30 2026 7:42 AM

అర్నబ్‌ ప్రకోపం

● ఆగిన రాకపోకలు

దారి ఏరయ్యింది!

తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో ని దారులన్నీ ఏరులయ్యాయి. ఇచ్ఛాపురం పరిధి కొజ్జిరియా (బెల్లుపడ) టోల్‌గేట్‌ సమీప పేటూరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రే వరద చేరడంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పలాస సమీప లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద వాహనాలను ఆపేయడంతో నందిగాం మండలం కాపుతెంబూరు–పెద్దలవునిపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పాతపట్నం పరాలి–చంగొడి రోడ్డు, సీది–కమలకొట్టు జంక్షన్‌, కాపుగోదా యిసు, తిడ్డిమి–పాతపట్నం రోడ్డులపై వరద నీరు చేరడంతో బ్లాక్‌ అయ్యాయి. మందస మండలం చీపి గెడ్డ వరదనీరు రహదారులపై చేరి 30 గ్రామాల రాకపోకలు స్తంభించాయి. -శ్రీకాకుళం క్రైమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement