breaking news
Srikakulam District News
-
క్వారీ కార్మికుల ఆందోళన
కొత్తూరు: Ð]l$…yýl-ÌS…ÌZ° ÔZ¿ýæ-¯é-ç³#Æý‡… Mö…yýl Ð]l§ýlª °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² Æð‡…yýl$ MýS…MýSÆý‡ M>ÓÈÌS M>Ç-Ã-MýS$Ë$ Ý린 MýS ™èlçßæ-ïÜ-ÌêªÆŠ‡ M>Æ>Å-ÌSĶæ$… Ð]l¬…§ýl$ ÝùÐ]l$ÐéÆý‡… B…§øâýæ¯]l ^ólç³-sêtÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ÐéÆý‡$ Ð]l*sêÏ-yýl$-™èl*.. Mö…™èl-Ð]l$…¨ ™èl糚yýl$ íœÆ>ŧýl$Ë$ ^ólĶæ$yýl… Ð]lÌS¯]l M>ÓÈË$ °Ë$-ç³#-§ýlÌS ^ólĶæ$-yýl…™ø, çÜ$Ð]l*Æý‡$ 100 MýS$r$…-»êË$ E´ë«¨ ÌôæMýS Ò«¨¯]l ç³yézĶæ$° Ð]lÅÐ]l-ÝëĶæ$ M>Ç-ÃMýS çÜ…çœ$… hÌêÏ M>Æý‡Å-§ýlÇØ íÜÆý‡Ï {ç³Ýë§Šæ, M>Ç-Ã-MýS$Ë$ í³.íÜ…à-^èl-ÌS…, í³. Æ>gôæ‹-Ù, BÆŠ‡.ÕÐ]l, ¼.çÜ$«§é-MýSÆý‡Æ>Ð]l#, »êÌSÆ>k ™èl¨ ™èl-Æý‡$Ë$ BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. çÜ$Ð]l*Æý‡$ 25 H â¶æ$ÏV> C§ól MŠS{Ðéీ ç³Ë$ Æý‡M>ÌS 糯]l$Ë$ ^ólçÜ*¢ E´ë«¨ ´÷…§ýl$-™èl$-¯é²-Ð]l$¯é²Æý‡$. A°² Æý‡M>ÌS A¯]l$-Ð]l$-™èl$-ÌS ™ø 25 çÜ…Ð]l-™èlÞÆ>ÌS ¯]l$…_ °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² M>ÓÈ ç³¯]l$-ÌSMýS$ Br…MýS… MýSÍ-W…-^èlyýl… çÜÇ-M>-§ýl¯é²Æý‡$. A«¨-M>-Æý‡$Ë$ çܵ…¨…_ Ð]l$Æý‡Ìê M>ÓÈ ç³¯]l$Ë$ ^ólç³-sôætÌê ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° MøÆ>Æý‡$. D Ðól$Æý‡MýS$ ™èlçßæïÜ-ÌêªÆŠ‡ Ô>ÅÐŒl$ MýS$Ð]l*ÆŠ‡MýS$ ѯ]l†-ç³{™èl… A…§ýl-gôæ-Ô>Æý‡$. -
గరం గరంగా హైటీ!
● పాస్టర్ల మధ్య గొడవ పెట్టిన తొలి ఎమ్మెల్యే మీరే! ● క్రిస్మస్ హైటీలో గొండు శంకర్‌పై ఓ పాస్టర్ సంచలనం వ్యాఖ్యలు శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో సోమవారం నిర్వహించిన హైటీ–2025 (క్రిస్మస్ సంబరాలు) వేడుక వివాదానికి వేదికగా మారింది. తెలుగు బాప్టిస్టు సంఘంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు గందరగోళానికి దారితీశాయి. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ వర్గం ప్రతినిధులు వేదిక బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పగా.. పార్టీ ప్రమేయంతో కార్యక్రమం నిర్వహించడం సరికాదని పలువురు నిలదీశారు. ‘పాస్టర్ల మధ్య గొడవ పెట్టిన తొలి ఎమ్మెల్యే మీరేనని’ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఓ పాస్టర్ అనడంతో ఆయన అవాక్కయ్యారు. తమ మధ్య గొడవలు పెట్టారని పాస్టర్లంతా ఎమ్మెల్యేను తప్పుపట్టారు. వేదిక పైన తమకు స్థానం ఇవ్వకుండా చేశారని, సొంత పార్టీ వ్యక్తులే ఇలా చేయడం సరికాదని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అనంతరం ఇరువర్గాల ప్రతినిధులను వేదికపైకి పిలవడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు, గతంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో జనాలు రాలేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పిలుపు మేరకు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారంతా బయకు వెళ్లిపోయారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. -
కార్మిక హక్కులను హరిస్తే సహించం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. ఏఐటీయూ సీ జిల్లా మహాసభల రెండో రోజు సోమవారం స్థాని క క్రాంతి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక కార్మిక చట్టాలను పెద్ద ఎత్తున ఉద్య మాల చేసి సాధించుకున్నామన్నారు. అటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్‌గా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పని గంటల పెంపుదల అన్యాయమని ధ్వజమెత్తారు. చట్టాలు, హక్కులు పరిరక్షించుకోవడం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు గా ముత్యాలరావు, టి.తిరుపతిరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు గౌరవాధ్యక్షులుగా సీహెచ్ గోవిందరావు, కె.అప్పలరాజు, డి.కిరణ్, పి. సత్యం, ఉపాధ్యక్షులుగా బి.శేషు, వై.సూర్యనారా యణ, బి.అప్పలరాజు, కె.శ్రీనివాస్‌లతో పాటు లబ్బ రాజు, పార్థసారధి, దుర్గారావు, ఎర్రయ్య, ఆర్.సూర్యనారాయణ, షేక్ భాను, సరిత, జగదీశ్వరి, వాసు, సురేష్, దుర్గాప్రసాద్, హైమావతి, గౌరీ శ్వర్, ప్రమీల, ఆదిలక్ష్మి, సావిత్రి, రామకృష్ణ తదితరులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 193 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలను ప్రాధాన్యత క్రమంలో సత్వరమే పరిష్క రించి బాధితులకు న్యాయం చేయాలని జేసీ ఫర్మా న్ అహ్మద్‌ఖాన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొని అర్జీదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. సోమ వారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 193 ఫిర్యాదు లు నమోదయ్యాయి. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా, సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించా రు. కార్యక్రంలో డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ప్రత్యేకాధికారి వేంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులను పరిశీలిస్తే... ●నందిగాం మండలంలోని హరిదాసుపురంలో అనర్హురాలైన రమాదేవికి ఆశ కార్యకర్తగా అధికారులు నియమించారని, దీనిపై చర్యలు తీసుకోవా లని గ్రామానికి చెందిన అక్కూరు మీనా ఫిర్యాదు చేశారు. ●శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్ద గనగళ్లవానిపేట పంచాయతీ పరిధి పుక్కళ్లపేట, గాంధీ నగర్, చిన్న గనగళ్లపేట, ఖాజీపేట, నరసయ్యపేట తదితర గ్రామాలు కోతకు గురై ప్రమాదపుటంచున ఉన్నాయని, అందువలన నదీకోతకు గురవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ●పోలాకి మండలంలోని జొన్నం గ్రామానికి చెంది న గేదెల అప్పల నరసమ్మ తన పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిర్మాణాన్ని ఆపి తనకు న్యాయం చేయాలని కోరారు. అడ్డగోలు పనులు చేస్తున్నారు ఆమదాలవలస నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తల సిఫార్సుల మేరకు అధికారులు అడ్డగోలు పనులు చేస్తున్నారని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస మండలం నెల్లిపర్తి పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రాజకీయ కారణాలతో తొలగించడం జరిగిందని, చెక్కు పునరుద్ధరించాల ని కోరారు. అలాగే సరుబుజ్జిలి మండలం కూనజమునిపేటలో పంచాయతీ తీర్మానం లేకుండా అంగన్వాడీ కేంద్రం నిర్మాణాలు జరుపుతుండడంతో చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ మంజూరు చేయాలని విన్నవించారు. బూర్జ మండలం తిమడాం గ్రామానికి చెందిన ఉపాధి హామీ పనిచేసిన మహిళకు సాంకేతిక కారణాలతో పది వారాల వేతనం చెల్లించలేదని, వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనతో పాటు నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, బెండి అప్పలనాయుడు, బద్రి రామారా వు, మనుకొండ వెంకటరమణ, కోవిలాపు చంద్రశేఖర్, సూర్య నారాయణ, వెంకట రమణ ఉన్నారు. -
లేకుంటే పొమ్ము!
ఇష్టముంటే అమ్ము..ధాన్యం కొనుగోలు విషయంలో టెక్కలి నియోజకవర్గంలో దళారీలు, మిల్లర్లు కలిసి రైతులకు నరకం చూపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. విత్తనాల నుంచి ధాన్యం అమ్మకాల వరకు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మంత్రికి, కలెక్టర్‌కు చెప్పినా పరిస్థితి మారడం లేదు. రైతుల నుంచి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. – సత్తారు సత్యం, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, టెక్కలి టెక్కలి: ‘సార్.. ధాన్యం పట్టుకుని మిల్లర్ వద్దకు వెళితే తేమశాతం, నూకలు, తరుగు పేరుతో ఒక్కో బస్తాకు అదనంగా 2 నుంచి 5 కిలోల ధాన్యం తీసుకుంటున్నారు. ఇదేంటని మిల్లర్‌ను ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే ధాన్యం అమ్ము.. లేకపోతే తీసుకెళ్లిపో అంటూ కసురుకుంటున్నారు..’ అంటూ బాధిత రైతులు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వద్ద ఇటీవల వాపోయారు. అయినప్పటికీ టెక్కలి నియోజకవర్గం పరిధిలో పలు రైస్ మిల్లుల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్కలి మండలంలో ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు చెప్పిందే వేదంగా మారుతోంది. మిల్లరు ఎంత మేరకు డిమాండ్ చేస్తే అంత ధాన్యం కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతులకు మేలు కలిగే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిలిచిన బ్యాంకు గ్యారెంటీలు.. టెక్కలి మండలంలో 23 రైస్ మిల్లులకు సంబంధించి మొదటి విడత, రెండో విడత బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. కొద్దిరోజుల క్రితం బీజీ టార్గెట్ పూర్తవడంతో, మూడో విడత బ్యాంకు గ్యారెంటీ విషయంలో మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం 7 రైస్ మిల్లులకు మాత్రమే బీజీలు ఉండడంతో కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. అయితే టెక్కలి మండలానికి సంబంధించి 24 వేల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం కొనుగోలుకు లక్ష్యం కాగా ప్రస్తుతానికి 11 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రైస్ మిల్లుల్లో మాత్రం లెక్కకు మించి ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజీలు లేకపోవడంతో దళారులు, మిల్లర్లదే రాజ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. మొత్తమ్మీద కల్లం నుంచి ధాన్యం బస్తాలతో బయలుదేరుతున్న రైతులు ట్రాక్టర్, లోడింగ్ చార్జీలు, పంచాయతీ ఆశీల పన్ను, వే బ్రిడ్జి, గోనె సంచులు, బస్తాలు దించేందుకు చార్జీలు, మిల్లర్ల ఇబ్బందులు కారణంగా విలవిలలాడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో టెక్కలి నియోజకవర్గంలో మిల్లర్ల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు కొంత వాటాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. మంత్రి సోదరుడు హరివరప్రసాద్ నేతృత్వంలో మిల్లర్లు ఏకమై రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు. అందుకే మిల్లర్లు ఏం చెప్పినా.. ఏం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి -
శ్రీకాకుళం
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సింగుపురంలో హాస్టల్‌కు కూతవేటు దూరంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కాంట్రాక్టర్లకు సంబంధించి గత అనుభవంతో పనిలేదు. ఎంత బాగా పనిచేసిందన్నది అక్కర్లేదు. సంస్థకు అర్హత ఉందా అన్నది అవసరం లేదు. విచిత్ర షరతులతో టెండర్లు పిలవడం, అనుకున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు ఎవరైనా అడ్డు తగిలితే వారిని ఏదో ఒక విధంగా పక్కన పెట్టడం మామూలైపోయింది. జిల్లాలో ఎవరు పనిచేయాలో అధికార పార్టీ నేతలే డిసైడ్ చేస్తున్నారు. దానికోసం ముందుగానే పర్సంటేజీల ఒప్పందం చేసుకుంటున్నారు. 20, 30, 40 శాతం అంటూ ముడుపుల ఆట ఆడుతున్నారు. మొత్తానికి పీఎం అభిమ్ స్కీమ్ కింద మంజూరైన హెల్త్ సెంటర్లు కీలక నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. అస్మదీయులూ..సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులపై అధికార పార్టీ కీలక నేతలు పెత్తనం చేస్తున్నారు. అస్మదీయులైన కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. తమకు కావాల్సిన వ్యక్తికి దక్కకపోతే ఏకంగా టెండర్లు రద్దు చేస్తున్నారు. సరిగ్గా డాక్యుమెంట్లు లేవని సాకులు చూపించి వాటికి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిబంధనలకు పాతరేస్తున్నారు. తమ వారికి తప్ప మిగిలిన ఏ కాంట్రాక్టర్లకు పనులు దక్కకుండా టెండర్లాట ఆడుతున్నారు. నేతలదే పెత్తనం.. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పీఎం అభిమ్) కింద జిల్లాలో 31 హెల్త్ క్లీనిక్ బిల్డింగ్స్‌కు టెండర్లు పిలిచారు. ఒక్కొక్క భవన నిర్మాణం విలువ రూ.48 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఉంది. పంచాయతీరాజ్ ఎస్ఈ ఆఫీస్ పరిధిలో టెండర్లు పిలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెండర్ల విషయంలో నేతల పెత్తనం పెరిగిపోయింది. నియోజకవర్గ కీలక నేతల దిశా నిర్దేశం తప్పనిసరిగా మారింది. వారి సూచనల మేరకే కాంట్రాక్ట్ సంస్థ ఏదన్నది ఫైనలయ్యే పరిస్థితి ఏర్పడింది. కావాల్సిన వారికే కాంట్రాక్ట్ దక్కేలా చూసేందుకు అనుకూల యంత్రాంగం ద్వారా పావులు కదుపుతున్నారు. నీకింత నాకింత అని ముందే ఒప్పందం చేసుకుని కాంట్రాక్టర్‌ను ఖరారు చేసే పరిస్థితి నెలకొంది. కానివారికి పొరపాటున టెండర్ వస్తుందనుకుంటే రద్దు చేసే దుస్థితి చోటు చేసుకుంది. ఒప్పందం ప్రకారమే.. పీఎం అభిమ్ కింద పిలిచిన టెండర్ల విషయంలో చాలా నియోజకవర్గాల్లో కీలక నేతలు చెప్పిన వాళ్లే టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేస్తున్నారు. ముందు కీలక నేతలను కలుసుకుని, వారికివ్వాల్సింది ఇవ్వడం.. పర్సంటేజీ ఫిక్స్ చేసుకోవడం పూర్తయ్యాకే టెండర్లలో పాల్గొంటున్నారు. ముందే ఒప్పందాలు జరిగిపోవడంతో చాలా చోట్ల అనుకున్నట్లుగానే టెండర్లు ఖరారయ్యాయి. కొన్నిచోట్ల మాత్రం వేరే కాంట్రాక్టర్లు పాల్గొనడంతో సమస్య వచ్చింది. ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు రణస్థలం, నందిగాంలో అధికార పార్టీ నేతలకు కావాల్సిన వారితో పాటు ఇతర కాంట్రాక్టర్లు షెడ్యూల్స్ దాఖలు చేశారు. వీరిలో అస్మదీయేతరులకు టెండర్లు ఖరారయ్యే పరిస్థితి ఉండటాన్ని గమనించిన అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో యంత్రాంగంపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. డాక్యుమెంట్లు సరిగా లేవని సాకులు చూపించి టెండర్లను రద్దు చేయించేశారు. ఇప్పుడా వర్క్‌లకు మళ్లీ టెండర్లు పిలిచే పనిలో పడ్డారు. అయిన వారే టెండర్లలో పాల్గొనేలా పథక రచన చేస్తున్నారు. జొన్నవలస ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రవి -
బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు
నందిగాం: పెద్దతామరాపల్లి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై సోమవారం ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు తీరాయి. నందిగాం మండలంలో 11 రైస్‌మిల్లులు ఉండగా సోమవారం నాటికి కేవలం రెండు మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారెంటీ లు ఉన్నాయి. దీంతో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులంతా ఆ రెండు మిల్లులకు మాత్రమే ధాన్యం పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంటూరులోని వినాయక రైస్‌మిల్లు, పెద్దతామరాపల్లిలోని సాయి శ్రీనివాస రైస్ మిల్లులకు ట్రాక్టర్లు పోటెత్తడంతో అన్‌లోడింగ్‌కు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దతామరాపల్లి సర్వీస్ రోడ్డుపై బారులు తీరిన ట్రాక్టర్లు -
కన్నుపడిందా.. గొలుసు గోవిందా!
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 2024 ఏడాది నుంచి ఎనిమిది చోట్ల గొలుసు దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన ఒడిశా నేరస్థుడు ఎట్టకేలకు ఎచ్చెర్ల పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా భంజూనగర్కు చెందిన రావుల వినోద్ చెడువ్యసనాలకు బానిసై మొదట్లో సెల్ఫోన్లు దొంగిలించేవాడు. తర్వాత అస్కా ప్రాంతానికి చెందిన మేకల గణేష్‌తో కలిసి ద్విచక్రవాహనాలు, బంగారు గొలుసులు కొట్టేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే 2024 నుంచి మందస, రణస్థలంలో బైక్ చోరీలు, రణస్థలం, ఎచ్చెర్ల, నందిగాం, అనకాపల్లి జిల్లా కశింకోట పరిధిలో చైన్‌స్నాచింగ్ లకు పాల్పడ్డారు. గతేడాది జూన్ 16న ఎచ్చెర్ల గ్రామం రామ్‌నగర్ కళ్లాల వద్దకు పేడను పారబోసి తిరిగి ఇంటికి వస్తున్న నేతింటి సూరమ్మ అనే మహి ళ పుస్తెల తాడు తెంచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ఎం.అవతారం, అప్పటి ఎస్ఐ సందీప్‌లు దర్యాప్తు మొదలుపెట్టారు. కడప గోల్డ్షాపులోనూ చోరీ.. ప్రస్తుత ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు తన టీమ్‌తో కలిసి పాతనేరస్థుల కదలికలపై నిఘా పెట్టి ఫింగర్ ప్రింట్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.చిలకపాలెం వద్ద సోమవారం నిందితు డిని అరెస్టు చేశారు. సీఐ సమక్షంలో విచారించగా కడప బద్వేలులో శ్రీరామ్, పోతురాజు, మౌలాలీ అను స్నేహితులతో కలిసి రాత్రిపూట గోల్డ్‌షాపు మూసేస్తున్న సమయంలో యజమాని వద్ద నుంచి రెండు బ్యాగులు లాక్కొని పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇతర నేరాలు చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడి నుంచి ఐదు తులా ల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో స్కూటీని రికవరీ చేయాల్సి ఉందని, వినోద్‌కు సహకరించిన మేకల గణేష్‌ను అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన సీఐ ఎం.అవతారం, ఎస్ఐ లక్ష్మణరావు, హెచ్‌సీ రమణయ్య, పీసీలు రవికుమార్, శంకర్, దివాకర్, హేమంత్‌కుమార్‌లను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
ఎచ్చెర్ల: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని కాకినాడ, ఏయూ ప్రాంతీయ సంయుక్త సాంకేతిక విద్యా సంచాలకుడు జీవీ రామచంద్రరావు అన్నా రు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఐపీఎస్‌జీఎం మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. సాంకేతిక విద్యాశాఖ అకడమిక్స్ ఉప సంచాలకుడు బెహరా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐపీఎస్‌జీఎం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో ఎన్సీసీ క్యాడెట్ల పిరమిడ్ ప్రదర్శన, విద్యార్థుల శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని తొమ్మిది కళాశాలల నుంచి మొత్తం 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో క్రీడ లు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అమదాలవలస ప్రిన్సిపాల్ డా.బి.జానకిరామయ్య, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రిన్సిపాల్ విక్టర్‌పాల్, సీతంపే ట జీఎంఆర్‌పీ ఓఎస్డీ బీవీఎస్ఎన్ మూర్తి, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళావాల టెక్కలి ఓఎస్డీ డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం పద్ధతి..?
బీసీ వసతి గృహానికి సమీపంలో ఉన్న వైన్‌షాపు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం ఎదురుగా ఒక సిమెంట్ రోడ్డుకు ఆనుకొని ఎకై ్సజ్ అధికారులు కొద్ది నెలలు క్రితం వైన్‌షాపును ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకు పక్కనే ఉన్న సింగుపురం ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సాయంత్రం 4.30 గంటల తర్వాత స్కూల్ విడిచిపెట్టగానే హాస్టల్‌కు చేరుకుంటారు. అయితే ఆ సమయంలో వైన్‌షాపునకు వచ్చే వాహనాలు, మందుబాబులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ గేటును అనుసరించి వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. దీంతో స్టడీ అవర్, రాత్రులు చదివే సమయంలో ఏకాగ్రత సాధించలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ మెయిన్ గేటు, వైన్‌షాపునకు మధ్య కేవలం ఒక సిమెంట్ రోడ్డు మాత్రమే ఉంది. నేరుగా గేటు నుంచి విద్యార్థులకు వైన్‌షాపు కనిపిస్తోంది. రాత్రి 10 గంటల వరకూ వైన్‌షాపుతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న చిల్లర బడ్డీలు మందుబాబులతో నిండిపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సింగుపురం గ్రామ నడిబొడ్డున వైన్‌షాపును ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు, బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి దూరంలో షాపు ఏర్పాటు చేయాలని అప్పట్లో ఎకై ్సజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకోలే దు. ఇప్పటికై నా బీసీ హాస్టల్‌కు ఎదురుగా ఉన్న వైన్‌షాపును తరలించే చర్యలు తీసుకోవాలి. – ఆదిత్యనాయుడు, సర్పంచ్, సింగుపురం సింగుపురంలోని వైన్‌షాపును అన్ని నిబంధనలతో ఏర్పాటు చేశాం. దీనివలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్కూల్స్‌కు దగ్గర్లో వైన్‌షాపు ఉండకూడదు. కానీ హాస్టల్ ఎదురుగా ఉన్నా పర్వాలేదు. – ఎస్.గోపాలకృష్ణ, ఎకై ్సజ్ సీఐ -
మాజీ మంత్రిని కలిసిన ఆర్.నారాయణమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: విద్యా వ్యవస్థలో మాఫియా చేస్తున్న పేపర్ లీకేజ్‌తో విద్యార్థులకు జరగుతున్న అన్యాయాన్ని తెలియజేసే ‘యూనివర్శీటీ పేపర్ లీక్’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలీటిలో సోమవారం సినీ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పర్యటించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా వీక్షించేందుకు ఆహ్వానం పలికారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. శ్రీకాకుళం అర్బన్: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు సైతం వెనుకాడేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళంలోని దండివీధి వద్ద డీసీసీబీ బ్యాంక్ ఎదుట ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఏసీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాధ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోలుగు మోహనరావు, బల్లెడ రామారావు తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే జనవరి 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి దత్తి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బొడ్డేపల్లి సన్యాసిరావు, కె.లక్ష్మీనారాయణ, వై.పాపినాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్స్‌కు క్రమశిక్షణ ఎంతో అవసరం
శ్రీకాకుళం రూరల్: పోలీసు కానిస్టేబుల్స్‌కు క్రమశిక్షణతో పాటు శారీరక ధృడత్వం, సాంకేతిక నైపుణ్య త, ప్రజలకు సేవచేసే గుణం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికై న రాజమండ్రి, కృష్ణా జిల్లాలకు చెందిన 145 మంది కానిస్టేబుల్స్‌కు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ సమయంలో చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగం గౌరవప్రదమైందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధు లు నిర్వహించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్వేయంగా పనిచేయాల న్నారు. శిక్షణ పొందుతున్న ట్రైనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉద్యోగంలో సవాళ్లతో కూడిన ఒత్తిళ్లు వస్తాయని, మానవత్వాన్ని ఎప్పుడూ వదలకూడదని పేర్కొన్నారు. అదనపు ఎస్సీ, ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ కేవీ రమణ మాట్లాడుతూ శిక్షణ సమయంలో శారీరక ధృడత్వం, మానసిక స్థైర్యం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమన్నారు. సైబర్ నేరాలు ప్రస్తుత సమా జంలో సవాలుగా మారాయని, సాంకేతికను అంది పుచ్చుకొని అందుకు తగిన శిక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, శేషాద్రి, గోవిందరావు, ఏవో సీహెచ్ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా నెట్‌బాల్ ఎంపికలు
టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి నెట్‌బాల్ ఎంపికలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు తదితరులు ఈ ఎంపికలను ప్రారంభించారు. మహిళలు, పురుషుల విభాగంలో 12 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈనెల 27న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎంపికల్లో కె.రఘనాథరావు, కేకే రామిరెడ్డి, తిరుపతిరావు, బసవరాజు, జగదీష్, శైలజ, ప్రశాంతి, జానకి, శ్యామలరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి: మండల కేంద్రం పోలాకిలో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి పోలాకి వైపు వస్తున్న ఆటో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి, ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపక్కనే పున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న పల్లిపేటకు చెందిన ఒక యువకుడు, వెదుళ్లవలసకు చెందిన వృద్ధురాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. హెచ్‌సీ రామ్‌జీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పొందూరు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సనాతన హిందూ ధర్మ ప్రచారకులు, ప్రవచన శిరోమణి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురం ఆనందాశ్రమంలో సోమవారం ప్రవచనాలు చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. తల్లి, తండ్రి, గురువును గౌరవించినప్పుడు ఆరోగ్యకరమైన సమాజ స్థాపన జరుగుతుందన్నారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ నూతన చైర్మన్‌గా వాటర్ రిసోర్స్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ డోల తిరుమలరావు, కార్యదర్శిగా ఐతం కళాశాల ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నూతన కార్యవర్గ ఎన్నిక పరిశీలకులు ముని శ్రీనివాస్, చింతాడ రాజశేఖర్ పర్యవేక్షణలో నూతన కమిటీలో 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. నూతన చైర్మన్ డోల తిరుమలరావు మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎస్.నాగరాజు, హారికాప్రసాద్, వి.పాపారావు, సీహెచ్ రమేష్, బి.సంతోష్‌కుమార్, హెచ్.మన్మథరావు, కె.శ్రీనివాస రావు, డాక్టర్ సౌజన్యవాణి, డాక్టర్ బి.భరత్‌భూషణ్, ఎల్.సాయిశంకర్ దీక్షిత్, ఎస్.రుషి, ఎస్.హరీష్‌కుమార్, వెంకటరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి. జిల్లా ఫెర్సింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ పోటీలకు 13 నుంచి 19 ఏళ్ల బాలబాలికలు హాజరయ్యారు. ముందుగా ఈ ఎంపికలను ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలభద్రుని రాజా, అసోసియేషన్ ప్రతినిధులు వైశ్యరాజు మోహన్, ఎం.సుధీర్ వర్మ ప్రారంభించారు. ఎన్ఐ ఎస్ కోచ్ జోగిపాటి వంశీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఎంపికై న వారు ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్టపోటీలకు పంపిస్తామని రాజా పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు, కోచ్‌లు డి.భవానీ, అనిత శ్రీ, యశోద, రాహుల్, హేమంత్ రెడ్డి పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉండాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి అక్టోబరు నెలలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఉద్యోగ నియామకాలను సత్వరమే పూర్తి చేసి వారికి భరోసా కల్పించాలన్నారు. 2017 నుంచి 2025 వరకు జిల్లాలో నమోదైన 12 హత్య కేసుల్లో బాధిత కుటుంబ సభ్యుల విద్యార్హతల ఆధారంగా 12 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు సమావేశంలో పలువురు సభ్యులు క్షేత్రస్థాయి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రిమ్స్ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో రోస్టర్ పద్ధతి పాటించాలని, అక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. సోంపేట మండలంలో ఎస్టీల భూ సమస్యలు, ఐటీడీఏ సీతంపేట బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, పాతపట్నం వసతి గృహాల్లో సౌకర్యాలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా మందస, మెలియాపుట్టి మండలాల్లోని ఏకలవ్య పాఠశాల వసతి గృహాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపాధి కల్పించాలని, సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెల్స్‌కు రాయితీ ఇవ్వాలని విన్నవించారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, పలాస ఆర్డీవో వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, కమిటీ సభ్యులు గేదెల రమణమూర్తి, దాసరి తిరుమలరావు మాదిగ, దండాసి రాంబాబు, తోట రాములు, కళింగపట్నం అప్పన్న, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలు పంచాయతీల పునర్విభజన అశాసీ్త్రయంగా జరుగుతోందని, టీడీపీకి అనుకూలంగా విభజన చేస్తున్నారని, దీనిపై పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభు త్వం ఇటీవల పంచాయతీల విభజన చేసే ప్రక్రియలో భాగంగా కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అందు లో భాగంగా సారవకోట మండలంలో అలుదు, జలుమూరు మండలంలో అంధవరం, దరివాడ, పోలాకి మండలంలో బొద్దాం, నరసన్నపేట మండలంలో మడపాం, వి.ఎన్.పురం పంచాయతీల పరిధిలో గ్రామాలను వేరుచేసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సర్పంచ్, కార్యవర్గ ఆమోదం, తీర్మానం లేకుండా కొందరు వ్యక్తులు సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం తగదన్నారు. పంచాయతీ, ప్రజామోదం మేరకే విభజన చేయాలని కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, వాన గోపి, ముద్దాడ బైరాగి నాయుడు, కనపల శేఖర్‌రావు, రౌతు శంకరరావు, పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయితో యువకుడు అరెస్టు
నరసన్నపేట: ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న పూస దేవిచంద్ అనే వ్యక్తిని నరసన్నపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. అతడి వద్ద నుంచి 2.180 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు తెలిపారు. మడపాం టోల్గేట్ వద్ద ఎస్ఐ శేఖరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపడుతుండగా.. ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో దేవీచంద్ అనుమానాస్పదం కనిపించడంతో పట్టుకొని ఆరా తీయగా గంజాయి గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇతడు గుంటూరు జిల్లా మంగళగిరి మండ లం పాతూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా లోని జరగడగడ గ్రామానికి చెందిన సిమంచల్ సాహు వద్ద తక్కువ ధరకు గంజాయి కొని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఈయన వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
సుందరం.. చరిత్రాత్మకం
టెక్కలి సెంటినరీ ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో 130 ఏళ్లుగా వినియోగిస్తున్న ప్రార్థన గంట క్రిస్మస్ ముందస్తు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. క్రైస్తవ ఆరాధకులు ప్రార్థనలు, ఏసుక్రీస్తు గీతాలాపనలు, ర్యాలీలు, కేక్ కటింగ్‌తో సందడి చేస్తున్నా రు. అయితే ఈ ఉత్సాహం, సందడి మన జిల్లాలో ఇప్పటిది కాదు. వందేళ్ల కిందటి నుంచే సిక్కోలులో చర్చిలు ఏర్పాటయ్యా యి. అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. సిక్కోలులో చరిత్రాత్మక అంశాలతో కూడిన చర్చిల ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దామా.. టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని అంబేడ్కర్ కూడలిలో ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో 130 ఏళ్లుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. 1889లో సంఘం స్థాపించినప్పటికీ 1905లో కెనడాకు చెందిన క్రిస్టియన్ మిషనరీష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాల్డ్ ఆధ్వర్యంలో పాస్టర్ డబ్ల్యూ.హేగెన్స్ పర్యవేక్షణలో చర్చి నిర్మించారు. సుమారు 130 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రార్థన గంటను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. క్రిస్మస్ స్పెషల్శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఆర్సీఎం సహాయ మాత చర్చి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అతిపెద్ద ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. బిషప్ రాయరాల విజయకుమార్, ఫాదర్ పాల్భూషణ్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. పది రోజుల ముందుగానే చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని టౌనుహాలు రోడ్డులో పునీత తోమాసు దేవాలయం పేరిట ఉన్న సెయింట్ థామస్ చర్చిని రెండో పోప్ జాన్‌పాల్ నిర్మించారు. 1999లో పునరుద్ధరించిన ఈ చర్చిలో ఆరోగ్యమాత మందిరం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. వెయ్యి మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా పెద్ద హాలు ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం ఫాదర్ బోనెల రాజు ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో పురాతనమైన తెలుగు బాప్టిస్టు చర్చిలో పెద్ద పరిశుద్ద గ్రంథం(బైబిలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారీ తెలుగు అక్షరాలతో చదువుకునేందుకు వీలుగా గాజు బల్లపై అందుబాటులో ఉంచారు. ఏ–3 సైజుకన్నా పెద్దసైజులో బైడింగ్ చేసిన ఈ పుస్తకాన్ని బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తయారు చేసింది. రూ.5 వేలుతో కొనుగోలు చేసి ఇక్కడ ఉంచారు. 1832లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మిస్టర్ బ్రట్ జేమ్స్ డాసన్ క్రీస్తు ప్రార్థనా మందిరంగా ఏర్పాటు చేశారు. 1846 సెప్టెంబరు 12న తెలుగు బాప్టిస్టు చర్చి పేరిట ప్రారంభించారు. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు: పలాస జీఆర్పీ పరిధిలోని పూండి – పలాస రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం జరిగిన రైలు ప్రమా దంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీ ఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ప్రమాదంలో మృతి చెందిన ట్లు చెప్పారు. మృతుడి కుడి చేతిపై రాజు అనే పేరు తో ఉన్న లవ్ సింబల్, ఇత్తడి రింగ్ ఉందని చెప్పా రు. బ్లూ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ రంగు ప్యాంటు, తెలుపు రంగులోని కట్ బనియన్ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఎవరైనా గుర్తుపడితే తక్షణమే పలాస జీఆర్పీ పోలీసుల 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సిక్కోలు ఆటగాళ్లు దుమ్మురేపారు. కర్నూలు జిల్లా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన ఏపీ రాష్ట్ర స్థాయి జూడో క్యాడెట్, జూనియర్స్ జూడో చాంపియన్‌షిప్–2025 పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు నాలుగు పతకాలతో పాటు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వశం చేసుకున్నారు. కె.సౌమ్యరాణి, బి.అక్షయ బంగారు పతకాలు, కె.శివరామరాజు రజత పతకం, ఎస్.యశ్వంత్ ప్రసాద్ కాంస్య పతకం సాధించి సత్తాచాటారు. శాప్ జూడో కోచ్ పీఎస్ మణికుమార్ జిల్లా క్రీడాకారుల బృందం వెన్నెంటే ఉంటూ ప్రోత్సహంచారు. క్రీడాకారులను జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు పి.సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, కార్య నిర్వాహక కార్యదర్శి పైడి సునీత, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, డీఎస్డీఓ ఏ.మహేష్‌బాబు, పీడీ–పీఈటీ సంఘ అద్యక్షుడు పి.తవిటయ్య, సలహదారు పి.సుందరరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, ఆర్.స్వాతి, కోచ్ మణికుమార్ అభినందించారు. -
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పలాస: రామకృష్ణాపురం వద్ద సత్యసాయి విద్యావిహార్‌లో ఇటీవల రూ.లక్షా 40వేలు విలువైన ఐరన్ పోల్స్‌ను దొంగిలించిన కేసులో గౌరీశంకర్, మోహనరావు, తాతారావు, ప్రకాశరావు అనే నలుగురిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపరచగా పాతపట్నం సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు. అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలను ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ సురేష్‌కుమార్, కమర్షియల్ ఏడీఈ రామ్మోహన్, డీ–1 ఏఈ జె.సురేష్‌కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు. ఎచ్చెర్ల : కుశాలపురంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు బి.జానకిరామయ్య, విక్టర్‌పాల్, అధ్యాపకులు దామోదరరావు, డి.మురళీకృష్ణ, ఇన్చార్జ్ పీడీ ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్: మునసబుపేట గాయత్రీ కళాశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబొ మ్మాళి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు(60), అనపాన గణేష్ ద్విచక్రవాహనంపై కోటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాయత్రీ కళాశాల సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న భాస్కరరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నువ్వే అన్నా!
నాయక రత్నం ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో ఫీడర్ అంబులెన్స్ లేకపోతే నాప్రాణాలు పోయేవి. నా బిడ్డతో ఈరోజు క్షేమంగా ఉన్నానంటే అది జగనన్న పెట్టిన భిక్షే. సరిగ్గా రెండున్నరేళ్ల కిందట డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రివేళ జోరువాన, ఎటూ కదల్లేని పరిస్థితిలో సైతం టెక్నీషియన్ మా గ్రామానికి వచ్చి ఫీడర్ అంబులెన్స్ ద్వారా మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాణాపాయం తప్పి డెలివరీ జరిగింది. వైద్యులు ఎంతో చక్కగా వైద్యాన్ని అందించి నా ప్రాణాలు కాపాడారు. జగనన్నకు ధన్యవాదాలు. – గొందర లక్ష్మీ, కేరాసింగి గ్రామం. సంక్షేమ సంతకం -
మత్తుతో జీవితం చిత్తు
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభ్యుదయ సైకిల్ యాత్ర వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్లు విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలు శనివారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29తో ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరగాల్సివుండగా, జనాదారణ పెరగడంతో యాత్ర పొడిగించామని, వచ్చే నెల 3న ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరుగుతుందని వెల్లడించారు. టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
సంప్రదాయాలను కాపాడదాం
శ్రీకాకుళం రూరల్ : కళలను బతికించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పద్మభూషణ్ అవార్డు గ్రహీత వరప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. కల్లేపల్లి గ్రామంలోని సంప్రదాయ గురుకులంలో శనివారం అర్ధనారీశ్వర నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయ నృత్యాలకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న రథసప్తమికి టూరిజం తరఫున జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు మాట్లాడుతూ కళలకు కులం, జాతీ ఏదీ అడ్డురాదన్నారు. అనంతరం వరప్రసాద్‌రెడ్డి సంప్రదాయ గురుకులం ట్రస్టుకు కలెక్టర్ చేతుల మీదుగా రూ.50 లక్షలు అందించారు. కార్యక్రమంలో సంప్రదాయం గురుకుల డైరెక్టర్ స్వాతి సోమనాథ్, తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దేవుడి కంటే ముందు గుర్తొచ్చేది జగనే
ఈ రోజు నేను ఇలా మా కుటుంబంతో ఆనందంగా జీవించి ఉన్నానంటే వైఎస్ జగన్ చేసి న మేలే అందుకు కారణం. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి నన్ను బతికించా రు. మాది పోలాకి మండలం పాలవలస గ్రామం. నా భర్త జోగారావుతో కలిసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్నాను. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఉన్నంతలో ఆనందంగా ఉండే మాపై ఎవరి దిష్టి పడిందో గానీ, మాయదారి రోగం నన్ను అనారోగ్యం పాలుచేసింది. తొలుత ఆస్పత్రుల్లో డాక్టర్లకు చూపించిన తర్వాత పెద్ద జబ్బు అని చెప్పారు. ఏం చేయాలో నాకు తెలీలేదు. చేతిలో డబ్బుల్లేవు. పెద్దాస్పత్రికి వెళ్లలేను. అలాంటి టైములో నా పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ గురించి చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లి మా వివరాలు ఇచ్చిన వెంటనే నాకు పూర్తి ఉచితంగా చికిత్స చేశారు. దాదాపు నెలరోజుల తరువాత పూర్తిగా వ్యాధి నయమైందని డాక్టర్లు మాకు చెప్పినపుడు దేవుడి కంటే ముందు జగన్ మాకు గుర్తొచ్చాడు. లక్షల్లో ఖర్చు అయ్యే ఇలాంటి వైద్యం మాలాంటి కుటుంబాలకు సాధ్యం కాని పని. మాలాంటి అనేకమంది దీవెనలు ఉన్నంతవరకు జగన్‌కు అంతా మంచే జరుగుతుంది. మాఅందరి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. – రాజులమ్మఆరోగ్యశ్రీ -
అతివకు ఆసరా
నా యుక్త వయస్సులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరి మహిళగా మిగిలిపోయాను. పింఛన్ కోసం ఎంతో మందిని కలిసినా ఎవరూ దయ చూపించలేదు. మా గ్రామంలో సాయిలక్ష్మీ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో జగనన్న ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా నా జీవనానికి అండగా నిలబడింది. ఆ ఆసరానే నా జీవితానికి ‘పూల బాట’గా మారింది. మా గ్రామ దేవత ఆలయం చెంత పూల వ్యాపారం, దేవుని పూజా సామగ్రి కొట్టును పెట్టుకున్నాను. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష 50వేలు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాను. జగనన్నే ఉండి ఉంటే నాకు ఇచ్చిన ఇంటి నిర్మాణం కూడా పూర్తయి ఉండేది. – సాడి మీనాక్షి, లొద్దపుట్టి జంక్షన్, ఇచ్ఛాపురం మండలం -
విద్యాభివృద్ధి
వైఎస్ జగన్ రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్ చేశారు నా పేరు డబ్బీరు హరీష్. మాది టెక్కలి. ఓ సాధారణ కుటుంబం. నాన్న విశాఖలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అమ్మ ఇంటి వద్దనే టైలరింగ్ చేస్తుంటారు. 2022లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలో మెకానికల్ విభాగం సీటు సాధించాను. అప్పటికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంజినీరింగ్‌లో అయితే చేరాను గానీ ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ వైఎస్ జగన్ హయాంలో ఐదు దఫాలుగా రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో అందాయి. రెండేళ్లు చక్కగా చదువుకుని మూడో ఏడాదికి వచ్చేశాను. ప్రభుత్వం మారాక ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు పడలేదు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నాను. మరో మూడు నెలల్లో చదువు పూర్తవుతుంది. ఇటీవల అప్పు చేసి మరీ రూ.46 వేలు ఫీజు కట్టాం. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎక్కడో హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వాకిట వరకు ప్రవహించిన వంశ‘ధార’కు కారణమతడు. ఉద్దానం నుదుటిపై అసమర్థ నాయకులు రాసిన అర్ధాయుష్షు రాతను సమూలంగా మార్చిన నాయకుడతడు. సిక్కోలు గుండెలోని వెనుకబాటు వేదనను అర్థం చేసుకున్న తొలి ప్రజా ప్రతినిధి. దశాబ్దాల తరబడి ఏలిన వారి మాటలు వినడం, ప్రచారాలకు మురిసిపోవడమే తెలిసిన సిక్కోలుకు పనులు చేసి చూపించిన సమర్థుడు. వలసలే బతుకుదెరువుగా మారిన ఈ జిల్లా మంచి కోసం ఆలోచించిన అరుదైన మనిషి. వైఎస్ జగన్ పాలనలో సిక్కోలు గతమెన్నడూ చూడని ప్రగతిని చూసింది. అందుకు సాక్ష్యాలివే.. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళందశాబ్దాలుగా చావుకు అలవాటుపడిపోయిన ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం వైఎస్ జగన్ పలాసలో కిడ్నీ ఆస్పత్రి కట్టించారు. ఈ ఆస్పత్రి వచ్చాకే కిడ్నీ రోగులు ఊపిరి పీ ల్చుకున్నారు. ఈ ఆస్పత్రి మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతోంది. వైఎస్ జగన్ నిర్మించిన వైఎస్సార్ సుజలధార స్రవంతి పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతోంది. నేను ఏడాది కాలంగా కిడ్నీ వ్యాధితో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. ముందుగా ఆరోగ్యం బాగులేకపోవడంతో విశాఖపట్నంలోని ఎన్.ఆర్.ఐ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ చా లా డబ్బులు ఖర్చయ్యాయి. వారు కిడ్నీ వ్యాధి ఉందని చెప్పగా అక్కడ నుంచి పలాస కిడ్నీ ఆస్పత్రికి వచ్చి అందులో చేరాను. జగనన్న ప్రభు త్వం హయాంలో 5 పాయింట్లు ఉంటే పింఛన్ ఇచ్చి ఆదుకున్నారు. ఇలాంటి ఆస్పత్రి కట్టిన జగనన్న నిజంగా దేవుడు. జగనన్నకు ధన్యవాదాలు. – అంబటి రామకృష్ణ, కిడ్నీ రోగి, డోకులపాడు, వజ్రపుకొత్తూరు -
కొత్త టీచర్లకు జీతాలు చెల్లింపు
శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్సీ–25 ఉపాధ్యాయులకు ఎట్టకేలకు జీతాలు మంజూరయ్యాయి. ‘వీరు చేసిన పాపమేమిటో’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బిల్లులో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసి పంపించాలని ఎంఈఓకు టెక్కలి ఖజానా శాఖ అధికారులు సూచించారు. బిల్లులు సరిచేసి దాఖలు చేయడంతో మూడు నెలలకు సంబంధించిన జీతాలు మంజూరయ్యాయి. సర్పంచ్‌గా ఉంటూ ఉద్యోగానికి ఎంపిక కావడంతో సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఒక అభ్యర్థికి సంబంధించిన బిల్లు మాత్రం పెండింగ్‌లో ఉంది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో క్లియర్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. -
రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందని, బీజేపీని సాగనంపితేనే దేశానికి భవిష్యత్ ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. స్థానిక ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో సీపీఐ జిల్లా కార్యవర్గ, సమితి సమావేశాలను శుక్రవారం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.నారాయణ స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమితి సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరమైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇటీవల జరిగిన ఇండిగో సంక్షోభమే నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడమే కాకుండా, గాంధీ పేరును కూడా లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెడుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై మున్ముందు జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ తదితరులు పాల్గొన్నారు. -
● డ్రగ్స్ వద్దు బ్రో..!
గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడకండి.. వీటి బారిన పడి మీ అందమైన భవిష్యత్తును అంధకారం చేసుకోకండి.. డ్రగ్స్ వద్దు బ్రో..అంటూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నరసన్నపేటలో శుక్రవారం అభ్యుదయ యాత్ర చేపట్టారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి యువతలో చైతన్యం తీసుకురావడానికి సత్యవరం కూడలి నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేశారు. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఈగల్ క్లబ్ ఇన్చార్జి సీఐ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. – నరసన్నపేట -
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
● రేపు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ● కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఎంపికలు ● రాణిస్తే నేరుగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికశ్రీకాకుళం న్యూకాలనీ: క్రాస్ కంట్రీ ఎంపికల పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరగనున్న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ(దూరపు పరుగు) ఎంపిక పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. సెలక్షన్ కమిటీని, టెక్నికల్ అఫీషియల్స్‌ను నియమించారు. శనివారం సాయంత్రం తుది మెరుగులు దిద్దనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 నుంచి 500 మంది అథ్లెట్లు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ రాణించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. నాలుగు వయో విభాగాల్లో పోరు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో జరగనున్నాయి. అండర్–16, 18, 20, సీనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. అండర్–16 నుంచి అండర్–20 మధ్య మూడు వయో విభాగాలకు 2012 జనవరి 24 నుంచి 2006 జనవరి 25 మధ్య జన్మించినవారు అర్హులుగా నిర్ణయించారు. సీనియర్స్ పురుషులు, మహిళల విభాగానికి 2006 జనవరి 24వ తేదీలోపు జన్మించినవారు అర్హులని సెలక్షన్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు(9441570361)ను సంప్రదించాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తిలు తెలిపారు. ఎంపికై తే రాష్ట్రస్థాయి పోటీలకు ఇక్కడ ఎంపికై న అథ్లెట్లను రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. కాకినాడ వేదికగా ఈనెల 24వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్–2025 పోటీలకు పంపించనున్నారు. ఇక్కడ రాణించినవారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. కేఆర్ స్టేడియంలో జరిగే ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఉదయం 8 గంటలకు గ్రౌండ్‌కు చేరుకోవాలి. – మెంటాడ సాంబమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాస్ కంట్రీ అథ్లెట్స్‌కు ఇదొక గొప్ప అవకాశం. జిల్లాస్థాయి ఎంపికలను క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికవ్వాలి. అక్కడ రాణిస్తే జాతీయ పోటీలకు ఎంపిక కావచ్చు. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు -
మనవాడైతే చాలు..
శ్రీకాకుళంజిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. కోడిరామ్మూర్తి స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. –8లోశనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ముంపు ముప్పును తప్పించండి హిరమండలం: గొట్టా బ్యారేజీ సమీపంలో వంశధార చెంతనే ఉన్న తుంగతంపర గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. కరకట్టలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏటా వర్షాకాలంలో గ్రామంలోకి వరద నీరు చొచ్చుకొస్తోందని, పంటలు ముంపుబారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గొట్టా బ్యారేజీకి ఎగువనున్న గట్టుకు గండిపడటంతో ముంపు సమస్య తప్పడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గండి పూడ్చడంతో పాటు నదీ తీరాన కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని వంశధార అధికారులు తెలిపారు. మంచినీటి పథకాల పనులు పూర్తి చేయాలి అరసవల్లి: ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన మంచినీటి పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. 2019 నుంచి మంజూరైన పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఎక్కడైనా నిధులుమంజూరై పనుల నిలిపివేత జరిగితే వాటి వివరాలను వెంటనే తనకు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు. వాజ్‌పేయి విగ్రహావిష్కరణ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలో సూర్యమహాల్ జంక్షన్ వద్ద వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరత తీర్చవచ్చన్నారు. నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. వెనకొచ్చినా బిల్లు !ఈ ఫొటోలో ఉన్న రోడ్డు చూడండి. 2024 మార్చి 28న జిల్లా కేంద్రంలోని పీఎన్ కాలనీ మూడో లైన్లో రూ.10.93 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిది. దీని బిల్లు ఇంతవరకు చెల్లించలేదు. ఇదే కాలనీలో ఎనిమిదో లైన్లో రూ.13.05లక్షలతో 2024 డిసెంబర్ 21 రహదారి వేసారు. దానికి సంబంధించిన బిల్లు కూడా చెల్లింపులు చేయలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లను పట్టించుకోకుండా.. నేతల సిఫార్సులున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారు. కీలక నేత పంపించే జాబితాలో ఉన్న వారికే చెల్లింపులు చేస్తున్నారు. ఆ జాబితాలో పేరు లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లిస్తున్నారో చెప్పాలంటూ సమాచార హక్కు చట్టాన్ని సైతం ఆశ్రయిస్తున్నారు. ఏంటీ దారుణం? టీడీపీ పాలనలో కొందరు కాంట్రాక్టర్ల దుస్థితి దారుణంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మా బిల్లులు మాకివ్వండి మహాప్రభో అంటూ ప్రాధేయపడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో సామాన్య కాంట్రాక్టర్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురైదుగురు కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. చెల్లింపుల విషయంలో అధికారులు సైతం డమ్మీలుగా మిగిలిపోతున్నారు. కీలక నేత చెప్పిన వాళ్లకే బిల్లులు చెల్లించి, మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. కార్పొరేషన్ పరిధిలో చాలా పనులకు చెల్లింపులు జరగలేదు. దాదాపు రూ.8 కోట్లకు సంబంధించి 200 వర్క్స్ వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వాస్తవానికి బిల్లులు చెల్లింపుల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలు ఉన్నాయి. ముందుగా చేసిన పనికి ముందుగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఒకేసారి జరిగిన పనులకు ఒకేసారి చెల్లింపులు చేయాలి. కానీ, శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో నిబంధనలు పాటించకుండా, ప్రలోభాలకు, సిఫార్సులకు లోనై ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయడం లేదు. కావాల్సిన వారికి త్వరితగతిన చెక్‌ల ద్వారా చెల్లింపులు చేస్తుండగా.. కాని వారికి సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి వదిలేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన వాటికి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. ప్రభుత్వ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వాళ్లకే త్వరితగతిన నిధులు జమ అవుతాయి. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో ఇదే జరుగుతోంది. అధికార పార్టీ కోటరీ.. శ్రీకాకుళం కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కోటరీ రాజ్యమేలుతోంది. అక్కడ ఏ పనులు చేపట్టాలన్నా.. ఏ బిల్లులు చెల్లించాలన్నా వారి చేతుల్లోనే ఉంటుంది. ఆ కోటరీ అంతా కీలక నేత కనుసన్నల్లో పనిచేస్తోంది. ఏదైనా వర్క్ చేస్తే దానికి 2 శాతం కమీషన్ తీసుకోవడం ఆనవాయితీ నడుస్తోంది. కానీ, ఇక్కడ 5 శాతం, 10 శాతం, 15 శాతం కూడా ఇచ్చుకోవాల్సిందే. ఆ మేరకు పర్సంటేజీ ఫిక్స్ చేసేశారు. ఇవన్నీ కీలక నేతకే చేరుతున్నాయి. ఆ స్థాయిలో ముడుపులిచ్చిన వాళ్లకే పనులు జరుగుతున్నాయి. ఆ ముడుపులు ఇచ్చిన వాళ్లు కూడా అస్మదీయులై ఉండాలి. ఆ స్థాయిలో ముడుపులు ఇవ్వడం గిట్టుబాటు కాదనుకుంటే బిల్లు మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం కార్పొరేషన్లో అదే జరుగుతోంది. ఈ విషయంలో అధికార యంత్రాంగం డమ్మీగా మారిపోయింది. శ్రీకాకుళం కార్పొరేషన్లో అడ్డగోలు బాగోతం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతం కీలక నేత కనుసన్నల్లో వివక్ష అత్యధిక పర్సంటేజీలకే అగ్రతాంబూలం ప్రేక్షక పాత్రకు పరిమితమైన అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదులు.. బిల్లుల చెల్లింపుల్లో వివక్షపై సంబంధిత కాంట్రాక్టర్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌ను ఆశ్రయించక తప్పడం లేదు. కొందరికి చెల్లింపులు చేసి, మరికొందరివి పెండింగ్‌లో పెట్టడంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసి కాంట్రాక్టర్లు వివరణ కోరుతున్నారు. ఏ ప్రాతిపదికన కొందరికి చెల్లింపులు చేశారు...ఏ ప్రాతిపదికన కొందరివి పెండింగ్‌లో పెట్టారో తెలియజేయాలని కోరుతున్నారు. అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. పండగలా జగనన్న పుట్టిన రోజు వేడుకలు నరసన్నపేట: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పండగలా నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో.. ఇలా అన్ని చోట్లా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ, కార్యక్రమాలు ఎంతో విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ తరహాలోనే జగనన్న పుట్టిన రోజు వేడుకలు కూడా కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకమై వాడవాడలా హోర్డింగులు పెట్టాలని, కేక్‌కటింగ్‌లు, సంబరాలు జరపాలని, రక్త దాన శిబిరాలు నిర్వహించాలని, పేదలకు సాయమందించేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
అబ్బురపరిచిన.. వైజ్ఞానిక ప్రదర్శన
● సైన్స్ ఎగ్జిబిషన్లో 310 ప్రాజెక్టుల ప్రదర్శన ● రాష్ట్రస్థాయికి 11 ప్రాజెక్టుల ఎంపిక శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గురజాడ విద్యాసంస్థల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. దీనిలో గ్రూప్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత, ఉపాధ్యాయ కేటగిరికు చెందిన 310 సైన్సు ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. గ్రూప్ విభాగం నుంచి 7 ప్రాజెక్టులు, వ్యక్తిగత విభాగం నుంచి 2 ప్రాజెక్టులు, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండు సైన్సు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు ప్రారంభించిన కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయ్‌కుమారి, పి.విలియన్స్, జిల్లా సైన్సు ప్రాజెక్టు అధికారి ఎన్.కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు ● ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఐ.సంజన, అనిల్‌లు కలిసి మల్టీపర్పస్ అగ్రికల్చర్ (సూర్యశక్తి ద్వారా సోలార్ ప్యానల్లో విద్యుత్ సరఫరాపై) ప్రాజెక్టును వివరించారు. ● సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎంజేపీ స్కూల్ విద్యార్థులు బి.నరేష్, ఎ.సుధ ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన వాటర్ ఎక్స్‌ట్రాక్టింగ్ విజనరీ హౌస్(మురుగునీటి పునర్వినియోగం)ను తయారు చేశారు. ● సోంపేటకు చెందిన జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు బి.యోగేశ్వరి, నిఖిత, విజయలక్ష్మిలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి న్యూ క్లియర్ పవర్ ప్లాంట్‌ను తయారు చేశారు. ● శ్రీకాకుళం గవర్నమెంట్ బాలికల స్కూల్‌కు చెందిన బి.హరిశ్రీ, తనుశ్రీ, బి.కృష్ణారావులు ఎమర్జింగ్ టెక్నాలజీతో యాంటీ సూసైడ్ ఫ్యాన్‌ను తయారు చేసి వివరించారు. ● పొందూరు గవర్నమెంట్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు కేకే పృథ్వీరాజ్, కె.దిలీప్‌కుమార్, బి.రమణలు హెల్త్ అండ్ హైజనిక్పై ప్రాజెక్టు తయారు చేశారు. ● జి.సిగడాం జెడ్పీహెచ్ స్కూల్‌కు చెందిన కె.గోపి, ఎం.ఆనంద్రాజులు కలిసి ప్యూరిఫికేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్‌పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు. ● సోంపేట ఏపీఎంఎస్ స్కూల్‌కు చెందిన విద్యార్థి కృష్ణవర్దన్ స్మార్ట్ సెన్సార్‌పై ప్రాజెక్టును తయారు చేశారు. ● టెక్కలి జెడ్పీహెచ్ పోలవరం స్కూల్‌కు చెందిన ఎన్.కౌషీ, కె.ఆచార్య కలిసి రియల్ టైమ్ విజిటర్స్ కౌంటర్ ప్రాజెక్టును తయారు చేశారు. ● టీచర్స్ ప్రాజెక్టుకు సంబంధించి లావేరు మండలంలోని అదపాక జెడ్పీహెచ్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న కె.కిరణ్‌కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అప్లికేషన్‌పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు. ● గార మండలంలోని వాడాడ జెడ్పీహెచ్ స్కూల్‌కి చెందిన సైన్స్ టీచర్ బి.వెంకట్రావు ఇన్నోవేట్ లోకాస్ట్ టీచింగ్ టూల్స్‌పై ప్రాజెక్టును వివరించారు. -
అగ్నివీర్‌కు ఎన్సీసీ క్యాడెట్లు
● రికార్డు స్థాయిలో 25 మంది ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో.. అదే కళాశాలలో చదువుతున్న 14వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు రికార్డు స్థాయిలో 25 మంది ఎంపికయ్యారు. 2025 ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్‌తో పాటు అనేకమంది ఎన్సీసీ–బీ సర్టిఫికెట్లు అర్హతలు పొందిన విద్యార్థులు అగ్నివీర్‌కు ఎంపికై నవారిలో ఉన్నారు. దీంతో వీరిని కళాశాలలో ఎన్సీసీ అధికారి కెప్టెన్ యాళ్ల పోలినాయుడు శుక్రవారం కళాశాలలో అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సరుబుజ్జిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు నమోదు చేసి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల పెరుగుతున్నా పోలీసులు నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని ధ్వజమెత్తారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తాం
సరుబుజ్జిలి: మండలంలోని పురుషోత్తపురం పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతుందని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. గ్రామంలో తన తండ్రి కిల్లి వెంకటప్పలనాయుడు పేరుమీదుగా నిర్మించిన పీహెచ్సీ ఆవరణలో ఏర్పాటు చేసిన తమ తల్లిదండ్రులు వెంకటప్పలనాయుడు, విశాలాక్ష్మి విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిల్లి రామ్మోహనరావు, శ్రీరామ్మూర్తి, వెంకటరమణ, పంచాయితీ ఉప సర్పంచ్ పైడి నర్సింహప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈక్యూ ఫర్ పీస్తో బీఆర్‌ఏయూ ఎంవోయూ ఎచ్చెర్ల: ఆన్లైన్ క్లాసుల బోధనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా(అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకుంది. బీఆర్‌ఏయూ వీసీ కేఆర్ రజనీ సమక్షంలో రిజిస్ట్రార్ అచార్య బి.అడ్డయ్య, ఈక్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షులు డా.చల్లా కష్ణానీర్, అభిషేక్‌లు సంతకాలు చేశారు. ఎంవోయూల వలన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందుతుందన్నారు. మహిళ అదృశ్యం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని చంపాగల్లివీధికి చెందిన ఒక మహిళ అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు. కూరగాయలు కొనేందుకు పొట్టి శ్రీరాములు మార్కెట్‌కు తల్లితో వచ్చిన ఈమె, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
రైతులను మోసగిస్తే చర్యలు
ఆమదాలవలస: రైతులను దోచుకోవాలని చూస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమదాలవలసలోని రాష్ట్ర గిడ్డంగుల కార్యాలయంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిల్లర్ల తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని అందిస్తున్నా కొందరు మిల్లర్లు ఎఫ్‌సీఐకి పంపే బియ్యంలో నూక శాతం ఎక్కువగా వస్తోందని చెబుతూ గిడ్డంగులకు తీసుకువచ్చిన బియ్యం లారీల లోడింగ్–అన్లోడింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు గుర్తించారు. మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిల్లుల వద్ద రోజుల తరబడి గడపాల్సి వస్తోందన్నారు. తనిఖీల్లో తహసీల్దార్ ఎస్.రాంబాబు, వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణ రంగం కుదేలైంది
ఈ ఏడాది ఆరంభం నుంచి పూర్తిగా నిర్మాణ రంగం పడకేసింది. భూములు ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడం కష్టమైపోయింది. బిల్డర్లు, ఇంజినీర్లు సైతం స్థలాలు కొనలేక భవనాలు నిర్మించలేక నిర్మాణాలు ఆపేశారు. దీంతో నా వద్ద పనిచేసే కూలీలు, తాపీమేసీ్త్రలందరికి పని కల్పించలేపోతున్నాం. – ఎన్.కామేశ్వరరావు, పెద్దమేసీ్త్ర, పాతబస్టాండ్. పనులు లేక తీవ్ర ఇబ్బందులు గత 20 ఏళ్లుగా పెయింటింగ్ పనులు చేస్తున్నాం. ఎప్పుడూ ఇంత దారుణంగా లేదు. పనులు లేక నా దగ్గర పనిచేసే 20 మందికి పని కల్పించలేకపోతున్నాం. తాపీ మేసీ్త్రలకు, ఇంజినీర్లను అడిగితే రియల్ఎస్టేట్ వ్యాపారాలు లేవు, నిర్మాణాలు అంతగా లేవు దీంతో పెయింటింగ్ పనులు ఇవ్వలేకపోతున్నామంటున్నారు. ఇలానే పరిస్థితి ఉంటే ఇంకో వృత్తిని ఎంచుకోక తప్పదు. – పి.వెంకటరమణ, పెయింటింగ్ మేసీ్త్ర, హాస్పటల్ రోడ్ కొనుగోలు శక్తి తగ్గింది ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో క్రయవిక్రయాలు తగ్గాయి. పూర్తిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. నగదు రొటేషన్ లేకపోవడంతో ఏ రంగంలోనూ వ్యాపారాలు సరిగా జరగడం లేదు. దీంతో భూముల కొనుగోలు కూడా తగ్గింది. నిర్మాణ రంగంపై ఆధారపడిన మిగతా రంగాలు కుదేలవుతున్నాయి. పెట్టుబడులు పెట్టేసి ఇబ్బందులు పడుతున్నాం. – దుంపల లక్ష్మణరావు, రియల్ ఎస్టేట్ చిరు వ్యాపారి, శ్రీకాకుళం -
ఎంఎంఎస్ ఎన్నికల్లో రాజకీయం
కొత్తూరు: రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన మండల మహిళ సమాఖ్య అధ్యక్ష ఎన్నికలను టీడీపీ వర్గీయులు రాజకీయం చేసి వదిలేశారు. కొత్తూరు మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల వారి మధ్య తోపులాట జరిగింది. ఎంఎంఎస్ ఎన్నిక కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామైక్య సంఘాల అధ్యక్షులు (వీఓ) కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తీర్మానాలను వెంట తీసుకురాని వీఓలను కార్యాలయంలోకి పోలీస్‌లు అనుమతించలేదు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం రేగి తోపులాటకు దా రి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మండలంలో 46 వీఓ అధ్యక్షులకు గాను 41 మంది వచ్చినా ఇక్కడ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఎన్నిక వాయిదా వేసినట్లు వెలుగు లీగల్ కోఆర్డినేటర్ సాహు తెలిపారు. -
ప్రైవేటీకరణం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భయం సామాన్యులను ఇంకా వదలడం లేదు. వైద్య విద్య దూరమవుతుందని విద్యార్థులు బాధ పడుతుంటే, సర్కారు వైద్యం ఖరీదైపోతుందేమోనని పేద, మధ్య తరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై వైఎస్సార్ సీపీ అలుపెరుగని పోరాటం చేస్తోంది. ప్రభుత్వం పునరాలోచించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది. దీని ప్రభావంతో వైద్యం కూడా పేద, మధ్య తరగతి వర్గాలకు భారమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. – సాడి. జ్యోత్స్న, ఇంటర్ విద్యార్థిని, కేసరపడ గ్రామం, కంచిలి మండలంవైద్య విద్య ప్రశ్నార్థకమే.. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య ప్రశ్నార్థకమవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు రూ.15 వేలు అవ్వాల్సింది ప్రైవేటు కాలేజీలో దాదాపు కోటిన్నర ఖర్చవుతుంది. – మామిడి వేణునాయుడు, మామిడివలస, బూర్జ మండలం -
ధాన్యం కొనుగోలు తీరుపై విచారణ
పోలాకి: ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై సర్వత్రా రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రకమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ ఆదేశాలతో జిల్లాలో గురువారం పర్యటించి విచార ణ చేపట్టిన అధికారుల బృందం పలువురు రైతు లు, మిల్లర్లతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందితో మా ట్లాడి వివరాలు సేకరించారు. కమిటీ సభ్యులు జి.శిరీష(అడ్మిన్ మేనేజర్), టి.సుశీల(విజిలెన్స్ మేనేజర్)లు జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి పోలాకి మండలంలో గురువారం పర్యటించిన నేపథ్యంలో సాక్షిలో ప్రచురితమైన ‘మూడొంతులు దళారీలవే’ అనే కథనంపై ఆరా తీశారు. వైఎస్సార్సీపీ మండల రైతువిభాగం అధ్యక్షుడు యేదూరి శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యు డు ధర్మాన కృష్ణచైతన్యలను సంప్రదించే ప్రయ త్నం చేయగా వారు అందుబాటులో లేకపోవటంతో ఫోన్లోనే సివిల్ సప్లై, వ్యవసాయశాఖ అధికారులకు వేర్వేరుగా వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దళారీలు, మధ్యవర్తుల కు రైతులు ఎందుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందో వివరించారు. -
ఇక డిజిటల్ విధానంలో పింఛన్ ప్రయోజనాలు
● పెన్షన్ ఆదాలత్‌లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ అరసవల్లి: ప్రభుత్వ శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపై మరింత సరళంగా పింఛను ప్రయోజనాలు అందేలా డిజిటలైజేషన్ ద్వారా కొత్త విధానాలు అమల్లోకి తెచ్చినట్లుగా ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ ప్రకటించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై పింఛన్‌దారులకు అందనున్న ఆన్లైన్ సేవలను వివరించారు. అలాగే అదాలత్‌లో పలువురు పింఛనర్ల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్బీపీఎస్ అనే విధానం ద్వారా పింఛనర్లకు పదవీ విరమణ చేసిన 30 రోజుల్లోనే అన్ని ఆర్థిక బెనిఫిట్స్ అందించాలని సిటిజన్ ఛార్టర్ ప్రిపేర్ చేశారని, అయితే మన రాష్ట్రంలో ఈ బెనిఫిట్స్‌ను 20 రోజుల్లో అందించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. పెన్షన్, జిపిఎఫ్ సర్వీసుల కోసం కొత్తగా ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి తన సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా పూర్తి డాక్యుమెంటేషన్‌ను ఇక మీదట ఆన్లైన్లో స్వయంగా అప్లోడ్ చేసేలా వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. డీడీఓ స్థాయిలో సమస్య లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి మండలస్థాయిలో ఇలాంటి అదాలత్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆన్లైన్ పోర్టల్‌కు చెందిన పోస్టర్లను ఆమె మిగిలిన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఏపీ ఎన్జీఓ సంఘ ప్రతినిధులు హనుమంతు సాయిరాం బృందం శాంతిప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విచారణ
ఎచ్చెర్ల: రాజీవ్ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళం ప్రాంగణంలో విద్యార్థినులు తమపై వేధింపులు జరుగుతున్నాయని మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) ద్వారా విచారణ కొనసాగుతోంది. విద్యార్థులు మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు అనంతరం ఇక్కడ ఐసీసీ కమిటీ వేసిన విషయం విదితమే. కమిటీ సభ్యులు ప్రొఫెసర్ శ్రావణికనకకుమారి, అడ్వకేట్ పద్మజ, హెచ్‌సీ సరితలు వి ద్యార్థినుల వసతి గృహాలకు వెళ్లి వేధింపులపై ఆరా తీశారు. డీఎంపై ఫిర్యాదుపై విచారణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్, ఆ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై గురువారం విజయవాడ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టారు. కానీ ఈ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచారు. వాస్తవానికి జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా విజయవాడ కా ర్పొరేషన్ అధికారులు కమిటీగా గోప్యంగా వచ్చి ఫిర్యాదుదారు పోలాకి మండలం సుస రాం గ్రామం శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు యజమాని తమ్మినేని భూషణరావుని పిలిపించి విచారణ చేశారు. ఈ వైఖరిపై చాలామంది మిల్లర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కరినే విచారించడం, ఆ సమయంలో డీఎం సీఎస్ లేకపోవడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు కాకుండా వేరే శాఖలోని ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తే మిల్లర్లకు న్యాయం జరిగేదని వారంటున్నారు. కమిటీ కూడా ఫిర్యాదు వివరాలు రాతపూర్వకంగా అడిగినందుకు ఆయన మరో ఫిర్యాదు చేశారు. 2024లో తమ మిల్లుకు 32, 908 క్వింటాళ్ల టార్గెట్ ఇస్తే ఈఏడాది 12,990 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని, ఒక్కో మిల్లుకు ఒక్కోలా టార్గెట్ ఇచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అధికారులకు విన్నవించినా చర్యలు లేవని, దీంతో 8వ తేదీన గ్రీవె న్స్లో ఫిర్యాదు చేశానన్నారు. టార్గెట్ పెంచాల ని కలెక్టర్ సివిల్ సప్లై డీఎంకు ఆదేశించినా అమలు చేయలేదన్నారు. ఈ నెల 15న కలెక్టర్ తనను పిలిపించి మాట్లాడారని తెలిపారు. అయినా తనకు ఇంతవరకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఒక రైస్‌మిల్లు నుంచి ఏసీకేకు రూ.2500 వరకు డీఎం తీసుకుంటున్నారని ఆరోపించారు. -
ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం స్ఫూర్తిదాయకం
● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఎచ్చెర్ల: ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ఇచ్చిన సందేశాలు, చేసిన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ‘ద రోల్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేసీ) ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ రెలిజియన్ పెర్సిపెక్టివ్ ఆఫ్ కె.ఎస్ మూర్తి’ అనే అంశంపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభించారు. క్యాంపస్‌లోని ప్రధాన పరిపాలనా భవనంలో కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రా రంభ సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. 2020 నూతన విద్యా కార్యక్రమంలో పొందుపరిచిన జాతీయ విజ్ఞాన వ్యవస్థ విశిష్టత గురించి ఆచార్య సచ్చిదానందమూర్తి దశాబ్దాల క్రితమే ప్రస్తావించారని అన్నారు. వైస్ చాన్స్‌లర్, చాన్స్‌లర్, యూజీసీ వైస్ చైర్మన్, ప్రపంచ ఫిలసాఫికల్ సొసైటీ ఉపాధ్యక్షునిగా సేవలందించి పరిపాలనాదక్షునిగా కూడా పేరు గడించారని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్వహిందీ పరిషత్ జాతీ య అధ్యక్షులు, రాజ్యసభ పూర్వ సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకుడు, విద్యార్థి మధ్య సత్యాన్వేషణ బంధం ఉండాలని ఆచార్య సచ్చిదానందమూర్తి పదేపదే ప్రస్తావించేవారన్నారు. దలైలామా, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు తదితరులతో సన్నిహితంగా మెలిగిన సచ్చిదానందమూర్తి వారసత్వాన్ని బీఆర్‌ఏయూ అందుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎస్. పన్నీర్‌సెల్వం (మద్రాస్ యూనివర్సిటీ) కీలక ఉపన్యాసం చేస్తూ తత్వశాస్త్ర అధ్యయనాల్లో ఆచార్య సచ్చిదానందమూర్తి ప్రపంచ మేధావిగా ఖ్యాతిగాంచారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజనీ మాట్లాడుతూ ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ శత వసంతాలు, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి ముగింపు కార్యక్రమాలు పురస్కరించుకొని ఈ జాతీయ సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. ఆచార్య కొత్త సచ్చిదానంద అధ్యయన కేంద్రం బీఆర్ఏయూలో ఏర్పాటు చేసి అక్షరాలు నేర్పిన గురువు రుణం తీర్చుకున్నానని తెలిపారు. అనంతరం ప్రత్యేక సంకలనం ఆవిష్కరించారు. -
30న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ‘తపాలా అదాలత్’ నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు గురువారం తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని రెల్ల వీధి, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయంలో అదాలత్ జరుగుతుందని పేర్కొన్నారు. తపాలా సేవలకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఈ నెల 29లోపు తమ దరఖాస్తులను ‘తపాలా అదాలత్‘ అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసె స్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం– 532001’ అనే చిరునామాకు పంపాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలో కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అదాలత్ రోజున వ్యక్తిగతంగా హాజరై కూడా ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల జట్ల ఎంపికలను ఈ నెల 21న సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వ హించాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్ణయించింది. పురుషులు 85 కేజీలలోపు, మహిళలు 75 కేజీలలోపు బరువు ఉండాలని నిర్వాహకు లు స్పష్టం చేశారు. ఎంపికై న జిల్లా జట్లను కర్నూలు వేదికగా జరగనున్న రాష్ట్రపోటీలకు పంపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు మొదలవుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాదు ముసలినాయుడు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ సాదు శ్రీనివాసరావు (94419 14214)ను సంప్రదించాలని కోరారు. నరసన్నపేట : కిళ్లాం గ్రామ పరిధిలో కోత దశ లో ఉన్న 4.70 సెంట్ల చెరకు పంట గురువారం దగ్ధమైంది. విద్యుత్ లైన్లు ఒకదానికొకటి కలవడంతో మంటలు చెలరేగడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని మాజీ సర్పంచ్ రామన్న తెలిపారు. బాన్న అప్పారావుకు చెందిన రెండున్నర ఎకరాలు, గొండు రమణకు చెందిన ఎకరా న్నర, రువ్వ రమేష్‌కు చెందిన 70 సెంట్ల పొలంలో పంట కాలిపోయింది. కౌలుకు తీసుకుని సా గు చేస్తున్నామని, మరో వారంలోగా పంట చేతికందుతుందనగా కాలిపోయిందని, ఈ నష్టం ఎలా తట్టుకోగలమని రైతులు వాపోయారు. -
హక్కులను కాలరాయడమే..
ఉపాధ్యాయులకు సెలవు లేకుండా చేయడం వారి హక్కులను కాలరాయడ మే. చావుపుట్టుకలు, తీవ్ర అనారోగ్యం ఉన్నా ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సిందే అనడం సరి కాదు. ఇతర శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించి విద్యాశాఖ అధికారులను ఉత్సవమూర్తులను చేయడం మంచిది కాదు. – బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నోపాధ్యాయుడు, ఉప విద్యాశాఖాధికారి, ఆపైన జిల్లా విద్యాశాఖ అధికారి, వీరందరికీ సూపర్ బాస్ కలెక్టర్ ఉండగా.. రాష్ట్రస్థాయికి వచ్చి సమాధానాలు చెప్పాలని, అక్కడ సంతప్తి చెందకపోతే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయాలు మార్చుకోకుంటే ఉద్యమం తప్పదంటూ సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
ఘనంగా మహాలింగార్చన
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మా స శివరాత్రి సందర్భంగా అనివెట్టి మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో శివ పంచాయతన సహిత మహా లింగార్చనను అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయ హుండీ కానుకల ఆదాయం రూ. 20,05,150 వచ్చిందని ఇన్చార్జి ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. గురువారం ఆలయ బేడా మంట పం వద్ద పర్యవేక్షణాధికారి జి.గురునాథం ఆధ్వర్యంలో ఆలయ హుండీలతో పాటు సమీ ప పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. 70 రోజులుకు గాను ఈ ఆదాయం వచ్చిందని, ఈ మొత్తాన్ని బ్యాంకు లో జమచేశామని పర్యవేక్షణాధికారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు, పాలకమండలి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో ఈ నెల 20న కలెక్టర్‌కు వినతి పత్రం, మండల కేంద్రాలు, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐటీయూ కార్యాలయంలో నాలు గు సంఘాలతో కలిపి ఐక్యతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిక్ భారత్– గ్యారంటీ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్(వీజీ జీఆర్ ఏఎంజీ) బిల్లును ఖండించారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాసరి లక్ష్మీనారాయణ, కేవీపీఎస్ నాయకులు బొమ్మాలి రమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టులంతా ఏకంకావాలి పలాస : దేశంలో కాషాయికరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులంతా ఏకం కావాలని సి.పి.ఐ.ఎం.ఎల్.లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో గురువారం లిబరేషన్ పార్టీ జాతీయ నాయకుడు వినోద్ మిశ్రా వర్ధంతి సందర్భంగా ఆయన రచనల తలుగు అనువాద పుస్తకాన్ని బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద ఆవిష్కరించారు. లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల మల్లేశ్వరరావు, సి.పి.ఐ జల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూడెమొక్రసీ నాయకుడు జుత్తు వీరాస్వామి, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు పోతనపల్లి అరుణ, ప్రజాకళామండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్రాయి నీలకంఠం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల రామారావు, పత్తిరి దానేసు, దాసరి శ్రీరాములు, పోతనపల్లి కుసుమ, కుత్తుం దుష్యంతు, పి.అప్పారావు, మద్దిల కై లాస్ తదితరులు ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల తోవలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొర్రాయి నీలకంఠం బృందం ప్రజా ఉద్యమ గీతాలను ఆలపించారు. -
విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఉత్తీర్ణతలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళం నెలకొంటోందని విద్యాశాఖ వర్గాలు విమర్శిస్తున్నాయి. వందరోజుల ప్రణాళిక లోపభూయిష్టంగా, విద్యార్థులకు నష్టం కలిగించేలా రూపకల్పన చేయగా, ఇప్పుడు ఉపాధ్యాయులకు సైతం ఇది ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ తోపాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించి వారి ఆమోదంతో పర్యవేక్షకులను నియమించాలని సూచించారు. ఇదేం తీరు.. పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్‌లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతో పాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పర్యవేక్షకులు ఎప్పుడూ పరిశీలనకు వచ్చినా వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాలి. ఉపాధ్యాయులు చేపట్టిన షైనింగ్, రైసింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు దినాల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అన్నది కూడా పర్యవేక్షకులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే, పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఇతర శాఖలకు అంతగా పట్టు ఉండదని, ఈ లెక్కన ఏదైనా ఉపాధ్యాయునిపై ఫిర్యాదు చేస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులు హరించడమే.. 100 రోజులు పాటు ఉపాధ్యాయులకు సెలవు పెట్టే అవకాశం కూడా లేకుండా చేయడం హక్కులను కాలరాయడమేనని విద్యాసంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఏ కారణం చేతైనా సదరు ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించకపోయినా, మార్కులు నమోదు చేయకపోయినా రాష్ట్రస్థాయిలో కమిషనర్ ఎదుట సంజాయిషీ ఉంచుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడాన్ని తప్పుపడుతున్నారు. హైస్కూళ్లలో ఉపాధ్యాయునికి పర్యవేక్షణాధికారిగా ప్రధాప్రతి మండలానికి పర్యవేక్షకులను నియమించాలని రాష్ట్ర అధికారులు వెబ్ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ నియామకాలు జరుగుతాయి. శతశాతం ఉత్తీర్ణత సాధించడం కోసమే రాష్ట్రస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. – ఏ.రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రమాదకరమైనదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానంతో విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించామని, ఇప్పు డు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయ డం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయ కులు అన్నాజీ, వసంతరావు, ఏఐవైఎఫ్ నాయకులు వై.వేణు, మహేష్, కిషోర్, రామోజీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
●వైఎస్ జగన్‌ను కలిసిన నాయకులు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ రవికుమార్‌లు కలిశారు. గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలన్నారు. – శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) -
ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. 2025 జూన్‌లో బదిలీ కోరుకున్న వందలాది ఉపాధ్యాయులు నేటికీ రిలీవింగ్‌కు నోచుకోలేదన్నారు. వారి స్థానంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, సింగిల్ టీచర్స్ స్కూల్ ఉపాధ్యాయులు సెలవులు వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులపై ఆ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విద్యార్థుల మరణాలకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తున్నారని, ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల రాత్రి బస రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వందరోజుల ప్రణాళిక నుంచి ఆదివారం, రెండో శనివారం, పండగ దినాలను మినహాయించాలని, పరీక్ష మార్కుల అప్లోడ్ చేయాలనే ఒత్తిడిని తగ్గించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో జె.వి.వి.రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శులు బి.శంకరరావు, హెచ్ అన్నాజీరావు, జి.సురేష్, జి.నారాయణరావు, టి.వి.టి.భాస్కరరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, బి.గౌరీశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్.దమయంతి, రాష్ట్ర కౌన్సిలర్లు కె.దాలయ్య, బి.తవిటమ్మ, సీపీఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.రవికుమార్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి.ఉమాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ముప్పు తప్పదు!
మేలుకోకుంటే.. ● మహిళలూ.. మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ● ప్రాణాంతక వ్యాధులపై అప్రమత్తత అవసరం ● 30 ఏళ్లు దాటితే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి టెక్కలి : ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు. ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోరు. ఈ క్రమంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. పూర్తి స్థాయిలో నిద్రపోకపోవడం.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదాలు ఉన్నాయంటూ ప్రసూతి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ప్రసూతి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కచ్చితంగా చేసుకోవాల్సిందే. ●మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ● 9 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు వైద్య సిబ్బంది సూచనల మేరకు వ్యాక్సిన్లు వేయించాలి. హెచ్‌పీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి. ● సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు సరిపడా నిద్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వారి పనుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాకాకుండా ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగరూకతతో మెలగాలని వైద్యులు సూచిస్తున్నారు. మహిళల్లో ప్రధానంగా థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్‌తో పాటు ఇటీవల పీసీఓఎస్ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను గోప్యతగా ఉంచడం మంచిది కాదు. 65 ఏళ్లు దాటిన మహిళల్లో సైతం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి బిడియం లేకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. – డాక్టర్ వి.జి.ప్రసూన, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎన్నో రకాల వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఆహారపు అలవాట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంట్లో పనుల హడావుడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న పాటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా మారుతాయి. – డాక్టర్ కె.ధనలక్ష్మి, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి -
కుల ధ్రువీకరణ మంజూరుపై విచారణ
గార : మండలంలోని సతివాడ, శాలిహుండం, కొమరవానిపేట గ్రామాల్లో 15 కుటుంబాలకు ఎరుకుల కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుపై తహశీల్దార్ మునగవలస చక్రవర్తి అధ్యక్షతన గిరిజన సంక్షేమశాఖాధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టారు. సతివాడ గ్రామంలో ఎరుకుల కుటుంబాల సమక్షంలో జరిగిన విచారణలో సీతంపేట ఐటీడీఏ అధికారుల బృందం పాల్గొంది. గతంలో గార తహశీల్దార్ బలివాడ దయానిధి మంజూరు చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఇప్పుడు అమల్లో లేకపోవడంతో వీరంతా జిల్లా కలెక్టర్‌తో పాటు జాతీయ ఎరుకుల కులస్ధుల సంఘ నాయకులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో మాజీ మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, ఆర్ఐ దివిలి రాజేంద్ర, పెదలాపు సుందర్, ముద్దాడ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో సర్వే చేపట్టాలి
పాతపట్నం: అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రీ సర్వే పూర్తి చేయాలని జిల్లా అటవీశాఖ భూసెటిల్మెంట్ అధికారి ఎం.లావణ్య సూచించారు. పాతపట్నం ఫారెస్ట్ పరిధిలోని అంతరాబ రిజర్వు ఫారెస్ట్, పాతపట్నం రెవెన్యూ భూములకు ఆనుకుని ఉన్న స్థలాలను బుధవారం పరిశీలించారు. పాతపట్నం రెవెన్యూ పరిధిలో కొంత అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించారు. రీ సర్వేలో వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో రీ సర్వే చేపట్టి శాఖల పరంగా హద్దులు నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీ రేంజర్ పి.అమ్మన్నాయుడు, తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, మండల సర్వేయర్ మహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘హద్దు’ అదుపు లేకుండా..!
● హద్దులు దాటుతున్న సారా విక్రయాలు ● ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాల్లోకి దర్జాగా రవాణా ● సరిహద్దు గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు పాతపట్నం : ఒడిశా రాష్ట్రంలో తయారవుతున్న నాటుసారా ఆంధ్రా పల్లెల్లోకి దర్జాగా చేరుతోంది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల మీదుగా ప్యాకెట్ల రూపంలో విచ్చిలవిడిగా రవాణా అవుతోంది. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ పోలీసులు జిల్లాలో సారా బట్టీలపై తరచూ దాడులు నిర్వహిస్తూ తయారీదారులు, విక్రయదారులను పట్టుకుంటున్నా ఒడిశా సారాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఇదీ పరిస్థితి.. ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల పరిధిలో సారాబట్టీలు ఎక్కువ. అక్కడ తయారైన సారాను ఆంధ్రా సరిహద్దు గ్రామాలకు ఆటోలు, కార్ల ద్వారా తరలిస్తున్నారని సమాచారం. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురుజోల, మారంగి, సౌర తలసింగ్, గొఠాయ్, సింగిపూర్, హడ్డుబంగి బట్టి నుంచి 10 వేలు నుంచి 15 వేలు సారా ప్యాకెట్లు వారంలో రెండు, మూడు రోజులు రవాణా జరుగుతున్నా చాలావరకు పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం. కొత్తూరు మండలం నివగా, దిమిలి, రాయల, మాకవరం, మాతల, పొనుటూరు, కుద్దిగాం, బలద, కడుము, మదనాపురం, మెళియాపుట్టి మండలం గొప్పిలి, కరజాడ, గోకర్ణపురం, బాణాపురం, మెళియాపుట్టి, చాపర, వసుంధర, పాతపట్నం మండలం కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం, కింగ, సవర సిద్దమనుగు, ఎగువ సిద్దమనుగు, బొన్ని, బైదలాపురం, పెద్దసున్నాపురం, సరాలి, చంగుడి, అంతరాబ తదితర గ్రామాల్లో సాయంత్రం అయ్యే సరికి మందుబాబులు ఒడిశాలోని హడ్డుబంగి, పర్లాకిమిడితో పాటు మండలానికి ఆనుకొని ఉన్న పలు ఒడిశా గ్రామాలకు వెళ్లి నాటుసారా తాగుతుంటారు. వచ్చేటప్పుడు కూడా కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి గ్రామాల్లో రహస్యంగా విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో సారా అరికట్టడంలో తలమునకలైన ఎకై ్సజ్ పోలీసులకు ఈ ఒడిశా సారా మరింత తలనొప్పులను తెచ్చిపెడుతోంది. ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు అప్పుడప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసినప్పటికీ, ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల పరిధిలో సారాబట్టీలు ఎక్కువ. అక్కడ తయారైన సారా ఆంధ్రలోకి తరలిస్తున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు స్పందించి ఒడిశా సారా రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. నిఘా పెట్టాం ఒడిశా రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల నుంచి ఆంధ్రా రహదారుల్లో నాటు సారా అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. అక్రమ రవాణా అరికట్టేందుకు ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి సరిహద్దు గ్రామాల్లో సారా బట్టీలపై దాడులు చేస్తున్నాం. అక్రమ రవాణా జరిపే వ్యక్తులను గుర్తించి కేసులు పెడుతున్నాం. – కోట కృష్ణారావు, సీఐ, ఎకై ్సజ్ స్టేషన్, పాతపట్నం -
బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
సరుబుజ్జిలి: రొట్టవలసలోని కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అవతరాబాద్ గ్రామానికి చెందిన సురవరపు రామినాయుడు(77) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామినాయుడు రొట్టవలస వెళ్లి తన స్వగ్రామం అవతరాబాద్ వస్తుండగా శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామినాయుడు కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2, టెక్కలి, పలాస డిపోల ద్వారా రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలకు త్వరితగతిన వస్తువులు డోర్ డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైస్‌మిల్లుల్లో తనిఖీలు శ్రీకాకుళం రూరల్: వప్పంగి, వాకలవలస గ్రామాల్లోని రైస్‌మిల్లులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ బుధవారం తనిఖీ చేశారు. సీతారామ మోడరన్ రైస్‌మిల్, లలిత ట్రేడర్స్ ధాన్యం మిల్లుల్లో స్టాక్ రికార్డులను పరిశీలించారు. వప్పంగి, రామచంద్రపురంలలో ప్రైవేట్ వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. తూకాల్లో తేడా లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జేసీతో పాటు జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తదితరులు ఉన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం చేయండి శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం టౌన్‌హాల్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, వైఎస్సార్సీపీ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ డాక్టర్స్‌సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతాడ వరుణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, లుకలాపు గోవిందరావు, కరణం శ్రీనివాసరావు, రాజు, ఆబోతుల రామ్మోహన్, డాక్టర్ సుధీర్, కింజరాపు రమేష్ పాల్గొన్నారు. కలెక్టర్ల సదస్సుకు హాజరు శ్రీకాకుళంపాతబస్టాండ్: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. డేటా ఆధారిత పాలన, ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ‘ఉపాధి’ పథకం పేరు మార్చడం తగదు శ్రీకాకుళం అర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వీబీ జీ రాంజీ’గా పేరు మార్చడం తగదని, ఇది మహాత్మా గాంధీని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పీసీసీ పిలుపు మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చారి్‌జ్ గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి, మామిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ కోసం కక్కుర్తి!
● డ్వాక్రా సభ్యులకు తెలియకుండా రూ.10 లక్షల రుణం మంజూరు ● పొదుపు ఖాతాలో జమ చేయించిన నౌపడ వెలుగు సీఎఫ్ ● వడ్డీ భారంతో సభ్యుల ఆందోళన సంతబొమ్మాళి: బ్యాంకులు, డ్వాక్రా సభ్యులకు అనుసంధానంగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన వెలుగు సీఎఫ్ (కమ్యూనిటీ ఫెసిలిటేటర్) నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సభ్యులకు శాపంగా మారింది. నౌపడ గ్రామానికి చెందిన మదర్ థెరిస్సా ఎస్‌హెచ్‌సీ గ్రూప్ సభ్యులకు తెలియకుండా గ్రూప్ పేరిట నౌపడ వెలుగు సీఎఫ్ డి.సాయిలక్ష్మి రూ.10 లక్షలు రుణాన్ని నౌపడ స్టేట్‌బ్యాంకులో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మంజూరు చేయించారు. ఈ మొత్తాన్ని మదర్ థెరిస్సా పొదుపు ఖాతాలో జమ చేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా సభ్యులకు మాత్రం సీఎఫ్ చెప్పలేదు. దీంతో సభ్యులకు తెలియకుండా పొదుపు అకౌంట్ నుంచి ప్రతి నెలా వడ్డీ కింద రూ.7500 వేలు చొప్పున మూడు నెలలగా రూ.23వేలు కట్ అయింది. బుధవారం పొదుపు, లోన్ బ్యాంకు బుక్‌లను సభ్యులు పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. దీంతో సీఎఫ్ సాయిలక్ష్మిని సభ్యులు నిలదీశారు. తమకు తెలియకుండా తమ సంతకాలు, ఫొటోలు లేకుండా, తీర్మానం చేయకుండా రూ.10 లక్షలు రుణం ఏ విధంగా మంజూరు చేయించావని ప్రశ్నించారు. ఆ డబ్బులు తమ చేతికి రాకపోయినా ప్రతి నెలా రూ.7500 వేలు చొప్పున రూ.23వేలు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కమీషన్ కోసం తమను బలి పశువులు చేశావంటూ సభ్యులు మండిపడ్డారు. కాగా, రుణం మంజూరు అయినది, లేనిదీ ఎప్పుటికప్పుడు తెలుసుకోవాలని సీఎఫ్ సాయిలక్ష్మి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు సభ్యులను బెదిరింపులకు పాల్పడటం కొసమెరుపు. రుణం డబ్బులు తమ చేతికి రాకపోయినా రూ.23 వేలు వడ్డీ చెల్లించామని, దీనికి ఎవ్వరు బాధ్యత వహిస్తారంటూ సభ్యులు ఆందోళన చెపట్టారు. పరిశీలిస్తాం.. ఎస్‌హెచ్‌సీ గ్రూపులకు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు గురించి సభ్యులకు తెలియజేయకపోవడం అవగాహనా రాహిత్యం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రుణం మంజూరు, వడ్డీ విషయమై బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం. – శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, సంతబొమ్మాళి -
పెన్షన్ వేలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం కల్చరల్: ిపంఛనుదారులకు అన్యాయం చేస్తూ దొడ్డిదారిన ప్రవేశపెట్టిన పెన్షన్ వేలిడేషన్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ పెన్షనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తాత్కాలిక పద్ధతిన నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వాళ్లు రిటైరయ్యాక పాత పద్ధతిలో నెలకు రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ కింద ఇస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.9 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులంతా కలిసి అసోషియేషన్‌గా ఏర్పడి సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు. ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు బి.ప్రసాదరావు, కన్వీనర్ కె.చంద్రశేఖరరావు, బీఎస్ఎన్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వేంకటేశ్వరరావు, ఎం.రమేష్, ఏఐబీడీఓటీపీ ప్రతినిధి ఎం.గోవర్దనరావు తదితరులు పాల్గొన్నారు. -
నాట్యం నేర్పేదెలా..?
కళా సేవ.. చూపండి తోవ● తరగతుల నిర్వహణకు ఇబ్బంది పడుతున్న నాట్య గురువు ● నాట్యాలయానికి చోటు చూపించాలని విజ్ఞప్తి శ్రీకాకుళం కల్చరల్: రఘుపాత్రుని శ్రీకాంత్.. సిక్కోలు గడ్డపై నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నాట్య కళాకారుడు. వందలాది మంది నాట్యకారులను తయారు చేసిన దిగ్గజ గురువు. కానీ ఆయన నాట్యం నేర్పించడానికి శాశ్వత ఏర్పాటు లేక అల్లాడుతున్నారు. కొన్నాళ్లు అద్దె ప్రాతిపదికన, మరికొన్నాళ్లు దాతల దయతో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట శివశ్రీ నృత్య నికేతన్ పేరుతో ఆయన నృత్య శిక్షణ మొదలుపెట్టారు. కానీ ఇన్నేళ్లలో సొంతంగా ఓ నాట్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. వేల మందిని నాట్యంలో సుశిక్షితులను చేసినా సొంతంగా ఓ భవనం కట్టుకోలేకపోయారు. శ్రీకాంత్ దగ్గర ప్రస్తుతం 300 మంది వరకు భరతనాట్య, కూచిపూడి సంప్రదాయాల్లో నృత్యం నేర్చుకుంటున్నారు. ఈయన శిష్యుల్లో జూనియర్ విభాగంలో నలుగురికి, సీనియర్ విభాగంలో ఒకరికి సీసీఆర్టీ స్కాలర్ షిప్ రావడం జిల్లా స్థాయిలో ప్రప్రథమం. అంతే కాకుండా శ్రీకాంత్ శిష్యుల్లో ఐదుగురు కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ సాధించగా, ఒకరు పీహెచ్డీ కూడా పొందారు. ఎన్నో వినతులు అయినా.. ఎన్నో పర్యాయాలు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నా ఆయనకు ఎక్కడా స్థలం గానీ ఇల్లు గానీ మంజూరు కాలేదు. నగర పరిధిలో స్థలం మంజూరు చేస్తే నాట్యాలయం ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటుందని శ్రీకాంత్ శిష్య బృందం కోరుతోంది. గతంలో అఫీషియల్ కాలనీలోని పాడుపడిన భవనంలో నిర్వహించుకునేందుకు ఆప్పటి కలెక్టర్ ఇవ్వగా దాన్ని రూ.2.50లక్షలతో బాగుచేయించి కొన్నాళ్లు తరగతులు నిర్వహించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ వచ్చి ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఒక దాత దయతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీకాంత్ కోరుతున్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
హిరమండలం: పాతపట్నం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి సూచించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ ప్రతులు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. -
పంచాయతీల్లో విభజన రగడ
సారవకోట : మండలంలో పలు పంచాయతీలలో విభజన రగడ రాజుకుంటోంది. అలుదు, వడ్డినవలస, మాకివలస గ్రామాలు కలిసి అలుదు పంచాయతీ ఇప్పటి వరకు ఉంది. ప్రస్తుతం వడ్డినవలస, మాకివలస గ్రామాలను కలిపి ఒక పంచాయతీగా, అలుదు ఒక పంచాయితీగా విభజించాలని కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఇదివరకు మాదిరిగానే మూడు గ్రామాలతో కలిసి పంచాయతీగా కొనసాగాలని సర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు కోరుకుంటున్నారు. ఇదే విషయమై సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. ఈ క్రమంలో బుధవారం పంచాయతీ విభజనపై అలుదు రామాలయంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిగించారు. ఇరువర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఇన్చార్జి ఈఓపీఆర్డీ సింహాచలం తెలిపారు. కాగా, గొర్రిబంద పంచాయతీలో కూడా ప్రస్తుతం ఉన్న ఎన్నికల పోలింగ్ బూత్‌ల ప్రకారం విభజించుకునేందుకు పలువురు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచాయతీలోని ఎస్టీ గ్రామాలన్నీ కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎస్టీ నాయకులు, ప్రజలు కోరుతున్నారు. దీంతో ఈ పంచాయితీ విభజన విషయంలోనూ రగడ జరుగుతోంది. -
● డాక్టర్.. స్కేటర్
శ్రీకాకుళం రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఆర్.వెంకట రమ్యశ్రీ రోలర్ స్కేటింగ్‌లో బంగారు పతకం సాధించింది. ఈ నెల తొమ్మిది నుంచి 11 వరకు విశాఖపట్నంలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని పథకం సాధించింది. ఆల్ఫెన్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించిన రమ్యశ్రీ డౌన్‌హిల్ ఈవెంట్ లో కూడా కాంస్య పథకాన్ని సాధించింది. రమ్యశ్రీ ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్ డాక్టర్ సనపల నరసింహమూర్తి డాక్టర్ బి.గౌరునాయుడు తదితరులు అభినందించారు. – శ్రీకాకుళం -
ఎవరు ఇబ్బంది పెట్టినా చెప్పండి
● విద్యార్థుల్లో ధైర్యం నింపిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ● శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఏర్పాటు ● చట్టాలపై అవగాహన గాయపడిన విద్యార్థికి న్యాయం చేస్తాంపొందూరు: మండలంలోని లోలుగు గ్రామంలో సుమారు 3 నెలల కిందట కేజీబీవీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినికి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తా మని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. లోలుగు కాలనీలోని నివాసముంటున్న విద్యార్థినిని శైలజ బుధవారం పరామర్శించారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. మూడు నెలలుగా విద్యార్థిని నడవలేని పరిస్థితిలో ఉందని, ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విద్యార్థిని తల్లి చైర్‌పర్సన్‌ను వేడుకొన్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేశారని విచారణకు ఎంత వరకు వచ్చిందనే విషయంపై సమాచారం తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఎచ్చెర్ల: విద్యార్థినులను ఎవరు ఇబ్బంది పెట్టినా సంబంధిత కమిటీలకు ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైల జ తెలిపారు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని, మహిళా కమిషన్ తరఫున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వారం కిందటే ఇక్కడ నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల నిర్వహించలేదన్నారు. లైంగిక వేధింపులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ(ఐసీసీ)లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇబ్బందులు ఉంటే ఈ కమిటీకి చెప్పకోవాలని సూచించారు. ట్రిపుల్ ఐటీలోనూ ఈ కమిటీ వేసినట్లు తెలిపారు. విద్యార్థినులు యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే నిజానిజాలపై ఆరా తీయాలని, అలా జరగడం లేదని అందుకే ఐసీసీ కమిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కమిటీలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీని రెసిడింగ్ ఐసీసీగా శ్రీకాకుళం క్యాంపస్‌కు నియమించారు. ఆమెతో పాటు అడ్వకేటర్ పద్మజ, ఎచ్చెర్ల హెడ్‌కానిస్టేబుల్ టి.సరిత, ముగ్గురు విద్యార్థులు, వార్డెన్లు తదితరు లు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీకి ఫిర్యాదు వచ్చిన 3 నెలల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని క్యాంపస్ సిబ్బంది తెలిపారు. విద్యార్థినులతో చర్చలు ఈ సందర్భంగా కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించి సిబ్బంది, అధికారులను బయటకు పంపించి కేవలం విద్యార్థినులతో మాత్రమే ఆమె మాట్లాడారు. విద్యార్థినుల సమస్యలన్నీ నోట్ చేసుకుని వారికి ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. అనంతరం ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కొత్తా మధుమూర్తి కూడా లోపలకు వెళ్లి పిల్లలతో మాట్లాడారు. ఇబ్బందులు ఎదురైతే మెయిల్ చేయవచ్చన్నారు. చర్యలు తీసుకుంటాం.. కళాశాలలో పిల్లలతో పాటు సిబ్బంది సమస్యలు కూడా తెలుసుకున్నామని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మధుమూర్తి తెలిపారు. ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ అవసరమని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారని వీటిపై చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేజీవీడీ బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ నిర్మలారాణి, బాలల సంరక్షణాధికారి రమణ, జేఆర్‌పురం సీఐ అవతారం, స్థానిక ఎస్ఐ జి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఏయూలో సౌకర్యాలపై ఆరా
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి బుధవారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా భవనం పరిశీలించి భవనం రాజమందిరాన్ని తలపిస్తోందంటూ ప్రశంసించారు. వర్శిటీలోని ఖాళీ ప్రదేశంలో హంపీ థియేటర్ నిర్మిస్తే క్యాంపస్ మరింత శోభాయమానంగా ఉంటుందని సూచించారు. ఔషధ మొక్కలు పెంచితే పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, మాజీ రిజిస్ట్రార్ పి.సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.స్వప్నవాహిని, ఎస్ఓ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఎన్ సంతోష్రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. పశువుల మృత్యువాత ఎచ్చెర్ల: అరిణాం అక్కివలస పంచాయతీ శేషపేట గ్రామంలో పాడి రైతు దత్తుకు చెందిన పశువుల పాక బుధవారం కాలిపోయింది. ఈ ఘటనలో పాకలో కట్టిన రెండు పశువులు కాలిపోయి మృతిచెందాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి గిరిజనుల సమస్యలు
సారవకోట: జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గిరిజన ఐక్యవేదిక నాయకులు మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడేళ్ల క్రితం గిరిజనుల కోసం భవనం నిర్మించినా ఇంతవరకు గిరిజనులకు అప్పగించలేదన్నారు. కొత్తూరు మండలం కారిగూడ పాఠశాలలో నకిలీ బీఈడీ సర్టిఫికెట్లతో ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్‌ను కలిసిన వారిలో గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు చౌదరి లక్ష్మినారాయణ, బరండి గోపాలరావు, చింతపల్లి రామారావు తదితరులున్నారు. -
47
ఆ కాలువకు..ఏళ్లు! హిరమండలం : జిల్లాను సస్యశ్యామలం చేస్తూ అపర భగీరథిగా నిలుస్తున్న గొట్టా బ్యారేజీ నిర్మాణం దాదాపు ఐదు దశాబ్దాల కిందట చేపట్టారు. అప్పటి సాగునీటి అవసరాలకు తగ్గట్టు కాలువలు నిర్మించారు. ముందుగా నిర్మాణం చేపట్టిన ఎడమ ప్రధాన కాలువ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం కాలువ బాగోగులు పట్టించుకోవడం లేదు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికై నా బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. 1978లో గొట్టా బ్యారేజీ నిర్మాణం జరిగింది. కాలువ తవ్విన నాటి నుంచి ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టిన దాఖలాలు లేవు. నేతల జేబులు నింపేలా నీరు–చెట్టు పనులు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు తప్ప శాశ్వత ప్రాతిపదినక పనులు చేపట్టడం లేదు. ఎడమ ప్రధాన కాలువ అందుబాటులోకి వచ్చి 47 ఏళ్లు దాటడంతో దారిపొడవునా కాలువ దారుణంగా తయారైంది. కనీస నిర్వహణ లేక కాలువకు ఎక్కడికక్కడే గండ్లు పడుతున్నాయి. షట్టర్లు పూర్తిగా పాడయ్యాయి. అనుసంధాన పిల్ల కాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. అంతా అస్తవ్యస్తం.. సాధారణంగా చిన్నపాటి కాలువను నిర్వహణ లేక విడిచిపెడితేనే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అటువంటిది జిల్లాలో సగం పంటకు సాగునీరు అందించే కాలువను పట్టించుకోకుండా వదిలేయడంతో పూర్తిగా ధ్వంసమైంది. కాలువపై స్ట్రక్చర్లు ధ్వంసమయ్యాయి. షట్టర్లు కొట్టుకుపోయాయి. డిస్ట్రిబ్యూటర్లు, రెగ్యులేటర్లు శిథిలమయ్యాయి. 2,480 క్యూసెక్కుల నీటి సామర్థ్యం 1700 క్యూసెక్కులకు పడిపోయిందంటే పరిస్థితి ఎంతవరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రైతుల పాట్లు.. ఏటా ఖరీఫ్ వచ్చిందంటే చాలు.. కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు రైతులకు అదనపు పని తప్పడం లేదు. కర్ర చెక్కలు, ఇసుక బస్తాలు, గడ్డివాములు అడ్డుపెట్టుకొని నీరు మళ్లించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటోంది. 2022–23లో అప్పటి ప్రభుత్వం రూ.954 కోట్ల అంచనాలతో ఆధునీకరణ పనులు చేపట్టాలని భావించింది. ఇంతలో గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణం, వంశధార–నాగావళి అనుసంధానంతో ఆధునీకరణ అంశం పక్కకు వెళ్లింది. అయితే ఇప్పుడు రూ.1600 కోట్లతో అధికారులు కొత్త ప్రతిపాదనలు చేశారు. దీనిపై జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణకు సంబంధించి తాత్కాలిక అంచనాలు రూపొందించాం. ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపడుతున్నాం. సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. – ఎం.మురళీమోహన్ ఈఈ నరసన్నపేట డివిజన్ , బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు -
పశుసంవర్థకశాఖ జేడీపై విచారణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బొబ్బిలిలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న కె.రాజగోపాలరావును సొంత జిల్లా శ్రీకాకుళంలో జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్‌గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు సైతం దుర్వినియోగం చేశారని ఎచ్చెర్ల గ్రామానికి చెందిన ఇనుప రాజారావు ఈ ఏడాది జనవరి 23న విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్లుగా ఉన్న డాక్టర్ జయరాజ్, మనోజ్, సత్యప్రకాష్, రామ్మోహన్‌లను కాదని వేరే జిల్లాలో పనిచేస్తున్న రాజగోపాలరావుకు జేడీగా బాధ్యతలు అప్పగించడం అన్యాయమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మంగళవారం శ్రీకాకుళం వచ్చి జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. సంబంధిత జేడీ, నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు, ఫిర్యాదుదారిని పిలిపించి రాతపూర్వకంగా వివరాలు తీసుకున్నారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తానని హనుమంతరావు పేర్కొన్నారు. చర్యలు తీసుకోకపోవడం అన్యాయం.. ఎస్సీసబ్‌ప్లాన్ నిధులు సుమారు రూ.11కోట్లు పక్కదారి పడితే చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని ఫిర్యాదుదారు రాజారావు అన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం చూడి ఆవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఏ ఒక్క ఎస్సీకి కూడా ఇవ్వకుండా ఆ డబ్బులతో దాణా కొనుగోలు చేసి ఎస్సీయేతర కులాలకు ఇచ్చి నిధులు దారిమళ్లించినట్లు చెప్పారు. రాయితీతో పశువుల దాణా సరఫరా చేయాల్సి ఉన్నా ఇవ్వలేదన్నారు. తప్పుడు నివేదికలు, తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికిచ్చి మోసం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిత్లీ తుఫాన్ సమయంలో ఇచ్చిన దాణాను సైతం పశువుల రైతులకు ఇవ్వలేదన్నారు. ఆడిట్లో అనేక ఆరోపణలు రుజువైనా చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించినట్లు ఫిర్యాదుచేస్తే దానిపై త్రిసభ్య కమిటీ వేసినా దోషుల నుంచి రికవరీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. -
జ్యుడీషియల్ కమిటీ వేయాలి
జలుమూరు: కూటమి ప్రభు త్వం చేస్తుటన్న అరాచాకాలపై జ్యుడీషియల్ కమిటీ వేసి న్యా య విచారణ చేపట్టాలని శ్రీముఖలింగం అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీముఖలింగం మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని.. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదం పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయని ప్రకటించడం, ఆవి వెనక్కు వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు. ప్రసాదం పథకం అంటే ప్రసాదాలు మాదిరిగా తినేయేడమా అని ప్రశ్నించారు. నరసన్నపేట ఎమ్మేల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు ఆలయం లోపల, బయట జరిగే పనులలో అవినీతికి పాల్పడుతున్నారని, వాటిపై ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నం చేశారన్నారు. అర్చకులకే భద్రత లేని ఈ ప్రభుత్వంలో ఎవరికి భద్రత ఉంటుందని మండిపడ్డాడు. జంతర్ మంతర్ సాక్షిగా దేశంలో ఉన్న వంశపారం పర్య అర్చకుల భద్రత కల్పించాలని కోరారు. -
పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ గురువారం నిర్వహించనున్నట్లు ట్రెజరీ ఉప సంచాలకులు సీహెచ్ రవి కుమార్ మంగళవారం తెలిపారు. ప్రిన్సిపాల్ అకౌంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ‘పెన్షన్, జీపీఎఫ్ అదాలత్‘ ఉంటుందని చెప్పారు. జిల్లాలో ఉన్న డీడీఓలు హాజరు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి, ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే నివేదించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ‘సంక్రాంతికల్లా సమస్య పరిష్కరిస్తాం’ ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్‌లో భారీస్కామ్కి గురైన బాధితులకు సంక్రాంతి నాటికి క్లెయిమ్స్ సెటిల్ చేస్తామని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు హామీ ఇచ్చారు. స్థానిక పోస్టాఫీస్ వద్ద బాధిత ఖాతాదారులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో మంగళవారం పోస్టల్ ఎస్పీ స్థానిక పోస్టల్ కార్యాలయం వద్దకు వచ్చి నిరసన తెలియజేస్తున్న బాధిత ఖాతాదారుల తో మాట్లాడారు. పోస్టల్ ఏడీ నవీన్‌కుమార్‌తో బాధిత ఖాతాదారులతో ఫోన్ ద్వారా మాట్లాడించారు. 33 మంది ఖాతాదారులకు వడ్డీతో సహా సొమ్ము అందిస్తామన్నారు. దీంతో నిరసనకారులు ఆందోళన విరమించారు. కేసును సీబీఐకి అందజేయడంతో పాటు భాగస్వాములైన వారి నుంచి రికవరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. విద్యార్థులకు ప్రధానితో మాట్లాడే అవకాశం ● పరీక్ష పే చర్చ పేరిట నిర్వహణ ● 6 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు అర్హులు ● జనవరి 11 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం శ్రీకాకుళం: ప్రధాన మంత్రితో విద్యార్థులు మాట్లాడే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పరీక్ష పే చర్చ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. పరీక్ష పే చర్చ యాప్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. జన వరి 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏటా పరీక్షలకు ముందు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అందరూ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు పరీక్షల పై ఉన్న సందేహాలు భయాలు, సలహాలను నేరుగా ప్రధా నికి తెలియజేసే అవకాశం ఉంటుంది. పరీక్షలను సమర్థంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడానికి ప్రధాని సమాధానాలు ఇవ్వడం గత కొన్నేళ్లుగా వస్తోంది. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారు కూడా ఆన్లైన్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంచి ప్రశ్నలను ఎంపిక చేసి వారిని నేరుగా ప్రధానమంత్రిని కలిసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అలాగే ప్రతి విజేతకు ఓ ప్రత్యేక కిట్టును అందజేస్తారు. ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తారు. విజేతల ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్ పొందే అవకాశం ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలనుకునే విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారి మొబైల్ నంబర్‌తో పాటు జిమెయిల్ ఖాతాను కూడా ఎంటర్ చేస్తే ఓటీపీతో లాగిన్ అవ్వవచ్చు. మొబైల్ జిమెయిల్ నంబర్ లేని వారు ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. -
బండిపై వచ్చారట.. బాలికను చెరువులో పడేశారట!
రణస్థలం : రణస్థలంలో బాలిక హత్య పేరిట చెలరేగిన పుకార్లు స్థానికంగా కలకలం రేపాయి. మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు వ్యక్తులు నాలుగేళ్ల బాలికను తీసుకొచ్చారని.. రణస్థలం శ్మశానం ఎక్కడ? అని అడిగారని, కొద్దిసేపటి తర్వాత శ్మశానవాటిక వద్దకు వెళ్లి అక్కడి చెరువులో బాలికను పడేసి పరారయ్యారని స్థానికులు చర్చించుకోవడం మొదలైంది. ఈ వార్త దావానంలో పాకడంతో మహిళలు, పెద్దలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో జె.ఆర్.పురం సీఐ అవతారం, ఎస్సై చిరంజీవి ఆదేశాలతో కానిస్టేబుల్ పి.రమేష్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సుమారు నాలుగు గంటల పాటు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ద్విచక్ర వాహనాల నంబర్లపై ఆరా తీశారు. చివరకు సదరు ద్విచక్ర వాహనదారులు జె.ఆర్.పురంలో మంగళవారం ఓ వ్యక్తి చనిపోవడంతో పరామర్శ కోసం వచ్చారని గుర్తించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
రాష్ట్రస్థాయిలో ‘ఆదర్శం’
● కార్పొరేట్‌కు దీటుగా రాణిస్తున్న జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు ● విద్యతో పాటు అన్ని అంశాల్లోనూ రాణింపు ● తాజాగా షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపిక జి.సిగడాం: కార్పొరేట్‌కు దీటుగా బోధనతో వివిధ రంగాల్లో విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందిస్తూ రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలుస్తోంది జి.సిగడాం మోడల్ స్కూల్. ఇక్కడి సీటు కోసం ఏటా తీవ్రస్థాయిలో పోటీ ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణం, మౌలిక సదుపాయాలు, క్రమశిక్షణతో కూడిన విద్య ఇక్కడి ప్రత్యేకతలు. జి.సిగడాం మండల కేంద్రంలో ఉన్న ఈ ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఏడు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏటా ఉత్తమ ఫలితాలు.. గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ పాఠశాలలకు గాను 75 –99 శాతం ఉత్తీర్ణత సాధించిన ఐదు స్కూళ్లలో జి.సిగడాం మోడల్ స్కూల్ ఒకటి. 98 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు 97 మంది ఉత్తీర్ణులై 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో 92 మంది ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. షార్ట్‌ఫిల్మ్ పోటీలో.. విద్యుత్ ఆదాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీల్లో జి.సిగడాం మోడల్ స్కూల్ విద్యార్థులు రూపొందించిన ‘అత్తా కోడళ్ల పవర్’ అనే లఘుచిత్రం రాష్ట్రస్థాయి బహుమతికి ఎంపికై ంది. ఈ నెల 20న రాష్ట్ర అధికారులు, నాయకుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. ఈ చిత్రానికి తెలుగు భాషా పండితులు కోట తిరుపతిరావు గైడ్‌గా వ్యవహరించారు. విద్యాలయంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడన విద్య అందిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో వివిధ లఘుచిత్రాలను తీసి అధికారులకు పంపించాం. వాటికి బహుమతులు రావడం ఆనందంగా ఉంది. – కోట తిరుపతిరావు, తెలుగు అధ్యాపకులు, జి.సిగడాం మోడల్ స్కూల్ రాష్ట్రస్థాయిలో జరిగిన విద్యుత్ ఆదా పోటీలో అత్తా కోడళ్లు పవర్ లఘుచిత్రం బహుమతికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విద్యాలయంలో అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. తల్లిదండ్రుల సహకారం కూడా మరువలేనిది. – డబ్బీరు గణేష్పట్నాయక్, ప్రిన్సిపాల్, జి.సిగడాం మోడల్ స్కూల్ -
యువకుడికి తీవ్ర గాయాలు
రణస్థలం : లావేరు మండలం బెజ్జిపురం జాతీయ రహదారిపై రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న లావేటి నవీన్ అనే యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించారు. శ్రీకూర్మంలో తిరుప్పావై ప్రవచనాలు ప్రారంభం గార: ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు సౌజన్యంతో తిరుప్పావై ప్రవచనాలు మంగళవారం సాయంత్రం ప్రత్యేక మంటపంలో ప్రారంభమయ్యాయి. ఆలయ స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు ప్రవచకులుగా ప్రారంభోనోపాస్యం చేశారు. ఇక్కడతో పాటు శ్రీకాకుళం నగరంలోని కోదండ రామాలయం, వేణుగోపాలస్వామి ఆలయంలోనూ ప్రవచనాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. అదే విధంగా, మార్గశిర మాసం బహుళ ద్వాదశి మంగళవారం మధ్యాహ్నం నుంచి నెలగంట ప్రారంభమైందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, పదవీ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ 2026 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోగా తప్పనిసరిగా తమ జీవన ప్రమాణ పత్రాలు (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించాలని ఉప ఖజానా అధికారి చింతాడ రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని హెడ్ క్వార్టర్స్ ఉప ఖజానా కార్యాలయం పరిధిలో 6,790 మంది పింఛనుదారులు ఉన్నారని, వీరందరూ నెట్ సెంటర్లలోగానీ లేదా దగ్గరలోని ఖజానా కార్యాలయాల్లో గానీ జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు. అనారోగ్యం లేదా వృద్ధాప్యం కారణంగా బయోమెట్రిక్ నమోదు చేయలేని వారు సంబంధిత ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. అంతేకాక జీఓ 315 ప్రకారం పింఛను పొందుతున్న అవివాహిత మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న ఫ్యామిలీ పెన్షన్‌దారులు, ఉద్యోగం చేస్తూ ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు సంబంధిత పత్రాలతో నేరుగా శ్రీకాకుళం ఉప ఖజానా కార్యాలయాన్ని సంప్రదించి జీవన ప్రమాణ పత్రాలను సమర్పించాలని ఆయన తెలియజేశారు. ‘అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదు’ మందస: కార్గో ఎయిర్‌పోర్టుకు అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. భేతాళపురం గ్రామంలోని సచివాలయ ప్రాంగణంలో పలాస ఆర్డీఓ జి.వెంకటేశ్వరరావు కార్గో ఎయిర్‌పోర్టు బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అంగీకరిస్తే ప్రభుత్వం నుంచి లాంగ్ పూలింగ్ విధానం తీసుకువచ్చి ఎకరాకు 25 సెంట్లు భూమి తిరిగి ఇస్తామని, ఏ ఒక్కరి ఇళ్లకు నష్టం కలిగించకుండా ప్లాన్ చేశామని, జిరాయితీ తోటల్లో ఉన్నా చెట్లకు ప్రత్యేక ధర ప్రకటిస్తామని, ప్రభుత్వ ధర కంటే 2.5 రెట్లు అధికంగా చేసి ప్రభుత్వం తరఫున ఇస్తామని చెప్పారు. అనంతరం రైతు మామిడి రాజేశ్వరి మాట్లాడుతూ ప్రాణాలైనా ఇస్తాం గానీ భూమి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కీలు గున్నమ్మ, బత్తిన ఉమాపతి, గార ఆనంద్ మాట్లాడుతూ భూములు ఇచ్చేస్తే భవిష్యత్ తరాల మనుగడ ఏమవుతుందని ప్రశ్నించారు. అంగుళం భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. రైతు బత్తిన లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నెల 23న భేతాళపురంలో సభ ఏర్పాటు చేసి భూమి ఇచ్చేది లేదంటూ తీర్మానం పంపిస్తామని తెలిపారు. పచ్చని ఉద్దానం భూములను నాశనం చేసే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. -
అభ్యుదయ గీతిక
● డ్రగ్స్‌పై పోరుకు మద్దతు పలకాలి ● గంజాయిని తరిమి కొడదాం ● ‘అభ్యుదయం’లో పోలీసు అధికారుల పిలుపు నేను ఇదే జిల్లాలో పుట్టాను. బలగలో చదువుకున్నారు. ఇక్కడి యువత గంజాయికి బానిసలు కారు. అలాంటి అలవాట్లను తిప్పితిప్పి కొడతారు. – షకలక శంకర్, సినీ నటుడు నా బిడ్డ పాలిటెక్నిక్ కాలేజీలో చేరిన మొదటి ఏడాదిలోనే డ్రగ్స్‌కు బానిసైపోయాడు. మా ఊరిలోనూ చాలా మంది ఇలాగే గంజాయికి బానిసలైపోయారు. చివరకు నా బిడ్డపై నేనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాడిప్పుడు జైలులో ఉన్నాడు. – లావేరు మండలం బెజ్జిపురానికి చెందిన ఓ తల్లి ఆవేదనఎంతో మంది తల్లిదండ్రులు నా వద్దకు వస్తున్నారు. తమ బిడ్డలు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని, వారిని డీ అడిక్షన్ సెంటర్లకు పంపించాలని కోరుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులైతే కాళ్లావేళ్లా పడి కెరీర్లు నాశనమైపోతాయి సర్. వారిని ఏదోలా దారినపెట్టండంటూ వేడుకుంటున్నారు. – కేవీ మహేశ్వర రెడ్డి, ఎస్పీ ఓ తల్లి ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. గంజాయికి బానిసైపోయిన తన బిడ్డను పోలీసులకు చెప్పి చంపించేయండి అని చెప్పింది. మత్తులో రోజూ జోగుతుంటాడని, వాడి టార్చర్ భరించలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంది. – ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిన ఉదాహరణ శ్రీకాకుళం క్రైమ్ : మత్తులో చిత్తవుతున్న చీకటి బతుకుల కథలు అభ్యుదయం వేదికగా వెలుగు చూశాయి. సరదాగా మొదలై జీవితాలను తలకిందులు చేసే వ్యసనం గురించి ఈ వేదిక అర్థమయ్యేలా వివరించింది. మత్తు వదలని బతుకు చెత్తకుప్పలా మారిపోతుందని హెచ్చరించింది. మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విశాఖ రేంజి పరిధి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు జరుగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర మంగళవారం జిల్లాకేంద్రానికి చేరుకుంది. ముఖ్య అతిథి గా రేంజి డీఐజీ గోపినాధ్ జెట్టి విచ్చేయగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, పలు విద్యాసంస్థల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు రామలక్ష్మణ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు సాగిన సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో వక్తలు మాట్లాడారు. అయితే ఎండ వేడిమి విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ మంచి సమాజం నిర్మించాలంటే సమాజంలో ఉన్న వ్యక్తులంతా మంచివారై ఉండాలన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత, తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థల మద్దతు ఎంతో అవసరమని అన్నారు. రేంజి పరిధిలో సంకల్పం పేరిట 21,206 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని, 16,321 గ్రామ/పట్టణాల్లో, 6459 విద్యాసంస్థల్లో జరిగాయని, విద్యాసంస్థల వద్ద 388 డ్రాప్‌బాక్స్‌లు చేసి 4,094 ఈగల్ క్లబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో పోలీసులు ప్రజల్లో చైతన్యం కలిగేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాలల్లో సైకాలజిస్టుల ద్వారా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయిపై సమాచారాన్ని 1972 కు డయల్ చేసి చెప్పాలని, 112కు కూడా చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేసి అందరితో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తిరుపతినాయుడు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, లక్ష్మణరావు, శేషాద్రినాయుడు, ఆర్డీవో ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
క్వారీలో పేలుళ్లు
● పక్కనే వ్యవసాయ పనుల్లో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలు కొత్తూరు: శోభనాపురం కొండపై నిర్వహిస్తున్న క్వారీలో పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరిపడటంతో పక్కనే తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళా కూలీలు గాయపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..శోభనాపురం గ్రామానికి చెందిన బైరి భానుమతి, రామలక్ష్మి, పుష్పలు క్వారీకు ఆనుకొని ఉన్న మామిడితోటలో పసుపు పంటను తవ్వేందుకు వెళ్లారు. పసుపు తవ్వుతుండగా ఒక్కసారి క్వారీ నుంచి భారీ శబ్దాలు వెలువడటంతో భానుమతి, రామలక్ష్మి స్పృహ తప్పి పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి గాయాలు కనిపించడంతో పుష్ప కేకలు పెట్టడంతో వెంటనే సమీప వరి పొలాల్లో పనులు చేస్తున్న వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా పేలుళ్లు చేస్తుండటం వల్లే తమకు గాయాలు తగిలాయని బాధితురాలు భానుమతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భానుమతి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం జీడీ నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ తెలిపారు. -
మూడొంతులు దళారీలవే..!
పోలాకి: మిల్లుల వద్ద రైతుల బదులు మధ్యవర్తులు.. కొనుగోలు వద్ద దళారులు.. మిల్లుల్లో లెక్కలకు రాని ధాన్యపు రాశులు.. వెరసి పోలాకి మండలంలోని ధాన్యం కొనుగోలు పూర్తిగా దళారుల వశమైంది. వారి చేతులమీదుగానే అన్ని వ్యవహారాలూ సాగుతున్నాయి. మిల్లులకు చేరిన ధాన్యంలో మూడొంతులు వారివేనంటే అతిశయోక్తి కాదు. మండలంలో దాదాపు 8 వేల హెక్టార్లలో ఖరీఫ్ వరికి సంబంధించి 32 వేల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 14,532.68 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో మూడొంతులు దళారీలు, మధ్యవర్తులు తెచ్చి మిల్లర్లకు అప్పగించినవే. 80 కిలోల ధాన్యం బస్తా రూ.1,910లగా ప్రభుత్వ మద్దతు ధరకు కొనాల్సి ఉండగా.. రైతులకు రూ.1650 నుంచి రూ.1,700 వరకే అందుతోంది. మిగిలిన మొత్తం సొమ్ము హమాలీ, ట్రావెలింగ్ తదితర ఖర్చులు సాకుగా చూపి రైతుల నుంచి దళారీలు దోచుకుంటున్నారు. పైగా మిల్లుల్లో అదనంగా 2 కిలోలు ధాన్యం తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఈ విషయం ఉన్నతస్థాయిలో తెలిసినా ఎవరూ ఏమీ చేయడం లేదు. కొన్నిచోట్ల భూమిహక్కు పత్రాలులేని, చిన్న, సన్నకారు, కౌలు రైతుల నుంచి బస్తాకు (80కిలోలు) 4 నుంచి 5 కిలోల ధాన్యం అదనంగా దోచుకుంటున్నారు. నేరుగా భూమి హక్కు పత్రా లు ఇస్తే బస్తాకు రూ.50 కమీషన్ ఇచ్చే ఏర్పాట్లు కూడా మధ్యవర్తులే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సినిమా సెట్టింగులా.. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు వ్యవస్థ సినీసెట్టింగ్ను తలపిస్తోంది. క్షేత్రస్థాయిలో సచివాలయాల వద్ద ఉన్న డేటాఎంట్రీ ఆపరేటర్, తరువాత టెక్నికల్ అసిస్టెంట్‌ను దాటి మిల్లుల వద్ద ఉన్న కస్టోడియన్ అధికార్లు (వీఆర్వోలు) వరకు దళారీలు మూడు స్టేజిల్లో దాటుకుంటూ వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పంట పొలం పక్కనే మిల్లు ఉన్నప్పటికీ సుదూరంలో ఉన్న సచివాలయం వద్దకు ధాన్యం తీసుకెళ్లి ట్రక్‌షీట్ వేసుకోవాలనే నిబంధనే దళారీలకు అనుకూలంగా మారింది. ఇన్ని పాట్లు పడలేమని రైతులు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. నేరుగా మధ్యవర్తుల నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాలంటే వివరాలు బి–రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉండగా ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిలువుదోపిడీ ప్రతి సచివాలయంలోనూ రైతుల తరఫున ట్రక్‌షీట్ వేసే ది దళారీలే. మాలాంటి రైతు లు నేరుగా వెళ్తే టెక్నికల్ ఇష్యూ అని, యాప్ పని చేయటంలేదనిచెబుతున్నారు. ఇంత నిలుపు దోపి డీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. – యేదూరు శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు, పోలాకి దళారీలకు అనుకూలంగా మార్చేశారు ధాన్యం కొనుగోలును దళారీలకు, మధ్యవర్తులకు అనుకూలంగా మార్చేశారు. రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయన్న విషయం తప్ప.. క్షేత్రస్థాయిలో మొత్తం దళారీలతోనే వ్యవస్థ నడు స్తోంది. మిల్లర్లు నేరుగా అధికారులకు లంచాలు ఇస్తున్నామని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసేలా వ్యవస్థను దిగజార్చారు. – ధర్మాన కృష్ణచైతన్య, జెడ్పీటీసీ సభ్యుడు, పోలాకి రైతులను దోచుకుంటున్న దళారులు మిల్లుకు చేర్చిన ధాన్యంలో మూడొంతులు వారివే ఖర్చుల పేరుతో అన్నదాత జేబుకు చిల్లు పట్టించుకోని అధికారులు -
క్రీస్తు రాక కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను క్రిస్మస్ వస్తువులు ముంచెత్తాయి. స్టార్లు, పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలు, రంగు రంగుల శాంతాక్లాజ్‌ల బొమ్మలు బజార్లలో కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్ దగ్గరకు వస్తుండడంతో వీటికి గ
● క్రిస్మస్ కళర్స్డీసిల్టేషన్ ముసుగులోఇసుక దోపిడీమరుభూమినీ మింగేస్తున్న ఘనులుగార శివారులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం పక్కనే ఉన్న మంచినీటి పథకమిది. దీనికి దగ్గరలోనే ట్రైమెక్స్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఇవన్నీ ప్రస్తుతం సముద్రపు బ్యాక్ వాటర్‌తో ఉప్పు నీటిమయమయ్యేలా ఉన్నాయి.ఈ ఫొటో చూడండి. గార గ్రామం శివారులో శ్మశానాలు ఉన్న ట్రై జంక్షన్ ఇది. ఇక్కడే ఆరు శ్మశాన వాటికలు ఉన్నాయి. అందులో రెండు శ్మశాన వాటికలను ఆనుకుని నదిలోకి రోడ్డేసి రాత్రి పగలు టిప్పర్లలో ఇసుక తరలించేస్తున్నారు. డీసిల్టేషన్ తొలగింపులో భాగంగా ఒక మీటర్ లోతులో మాత్రమే మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు చేపట్టాలి. కానీ అనుమతులకు భిన్నంగా మూడు, నాలుగు, ఐదు మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. యంత్రాలు పెట్టి నదిని పెకిలించేస్తున్నారు. మూడు నుంచి ఐదు మీటర్ల లోతులో తవ్వకాలు జరపడంతో సముద్రపు బ్యాక్ వాటర్ వచ్చి, ఇక్కడ మంచినీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఉప్పునీరుగా మారిపోతున్నాయి. పక్కనే మంచినీటి పథకాలు, వాటర్ ప్లాంట్‌కు ఇసుక తవ్వకాలతో ముప్పు వాటిల్లుతోంది. ● పంట.. ఆరుగాల కష్టమంట గారలో యథేచ్ఛగా ఇసుక దందా డీసిల్టేషన్ పేరుతో ఇష్టారీతిన తవ్వకాలు మంచినీటి పథకాలకు ముప్పుగా మారిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూడకుండా అనుమతులు డీసిల్టేషన్ అనుమతులతో నిర్వాహకుల బరితెగింపు నదిలో యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు -
మొక్కజొన్నపై మక్కువ..!
● అధిక విస్తీర్ణంలో ఈ ఏడాది సాగు ● ఎరువుల కొరతపై ఆందోళన మొక్కజొన్న పంట మొక్క దశ నుంచి పంట ఏపుగా పెరిగే వరకు కత్తెర పురుగు తీవ్రత ఉంటుంది. పంటను ఒకటి రెండు రాత్రుల్లోనే పూర్తిగా తినేసేవిధంగా వ్యాప్తి చెందుతుంది. ఇదే సమయంలో రైతులు ఆప్రమత్తంగా ఉంటే వీటి దాడి నుంచి పంటను రక్షించుకోగలము. అలాగే ఒకే ఏరియాలో సుమారు 10 నుంచి 15 ఎకరాల వరకు సాగు చేస్తే పంట నష్టం తగ్గించడం సులభమవుతుంది. – కింజరాపు రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి, జలుమూరు జలుమూరు: ఆరుతడి పంటల్లో మొక్కజొన్న రైతులకు ప్రధాన పంట. ఈ పంట సాగులో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. అందువలన సాగుకు రైతులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదివరకు జిల్లావ్యాప్తంగా అధికంగా లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, పోలాకి, జలుమూరు మండలాల్లో సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి నరసన్నపేట, సారవకోట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, గార, శ్రీకాకుళం రూరల్ తదితర మండలాల్లోనూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చాలా వరకూ ఇప్పటికే మొక్కజొన్న వేయగా.. మరికొన్ని మండలాల్లో సైతం ప్రస్తుతం సాగుకు సమయాత్తమవుతున్నారు. ఇప్పటికే ఆయా పొలాలను ట్రాక్టర్, రోటావేటర్తో సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 70.319 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయనున్నట్లు అంచనా. యూరియాకు డిమాండ్ గడిచిన ఖరీఫ్‌లో వరిపంటలో యూరియాకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ప్రస్తుత రబీకు కూడా ఇదే దుస్థితి నెలకొందని రైతులు అందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రధాన ఎరువు యూరియా కాగా.. కాంప్లెక్స్ తదితర ఎరువుల అవసరం కూడా ఉంటుంది. ఎకరాకు సుమారు ఎనిమిది నుంచి పది బస్తాలు వరకు ఆయా ఎరువులు తప్పనిసరి. మొదటి దశలో మొక్కజొన్న వేసిన రైతులు యూరియా ఇప్పటికే మొదటి ఎరువుగా వేయడం జరిగింది. ఇక రెండోసారి కోసం లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల తదితర మండలాల్లో ఎరువుల షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు రైతులకు వివిధ రకాల ఎరువులను అంటగడుతున్నారు. దీంతో వాటి అవసరం లేకపోయినా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు కొందరు ధాన్యం వ్యాపారులు కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా గ్రామాల్లో లారీలతో యూరియా తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. కత్తెర పురుగు ప్రమాదం మొక్కజొన్నను లద్దె(కత్తెర) పురుగు ఆశిస్తుంది. ఇది తిరగబడిన వై ఆకారాంలో తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఉదర భాగంలో నల్లటి నాలుగు చుక్కలు చతురుస్ర ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా వీటిని గుర్తించవచ్చు. వీటి లార్వాలు పంట ఆకు, కాండను తింటాయి. మొదటి దశలో ఆకు పత్రహరితాన్ని పూర్తిగా తింటాయి. ఆకులు తిన్న అనంతరం కాండం తింటూ పూర్తిగా మొక్క లేకుండా చేస్తాయి. అందువలన వీటిని గుర్తించిన వెంటనే లార్వాను ఏరివేసి నాశనం చేయాలి. పురుగు, గుడ్ల సముదాయాన్ని గుర్తించి వెంటనే వేప సంబంధిత మందులు వాడుకోవాలి. ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోరి ఫైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు, క్విన్లాల్ ఫాస్ 2.0 మిల్లీ లీటర్ల మందు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎక్కువగా ఉన్నప్పుడు ఎమాక్సిన్ బెంజొయట్ 0.4 గ్రామాలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే విషపు ఎరలతో కూడా తెగుళ్లను నివారించుకోవచ్చు. -
కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్ జట్టు
శ్రీకాకుళం: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్) కబడ్డీ జట్టు డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు రాజమండ్రిలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో జరిగిన 27వ ఇంటర్ కళాశాలల క్రీడా టోర్నమెంట్–2025లో అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. జట్టు విజయం సాధించడానికి కృషి చేసిన ప్రిన్సిపాల్ డా.ఎస్.అప్పల నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ డా.బి.గౌరి నాయుడు, అలాగే క్రీడా మండలి సభ్యులైన డా.ఎల్.ప్రసన్న కుమార్, డా.ఎస్.నరసింహమూర్తిలను కళాశాల బృందం అభినందించింది. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 79 వినతులు టెక్కలి: అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా సుమారు 79 వినతులు స్వీకరించారు. సకాలంలో అర్జీలపై బాధితులకు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్డీఏ పీడీ కిరణ్, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ● ఇటీవల పలాసలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తన అత్త తోపల అంకమ్మ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల సాయాన్ని ఇప్పటివరకు ఇవ్వలేదని అల్లుడు కొత్తపల్లి ఎర్రయ్య ఫిర్యాదు చేశారు. ● టెక్కలి మండలంలోని పలువురు మిల్లర్లు ధాన్యం కొనుగోలు విషయంలో బస్తాకు అదనంగా ధాన్యం డిమాండ్ చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. ● టెక్కలి మండలంలోని తేలినీలాపురం గ్రామంలో తమకు చెందిన భూమికి మరొకరి పేరున ఆన్లైన్లో పత్రాలు చూపిస్తోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రోణంకి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ● కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన చెరువును కొంతమంది ఆక్రమించుకుంటున్నారని, దీనిపై గతంలో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామానికి చెందిన పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ● తన తండ్రి బసవల సింహాచలం నందిగాం మండలంలోని పశు సంవర్ధక శాఖలో జేవీఓగా పనిచేసి మరణించారని, ఆ కోటాలో తనకు ఉద్యోగాన్ని ఇప్పించాలని కుమార్తె రేవతి విన్నవించారు. వెలవెలబోయిన జిల్లా పరిషత్ శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా రిటైర్ రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్డీసీ పద్మావతిలు పీజీఆర్ఎస్ను నిర్వహించారు. అయితే ఉన్నతాధికారులు టెక్కలిలో నిర్వహించిన డివిజనల్ పీజీఆర్ఎస్లో పాల్గొనడంతో జిల్లా కేంద్రంలోని గ్రీవెన్సు వెలవెలబోయింది. కార్యక్రమంలో అందరూ ద్వితీయ, కింది స్థాయి అధికారులే పాల్గొన్నారు. -
‘మూమెంట్’ ఇవ్వరా..?
అరసవల్లి: వైద్యారోగ్య శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన వారికి మూమెంట్ ఆర్డర్లు కోసం స్థానిక వైద్యారోగ్య శాఖాధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారని పలువురు మహిళా ఉద్యోగినులు ఆరోపిస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్లుగా పనిచేసిన వారికి పబ్లిక్ హెల్త్ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తూ విశాఖపట్నం రీజనల్ డైరక్టర్ కార్యాలయం వద్ద ఈనెల 9న కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ మేరకు పదోన్నతులు పొందిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలంటే స్థానిక వైద్యారోగ్య శాఖాధికారి నుంచి మూమెంట్ ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆదేశాలను తొలుత ఈనెల 10న ఇస్తామని అధికారులు ప్రకటించడంతో పదోన్నతులు పొందిన సుమారు 11 మంది మహిళా ఉద్యోగినులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద వేచి చూశారు. ఐదు రోజులుగా ఇలాగే మూమెంట్ ఆర్డర్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోతున్నారు. సోమవారం రాత్రి 8 గంటల వరకు కూడా బాధితులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్దే ఉన్నప్పటికీ సంబంధిత విభాగాధిపతులు పట్టించుకోకపోవడంపై వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పదోన్నతులు పొందినవారికి మూమెంట్ ఆర్డర్లు జారీ చేయాలని కోరుతున్నారు. -
ప్రావీణ్యం సంపాదించాలి
సారవకోట: నూతన గృహోపకరణాల తయారీలో కార్మికులు మరింత ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండలంలోని బుడితి గ్రామానికి చెందిన కంచు, ఇత్తడి కార్మికులు తయారు చేసిన నూతన గృహోపకరణాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు అందజేశారు. కంచు, ఇత్తడి కార్మికులకు ఇటీవల లేపాక్షి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వగా, వారిచ్చిన శిక్షణలో సూచించిన వస్తువులు తయారు చేశారు. లేపాక్షి ద్వారా వాటిని విక్రయించేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. అభ్యుదయం సైకిల్ యాత్ర నేడు శ్రీకాకుళం క్రైమ్: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలో అభ్యుదయం సైకిల్ యాత్ర మంగళవారం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్రలో ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు అత్యధికంగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. యాత్ర అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో భారీ బహిరంగ అవగాహన సభ జరుగుతుందన్నారు. యాత్ర సాగే మార్గం సింహద్వారం – ఎర్రంనాయుడు ఆర్చి కూడలి – డే అండ్ నైట్ కూడలి – రామలక్ష్మణ కూడలి – సూర్యమహల్ కూడలి – జీటీ రోడ్డు – ఏడురోడ్ల కూడలి చోరీలు చేసిన వ్యక్తి అరెస్టు పొందూరు: మండల కేంద్రంలోని గాంధీనగర్–1, 2 వీధుల్లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనాలకు సంబంధించి దొంగను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన అవనాపు అప్పలస్వామి పొందూరు బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు. పొందూరులో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిందని, గాంధీనగర్ వీధుల్లో దొంగతనాలు చేసిన వ్యక్తిగా గుర్తించామని ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో దొంగతనం చేసిన సొత్తును అప్పలస్వామి నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు. ఒక కేసుకు సంబంధించి అరతులం బంగారం, వెండి, రెండో కేసుకు సంబంధించి 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. పొందూరు కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. పంచ్ అదిరింది శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం పంచ్ అదిరింది. ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడ వేదికగా 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, మూడు రజత, మరో మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి శభాష్ అనిపించారు. అలాగే రాష్ట్ర ఛాంపియన్షిప్ రన్నరప్ టైటిల్‌ను సాధించారు. బంగారు పతకం సాధించిన పి.విశ్వేశ్వరరావు ఆలిండియా సీనియర్స్ నేషనల్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఉత్తరాఖండ్ వేదికగా ఈనెల 31 నుంచి జనవరి 6 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా క్రీడాకారుల రాణింపునకు ప్రధాన కారణం డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అని జిల్లా బాక్సింగ్ సంఘ పెద్దలు కొనియాడారు. క్రీడాకారులు ఉన్నతమైన రాణింపునకు కోచ్ అందిస్తున్న కఠోర శిక్షణే కారణమని డీఎస్డీవో ఎ.మహేష్‌బాబు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్ (అను), వంగా మహేష్ పేర్కొన్నారు. ఈ టోర్నీకి క్రీడాకారులకు కోచ్ మేనేజర్‌గా వ్యవహరించిన పి.అప్పలరాజు, అసిస్టెంట్ కోచ్ రాజీవ్‌ను అభినందించారు. -
అదృష్టం వరించేనా..!
● నేడు ఐపీఎల్–19 మినీ ఆక్షన్ ● జిల్లా నుంచి రేసులో ఎస్డీఎన్వీ ప్రసాద్ త్రిపురాన విజయ్ఎస్డీఎన్వీ ప్రసాద్ శ్రీకాకుళం న్యూకాలనీ: భారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్‌కు ఎంపికై తే చాలని సగటు క్రికెటర్ కలగంటాడు. ఐపీఎల్‌కు ఎంపికై తే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్ సీజన్–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్డీఎన్వీ) ప్రసాద్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష పరిధిలో జిల్లాలో పనిచేస్తున్న సీఆర్ఎం టీచర్లు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించారు. ముందుగా ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా చేరుకొని దీక్షను నిర్వహించారు. ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫారం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పోలాకి తవిటినాయుడు, ప్రధాన కార్యదర్శి బి.గిరిధర్, కోశాధికారి ఎన్.ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్సుల్లో ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. 2016లో పీఏబీ ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నారని, అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. సీఆర్ఎంటీల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి, అందరికీ ఒకే విధమైన హోదా, పనిని కల్పించాలన్నారు. ఫీల్డు లెవల్లో పనిచేస్తున్నవారికి అలవెన్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్‌లో డీఆర్వోకు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.రామకృష్ణ, డి.శ్రీనివాసరావు, టి.ప్రసాదరావు, పి.వైకుంఠరావు, జయలక్ష్మి, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
సత్తాచాటిన సిక్కోలు
● రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాగా ● జూనియర్స్ బాలబాలికల రెండు విభాగాల్లోనూ రాణింపు ● నేషనల్ క్యాంప్‌కు ఆరుగురు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని జిల్లా క్రీడాకారులు మరోసారి నిరూపించారు. కొత్త సీజన్లోను శ్రీకాకుళం కబడ్డీ జట్లు సత్తాచాటాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు వేదికగా ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు 51వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్–2025 పోటీలు జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో సిక్కోలు జట్లు అదిరే ఆటతీరును కనబర్చి విజయబావుటా ఎగురవేశాయి. ఈ టోర్నీలో శ్రీకాకుళం బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించగా, బాలుర జట్టు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకంతో రాణించింది. బాలికల జట్టుకు కోచ్, మేనేజర్లుగా వెంకట్రావు, శ్యామ్, బాలురు జట్టుకు కోచ్, మేనేజర్లుగా లోకేష్, చిరంజీవి వ్యవహరించి మెప్పించారు. జాతీయ పోటీలకు ఆరుగురు ఎంపిక ఇదిలా ఉండగా ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఆరుగురు క్రీడాకారులు జాతీయ కబడ్డీ పోటీల్లో ఏపీ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల జట్టుకు ఎస్.హర్షిత, పి.హరిణి, పి.యమున ఎంపికవ్వగా, బాలురు జట్టుకు ఎస్.రామ్మోహన్రావు, షేక్ రఫీ, ఎన్.అప్పలరాజు ఎంపికయ్యారు. జిల్లా జట్ల రాణింపు, క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై శ్రీకాకుళం జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు, కోశాధికారి నాగళ్ల రమేష్, డీఎస్డీఓ ఎ.మహేష్‌బాబు, ఒలింపిక్, పీఈటీ సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
టెక్కలి: టెక్కలి డివిజన్ కేంద్రంలోని కాటాబందలో అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు. రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా దుకాణాలు కడుతున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకోవడంపై ‘ప్రభుత్వ స్థలంలో పాగా’ శీర్షికతో సాక్షి పత్రికలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం టెక్కలి ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అయ్యప్పనగర్ వాసులంతా ఫిర్యాదు చేశారు. తమ కాలనీకు వెళ్లేందుకు ఉన్నటువంటి రోడ్డుకు ఆనుకుని ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కలెక్టర్ స్పందించి తక్షణమే ఆయా అక్రమ నిర్మాణాలు ఆపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కాగా ఈ నిర్మాణాలు పూర్తిస్థాయిలో ఆగిపోతాయా లేదా తాత్కాలికంగా ఆగుతాయా అనే చర్చ స్థానికంగా నెలకొంది. -
మా డబ్బు ఎప్పుడు చెల్లిస్తారు..?
● ఇచ్ఛాపురం పోస్టాఫీస్ వద్ద బాధిత ఖాతాదారుల నిరసన ● పట్టించుకోని పోస్టల్ ఉన్నతాధికారులు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులంతా సోమవారం ఆందోళన చేశారు. తాము ఖాతాల్లో దాచుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తారని పోస్టల్ సిబ్బందిని నిలదీశారు. పోస్టాఫీస్ సిబ్బంది కార్యాలయంలోనికి వెళ్లకుండా పోస్టల్ గేట్ వద్ద ఖాతాదారులంతా బైఠాయించి నిరసన తెలియజేశారు. గత ఏడాది ఇచ్ఛాపురం పోస్టాఫీస్ కార్యాల యం ఆధారంగా చేసుకొని పోస్టల్ సిబ్బందే 36 మంది ఖాతాల నుంచి రూ.2.78 కోట్ల భారీ స్కామ్ కి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. దీంతో జూలైనెలలో సంబంధిత ఖాతాదారులను పోస్టాఫీస్ వద్ద విచారించడంతో ఖాతాదారులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి ఖాతా దారులంతా ఆందోళనకు గురవుతున్నారు. పోస్టల్ సూపరింటెండెంట్ హరిబాబు ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా డబ్బు వస్తుందని భరోసా ఇచ్చారు. ఇలా చెప్పి నాలుగు నెలలవుతున్నా ప్రక్రియ ముందుకు కద ల్లేదు. దీంతో ఖాతాదారులంతా కలసి సోమవారం పోస్టల్ కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు. అయినా పోస్టల్ ఉన్నతాధికారులు స్పందించలేదు. -
● అడుగడుగునా అడ్డంకులు
● పాతపట్నం నుంచి వాహనాలతో వచ్చిన నాయకులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కోటి సంతకాలు గర్జించాయి. అశేష జన ర్యా లీ మధ్య కోటి సంతకాల ప్రతుల వాహనం తాడేపల్లికి బయల్దేరింది. ప్రభుత్వం కుట్రలు పన్నినా, పోలీసులు నిర్బంఽధించినా, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆంక్షలు పెట్టినా, టోల్గేట్ల వద్ద అడ్డు కున్నా వైఎస్సార్ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. ఎంత అణగదొక్కితే అంత పైకి లేస్తామన్నట్టుగా అంతే కసితో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లాలో 4 లక్షలకు పైగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు విజయవాడ తరలి వెళ్లాయి. శ్రీకాకుళంలోని టౌన్ హాల్ వద్ద సంతకాల పత్రాల వాహనాన్ని నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. దానికి ముందు నాయకులంతా జెండాలు, ప్లకార్డు లు పట్టుకుని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పెద్ద మార్కెట్ వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి, నిలువరించేందుకు యత్నించారు. కానీ ప్రజాగ్రహాన్ని నిలువరించలేకపోయారు. పార్టీ శ్రేణులంతా ముందుకు తోసుకుని వెళ్లాయి. దీంతో కాసేపు తో పులాట చోటు చేసుకుంది. అక్కడి నుంచి భారీ ర్యాలీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీదు గా ఏడు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడి నుంచి పాతబ్రిడ్జి, నవభారత్ జంక్షన్ మీదుగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయానికి కోటి సంతకాల ప్రతుల వాహనం వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ర్యాలీ దద్దరిల్లిపోయింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు టౌన్ హాల్లో భారీ సమావేశం జరిగింది. చంద్రబాబు తప్పుడు విధానాలను నాయకులు కడిగిపారేశారు. ప్రభుత్వ కుట్రలు.. పోలీసుల ఆంక్షలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా నడుస్తుండటం, ప్రజ ల్లో అనూహ్య స్పందన రావడాన్ని చూసి తట్టు కో లేక ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఆదివారం రాత్రే ఆ కుట్రలకు పదును పెట్టింది. పోలీసులకు బాస్‌ల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంకేముంది వాటిని ఆచరణలో పెట్టేందుకు జిల్లా పోలీసు వర్గాలు రంగంలోకి దిగాయి. ఆదివారం రాత్రే సెట్ కాన్ఫరెన్స్ పెట్టి, కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించాయి. ఎక్కడికక్కడ నిలువరించకపోతే ఇబ్బందులు పడతారని క్షేత్ర స్థాయి అధికారులను హెచ్చరించాయి. దీంతో శ్రీకాకుళంలో జరిగే ప్రజా ఉద్యమం భారీ ర్యాలీకి వెళ్లొద్దని పోలీసుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. సోమవారం ఉదయం కార్యరూపం దాల్చాయి. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై శ్రీకాకుళం వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, ఆమదాలవలస నియోజక వర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఆరంగి మురళి, దుంపల లక్ష్మణరావు, శాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, గొండు కృష్ణమూర్తి, చల్ల రవి, ఎంవీ పద్మావతి, కరిమి రాజేశ్వరరావు, పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. శ్రీకాకుళం టౌన్‌హాల్ నుంచి ఏడురోడ్లు కూడలివరకు ర్యాలీగా వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులు నిర్బంధాలు ఎందుకు.? ప్రశ్నించేవారిని నిర్బంధించాలనుకుంటే ఊరుకునేవారు ఎవరూ లేరు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు. ఏడాదిన్నర పాలనలో రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ.5వేల కోట్లు కేటాయిస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. గిట్టుబాటు లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. చంద్రబాబు సర్కారును గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయి. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ ఎందుకంత నిర్లక్ష్యం..? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా నిర్మించారా..? ఐదేళ్ల పాలనలోనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. పేదల ఆరోగ్యమన్నా, పేదోడికి వైద్యమన్నా చంద్రబాబుకి ఎందుకంత నిర్లక్ష్యమో. టీడీపీ హయాంలో ఖర్చు ప్రభుత్వానికి ఆదాయం ప్రైవేటువారికి దక్కుతోంది. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో రూ.2.66లక్షల కోట్లు అప్పుచేయడం విడ్డూరం. – కుంభా రవిబాబు, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ విద్య మన హక్కు విద్య రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చంద్రబాబు ప్రభు త్వం దాన్ని గాలికి వదిలేసింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేసి వైద్యవిద్య సీట్లు కోట్లాది రూపాయలకు అమ్ముకోవడం అన్యాయం. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్ యజ్ఞంలా కోటి సంతకాలు కోటి సంతకాల కార్య క్ర మం యజ్ఞంలా సాగింది. జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది సంతకాలు చేశారు. – గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సీది రి అప్పలరాజు తదితర నాయకులను జాతీయ రహదారిపై పోలీసు వాహనా లు అడ్డంగా పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనాల్లో ఉన్న వారందరూ దిగిపోయి వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ నాయకుల వాహనాలతో పాటు మిగతా వాహనాలను అడ్డుకున్నారు. ఇచ్ఛాపురంలో జాతీయ రహదారిపైకి వైఎస్సార్సీపీ నాయకుల వాహనా లు రాగానే పోలీ సులు అడ్డుకున్నారు. ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజ య, మరికొందరి నాయకులను నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. పిరియా విజయ ఎంత నచ్చ చెప్పినా పోలీసులు వినలేదు. తాము చెప్పినట్టే వ్యవహరించాలని పట్టుబట్టారు. అయితే, వైఎస్సార్సీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుదలతో శ్రీకాకుళం చేరుకున్నారు. టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితరులు వస్తున్న వాహనాలను మడపాం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత మార్గంలో వెళ్తుంటే అడ్డకోవడమేంటని తిలక్ పోలీసులను ప్రశ్నించారు. కానీ, పోలీసులు అంగీకరించలేదు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్గేట్ వద్దే నిరసన తెలియజేశారు. ఆమదాలవలసలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న దశలో పార్టీ సమన్వయ కర్త చింతా డ రవికుమార్‌తో పాటు నాయకులను పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని శ్రీకాకుళం వస్తుండగా కొత్తరోడ్డు జంక్షన్ వద్ద, సెవెన్ రోడ్డు జంక్షన్ వద్ద మళ్లీ అడ్డుకున్నారు. కొత్తరోడ్డు వద్ద పోలీసులకు, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నరసన్నపేట నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం వెళ్లే వైఎస్సార్సీపీ నాయ కుల వాహనాలను కూడా మడపాం టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్నా రు. అలాగే, ధర్మాన కృష్ణచైతన్య, వారి నాయకులు, కార్యకర్తలతో కార్లు, ద్విచక్ర వాహనాలతో శ్రీకాకుళం చేరుకున్న క్రమంలో అరసవిల్లి జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కృష్ణచైతన్య మధ్య 30నిమిషాలు వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎస్పీ వివేకానంద అక్కడికొచ్చి, సర్దిచెప్పి వాహనాలను 80 అడుగుల రోడ్డులో పార్కింగ్ చేయించి, కాలి నడకన టౌన్ హాల్ దగ్గరకు వెళ్లేందుకు అనుమతించారు. -
అమ్మకానికి ‘ ఆంధ్రప్రదేశ్ ’
వైఎస్సార్ సీపీ కంటే ఎక్కు వ పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు జనాలను మోసం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ పడదు. రైతుకు బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోయారు. గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు. ఐదేళ్ల పాలనలో రూ.3.30 లక్షల కోట్ల అప్పు విధ్వంసమా.. ఏడాదిన్నరలో రూ.2.66 లక్షల కోట్లు విధ్వంసమా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారుచేసి చివరికి అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పథకమే అమలు చేస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్సార్సీపీ హయాంలో రామరాజ్యం ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ పాలన సాగించారు. ఆయన హయాంలో రామరాజ్యాన్ని స్థాపించారు. కులమతాలకు అతీతంగా పథకాలు ఇచ్చారు. అబద్ధాలు నమ్మి ప్రజలు మంచి పాలనను దూరం చేసుకున్నారు. మళ్లీ ఆ రాజ్యాన్ని తెచ్చుకుందాం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే ఇది దోపిడీ ప్రభుత్వం చంద్రబాబుకు తెలిసిందంతా దోపిడీయే. మంత్రి అచ్చెన్నాయుడు రైతుల సమస్యలు గాలికి వదిలేసి మిల్లర్లు, గ్రానైట్, పాలిషింగ్ యూనిట్ల వద్ద దోపిడీ చేస్తున్నారు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త -
ఇది రాజ్యాంగ ఉల్లంఘన
పేదల కోసం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు నిర్మించతలపెడితే పీపీపీ ముసుగులో చంద్రబాబు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలనుకోవడం దుర్మార్గం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తే ఉద్యమాలే శరణ్యమవుతాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడమంటే పేద ప్రజల ఆరోగ్యాన్ని అమ్మేయడమే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ ఉద్యమంలా నిర్వహించాం. అన్నీ ప్రైవేటు చేతికి వెళ్తే పేదవాడికి అనారోగ్యం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇసుక, మట్టి, నీరు, గాలి అప్పనంగా అమ్మేసి దోపిడీ చేయడమే కూటమి పాలన. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయి. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెడ్‌బుక్ రాజ్యాంగం ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు చూశాక వైఎస్ జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు మాత్రం తన వాళ్లు బాగుపడితే చాలు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదనే ధోరణిలో ఉన్నారు. ఇటీవల జరిపిన సర్వేలోనూ 80 శాతం కూటమి ఎమ్మెల్యేలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు తేలింది. రాజధాని తప్పితే చంద్రబాబుకు మరేమీ పట్టడం లేదు. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు -
పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా సోమవారం పాత బస్టాండ్ సిగ్నల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అమరజీవి త్యాగాన్ని తప్పక స్మరించుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, బీసీ వెల్ఫేర్ అధికారి అనురాధ, స్థానిక తహసీల్దార్ గణపతి రావు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దశలవారీ పోరాటాలకు సిద్ధం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని యూనియన్ గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటు తక్షణమే విరమించాలన్నారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి కార్మికులకు కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కనీస వేతనం రూ.10వేలు, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు, ప్రతి నెల 5లోపు వేతనాలు, బిల్లుల చెల్లింపు తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. పెరిగిన ధరలకగుణంగా బడ్జెట్ పెంచాలన్నారు. రాజకీయ జోక్యం, అక్రమ తొలగింపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక తరహాలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రవీణ, బి.కన్యాకుమారి, జయలక్ష్మి, పద్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
కలములే గళములై..
శ్రీకాకుళంప్రభుత్వ స్థలంలో పాగాటెక్కలిలో అక్రమ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. –8లోసోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రెండు నెలల పండగ చివరి అంకానికి చేరుకుంది. కలాల గళాల నుంచి సంతకాల రూపంలో పురుడు పోసుకున్న అభిప్రాయాలు, ప్రజాభీష్టానికి ప్రతిబింబమై నిలిచే పత్రాలు పాలకుల పునాదులు కదిలించేంత శక్తిని సముపార్జించాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మరో మాట లేకుడా తిరస్కరిస్తూ జిల్లా నుంచి 4.80 లక్షల మంది ఈ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నేడు కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, అనుబంధ విబాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల టౌన్‌హాల్‌కి ఉదయం 10 గంటలకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో పెట్టి 10.30 గంటలకు ర్యాలీగా బయలుదేరనున్నారు. కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మొదలుపెట్టిన యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ అపూర్వ స్పందనను దక్కించుకుంది. జిల్లాలో దాదాపు 4.80 లక్షల మంది ఈ పత్రాలపై సంతకాలు చేసి ప్రజా వ్యతిరేకతను స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో నాయకులు రెండు నెలల పాటు కోటి సంతకాల కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్యను సులువుగా అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హ యాంలోనే దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు పూర్తిచేసి తరగతులు ప్రారంభించారు. మిగిలిన 12 కాలేజీలకు 7 భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 5 కాలేజీలు 80 శాతం ప నులు పూర్తయితే వాటన్నింటిని చంద్రబాబు ప్రైవే టు వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు చూస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ రెండు నెలలు గా పోరాడుతోంది. పలు చోట్ల బీజేపీ, జనసేన నేతలు సైతం ఈ కార్యక్రమాన్ని మద్దతు పలికారు. పేదలపై ఎందుకంత కక్ష..? కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో దాదాపు 4.80 లక్షల మంది తమ సంతకాలతో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి తోడు వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతి గ్రామంలోనూ సమావేశాలు పెట్టి ప్రైవేటీకరణ వల్ల వచ్చే నష్టాలు వివరించారు. ఇప్పటికే నియోజకవర్గాల నుంచి ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రానికి చేరవేశారు. ఆ ప్రతులను తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయానికి సోమవారం ఓ ప్రత్యేక వాహనంలో ర్యాలీగా తీసుకెళ్లనున్నారు. అనంతరం ఈ నెల 18న వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా 175 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నా యకులు, పార్టీ ముఖ్య నాయకులు, వైఎస్సార్సీపీ అభిమానులంతా కలిసి గవర్నర్‌ను కలిసి తమ అభిప్రాయాలను తెలపనున్నారు. చివరి అంకానికి కోటి సంతకాల సేకరణ నేడు శ్రీకాకుళం నుంచి తాడేపల్లికి సంతకాల పత్రాల చేరవేత 18న గవర్నర్‌కు అందించేందుకు సన్నాహాలు 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కల’మెత్తిన సిక్కోలు జిల్లాలో 4.80 లక్షల సంతకాల సేకరణ -
గిరిజన గ్రామాల్లో సత్యసాయి ట్రైబల్ హెల్త్‌కేర్
శ్రీకాకుళం కల్చరల్: గిరిజన గ్రామాల్లో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్ హెల్త్‌కేర్’ అనే నూతన సేవకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతున్న సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సత్య సాయి సేవా సమితి పెద్ద మందిరంలో జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు అధ్యక్షతన సత్యసాయి సేవా సంస్థల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ హెల్త్ కేర్ వాహనం ద్వారా నెలకు ఒకటి రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తామన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ తదితర వ్యాధులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య సూత్రాలు వివరించి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని సాయిగణేష్ మందిరంలో ఇప్పటికే సత్యసాయి ఆశ్రిత సేవ ప్రారంభించి విద్యావంతులైన గ్రామీణ యువకులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తూ ఉద్యోగం సాధించే వరకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సత్యసాయి సేవా రథం ద్వారా రానున్న ఐదేళ్లలో 1000 గ్రామాలలో సత్య సాయి భజన మండళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. కమలా త్రివేణి మాట్లాడుత సత్య సాయి 100వ పుట్టినరోజు వేడుకల్లో మహిళల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పెద్ద మందిరం కన్వీనర్ కంబ మురళీకృష్ణ, జిల్లా, జోనల్ పదాధికారులు, కన్వీనర్లు, బాల వికాస్ గురువులు, యువత, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఉత్సాహంగా మోడరన్ పెంటాథ్లెన్ పోరు
● రాష్ట్ర స్కూల్‌గేమ్స్ పోటీలకు భారీగా క్రీడాకారులు రాక ● విజేతలకు బహుమతులు ప్రదానంశ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగిన రాష్ట్ర మోడరన్ పెంటాథ్లెన్ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 69వ ఏపీ రాష్ట్రస్థాయి మోడరన్ పెంటాథ్లెన్ (రన్నింగ్, స్విమ్మింగ్) చాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ పోరులో అత్యద్భుతమైన ఆటతీరుతో బాలబాలికలు ఆకట్టుకున్నారు. ● అండర్–17 విభాగంలో 1600 మీటర్ల పరుగు, 50 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్స్, అండర్–19 విభాగంలో రెండు కిలోమీటర్ల పరుగు, 100 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్స్ నిర్వహించారు. పరుగుపందాలను కోడిరామ్మూర్తి స్టేడియంలో, స్విమ్మింగ్ పోటీలు శాంతినగర్‌కాలనీలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా నిర్వహించారు. విజేతలగా నిలిచిన బాలబాలికలకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, కె.మాధవరావు, టి.శ్రీనివాసరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.మెజారిటీ విజేతలు ఆతిథ్య జిల్లాకు చెందినవారు కావడం విశేషం. విజేతలు వీరే అండర్–17: బాలురు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.వాసుదేవరావు, ఎ.మహేష్, జి.రమేష్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎ.సంతోషిని (శ్రీకాకుళం), బి.సాన్విత (కర్నూలు), జి.కావ్య (శ్రీకాకుళం) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అండర్–19: బాలురు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.కార్తీక్, బి.ఉదయ్‌కుమార్, జి.ఉదయ్‌కిరణ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎన్.శ్రావణి(శ్రీకాకుళం), జి.జ్యోతిక (శ్రీకాకుళం), కె.కళ్యాణి (వైఎస్సార్ కడప) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. -
రిమ్స్‌లో క్యాంటీన్ కలేనా?
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో వైద్యులు ,వైద్య విద్యార్థులు, స్టాఫ్ నర్సులు, మినిస్ట్రీయల్ సిబ్బందికి ఇప్పట్లో క్యాంటీన్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి ఇక్కడ క్యాంటీన్ ఏర్పాటు కోసం అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఏడాది దాటినా అధికారులు స్వాధీనం చేసుకోలేదు. క్యాంటీన్ నిర్వహణకు టెండర్ని కూడా పిలవలేదు. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు క్యాంటీన్ కోసం నిర్మించిన భవనాన్ని రోగులకు భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ఆదేశించారు. ఇప్పుడు రోగుల కోసం వంటకాల సాగిస్తున్న గది అధ్వానంగా ఉందని అపరిశుభ్రంగా ఉందని పేర్కొన్నారు. అలాగే మార్చురీ సమీపంలో క్యాంటీన్ భవనాన్ని నిర్మించడం వల్ల అక్కడ తినేందుకు ఇబ్బంది పడతారని చెప్పారు. ఇదే సమావేశంలో ఆ భవనాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు తీర్మానం చేసేశారు. కాంట్రాక్టర్‌కు అప్పగించిన భవనానికి మెట్లు తప్ప ర్యాంప్ లేదని, ఆహారాన్ని కిందకు దించడం కష్టమని కొందరు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. క్యాంటీన్ నిర్వహణకు వేరొక స్థలాన్ని ఎంపిక చేసుకొని నిర్మించుకోవాలని సూచించారు. ఇది జరగాలంటే సుమారు రెండేళ్లకు పైగా పట్టే పరిస్థితి ఉంటుంది. అప్పటివరకు రిమ్స్‌లో పనిచేస్తున్న 300 మంది వైద్యులు, వెయ్యి మందికి పైగా ఎంబీబీఎస్ విద్యార్థులు, 300 మంది పీజీ విద్యార్థులు, 200 మంది వరకు హౌస్ సర్జన్లు, 400 మంది స్టాఫ్ నర్సులు, మరో 500 మంది వరకు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, నిత్యం అవుట్ పేషెంట్లుగా, ఇన్ పేషెంట్లుగా వైద్య సేవల కోసం వచ్చే వెయ్యి మందికి పైగా రోగులకు క్యాంటీన్ సేవలు అందుబాటులో లేనట్లే. రేకుల షెడ్డే గతి.. ప్రస్తుతం రిమ్స్‌లో ఓ చిన్న రేకుల షెడ్డులో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు.. ఇందులో ఫలహారాలు, ఆహారం అంతంతమాత్రంగానే లభిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. తమ కోసం ఏర్పాటు చేసిన మెస్‌లో ఆహార పదార్థాలు బాగా ఉండటం లేదని, క్యాంటీన్ సదుపాయం లేక అర్ధాకలితో ఉండాల్సి వస్తోందని పీజీ విద్యార్థులతో పాటు హౌస్ సర్జన్లు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రిమ్స్ భవనాల్లో ఏదో ఒకచోట క్యాంటీన్ నిర్వహించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. రోగులకు సరఫరా చేసే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని క్యాంటీన్ భవనాన్ని కాంట్రాక్టర్‌కు అప్పగించాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి రిమ్స్‌లో ఖాళీగా ఉన్న ఏదో ఒక భవనంలో క్యాంటీన్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. ఈలోగా స్థలాన్ని గుర్తించి క్యాంటీన్ భవనం నిర్మించేలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపడతాం. – ప్రసన్నకుమార్, రిమ్స్ సూపరింటెండెంట్ రోగులకు భోజన సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు అప్పగించిన క్యాంటీన్ భవనం ఇదే రోగుల భోజన ఏర్పాట్ల కోసం కొత్త భవనం అప్పగింత క్యాంటీన్ కోసం వేరొక స్థలం చూసుకోవాలని పాలకుల ఆదేశం -
స్టాంప్ పేపర్ల కొరత!
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరకని నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లుటెక్కలి: టెక్కలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత కొనుగోలు దారులను వేధిస్తోంది. గత కొన్ని నెలలుగా 10, 20 రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలుదారులు బయట మార్కెట్లో కొంత మంది స్టాంప్ వెండర్ల ను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కార్యాలయంలో స్టాంప్ పేపర్లు దొరక్కపోవడంతో, బయట ఒక్కో పేపర్ రూ.50 నుంచి రూ.100 ఆ పైన కొనుగోలుదారుల అవసరానికి తగ్గట్టుగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, కార్యాలయంలో స్టాంప్ పేపర్లు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. నిత్యం వివిధ రకాల అఫిడవిట్లు, ప్రకటనలు, సాధారణ ఒప్పందాలకు, సెల్ఫ్ డిక్లరేషన్, అండర్ టేకింగ్, నోటరీ తదితర అవసరాలు కోసం అధికంగా డబ్బులు చెల్లించి నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీనిపై సబ్ రిజిస్ట్రార్ బాలన్న వద్ద ప్రస్తావించగా కొన్ని రకాల సాంకేతిక కారణాలతో 10, 20 నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు రావడం లేదని వెల్లడించారు. -
ప్రాణం తీసిన హైవే గొయ్యి
రణస్థలం: మండల కేంద్రంలో జరుగుతున్న జాతీ య రహదారి పై వంతెన పనులు అమాయక ప్రయాణికులను బలికొంటున్నా యి. ఎక్కడికక్కడ గోతులు తవ్వడం, హెచ్చరిక బోర్డులు సరిగ్గా కనిపించకపోవడంతో వాహనదారులు ఆ గోతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా పిల్లర్ గొయ్యిలో పడి ఓ మూగవాడు అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు, జేఆర్ పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు లావేరు మండలంలోని వేణుగోపాలపురం (అగ్రహారం) గ్రామానికి చెందిన దుర్గాసి నర్సింగరావు(25) శ్రీకాకుళం నుంచి రణస్థలం వైపు వస్తుండగా పైవంతెనకి తీసిన పిల్లర్ గోతిలో శనివారం రాత్రి 11 గంటలకు పడిపోయాడు. పైవంతెన పనుల నిమిత్తం హైవే రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకి మలుపు ఉందని పెట్టిన బోర్డులు అతడు గమనించలేదు. అలాగే ఆ మలుపు వద్ద పూర్తి స్థాయిలో స్టాపర్ బోర్డులు లేవు. హైవేపై ఉన్న గ్యాప్ నుంచి ద్విచక్రవాహనంతో మలుపు తిరగకుండా నేరుగా వచ్చి గోతి లో పడిపోయాడు. ఆదివారం ఉదయం స్థానికు లు చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి తల్లిదండ్రులు సన్యాసమ్మ, లక్ష్మణరావు, అన్నయ్య రమేష్, అక్క పార్వతి ఉన్నారు. ఇతడు పుట్టుకతోనే మూగవాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ బతుకుతున్నాడు. మృతదేహాన్ని శవపంచనామా కోసం శ్రీకాకుళం సర్వజనాస్పత్రికి తరలించారు. జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘జీతాలు ఇవ్వండి మహాప్రభో’
జలుమూరు: నరసన్నపేట వంశధార డివిజన్ పరిధిలోగల లస్కర్లు వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నరసన్నపేట బ్రాంచ్ కాలువ పెద్ద దూగాం వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లస్కర్ల సంఘం యూనియన్ ప్రతినిధులు తాన్ని అప్పన్న, చిట్టినేని జనార్దన్‌లు తెలిపారు. వ్యవసాయ సీజన్లలో ఏడాదికి నాలుగు నెలలు అటు రైతులకు ఇటు వంశధార అధికారులకు సేవలు అందిస్తున్న తమకు వేతనాలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని వారు వాపోయారు. -
ముగిసిన పెన్కాక్ సిలాట్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడలతో శారీరక ఉల్లాసంతోపాటు మానసిక ఆనందం లభిస్తుందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా జిల్లాస్థాయి పెన్కాక్ సిలాట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 500 మంది వరకు క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. విజేతలకు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులతోపాటు పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రేగిడి దయామయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్‌నాయుడు, ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
● బుడితిలో గృహోపకరణాల తయారీ
ఫ్లవర్ వాజ్‌లు శ్రీముఖలింగం గోపురం, గడియారం, అద్దం మండలంలోని బుడితి గ్రామంలో నూతన గృహోపకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ లేపాక్షి ఆధ్వర్యంలో రెండు నెలలు శిక్షణ కార్యక్రమం నిర్వహించి నూతన గృహోపకరణాలపై శిక్షణ ఇచ్చా రు. ఇటీవల కలెక్టర్ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి నూతన గృహోపకరణాలు తయా రు చేసి తనకు చూపించాలని సూచించారు. దీంతో కింతాడ జనార్ధనరావు(బుజ్జి) ఇత్తడిలో గడియారం, శ్రీముఖలింగం దేవస్థానంలోని గోపురాలు, అద్దం తయారు చేశారు. అలాగే మరో కార్మికుడు ఫ్లవర్ వాజ్‌లు తయారు చేశారు. వీటిని సోమవారం కలెక్టర్‌కు అందజేయనున్నట్లు వారు తెలిపారు. –సారవకోట -
ప్రభుత్వ స్థలంలో పాగా!
● టెక్కలి కాటాబందలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు ● మంత్రికి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన టెక్కలి : టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని కాటాబందలో అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులను స్థానికులు ఆదివారం అడ్డుకున్నారు. ఇటీవల పాత జాతీయ రహదారి నుంచి భవానీనగర్ మీదుగా జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలపై కొంత మంది కన్నుపడింది. ఈ క్రమంలో అయ్యప్పనగర్‌కు వెళ్లే దారిలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. వాస్తవానికి, గతంలో పునాదుల స్థాయిలో ఉన్నప్పుడే అయ్యప్పనగర్‌కు చెందిన స్థానికులంతా ఈ అక్రమ నిర్మాణం విషయమై మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణాలను ఆపే విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయా అక్రమ నిర్మాణాలు అధికార పార్టీ కార్యకర్తలే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షకుడిగా ఉంటానంటూ మంత్రి బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ, మరో వైపు పట్టణం నడిబొడ్డున ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణానికి ఆనుకుని అయ్యప్పనగర్ రోడ్డు నిర్మాణానికి గతంలో ఇదే మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయా శిలాఫలకాలకు ఆనుకునే అక్రమ నిర్మాణం జరుగుతోంది. దీనిపై మంత్రితో పాటు స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాము తన సిబ్బందితో నిర్మాణ స్థలం వద్దకు చేరుకుని ఆయా పనులు ఆపాలని ఆదేశించారు. అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఆనుకుని అక్రమంగా దుకాణాల నిర్మా ణం చేస్తున్నారు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు శ్లాబ్ నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యా రు. కాలనీవాసులంతా కలిసి వాటిని అడ్డుకున్నాం. – టి.వైకుంఠరావు, అయ్యప్పనగర్, టెక్కలి కాలనీకు వెళ్లే మార్గంలో దర్జాగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా దుకాణాలు నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడుకూ ఫిర్యాదు చేశాం. అక్రమ నిర్మాణాలు ఆపకపోతే ఊరుకునేది లేదు. – ఎం.హేమసుందర్, అయ్యప్పనగర్, టెక్కలి -
బీచ్‌కు సందర్శకుల తాకిడి
గార : మొగదాలపాడు, కె.మత్స్యలేశం, శ్రీకూర్మం– మత్స్యలేశం బీచ్‌లకు అధిక సంఖ్యలో సందర్శకులు పోటెత్తారు. మార్గశిర ఆదివారం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సమీప జీడితోటల్లో వంటలు చేసుకుని, సాయంత్రం వేళ సముద్రంలో స్నానాలు చేస్తూ సందడిగా గడిపారు. శాలిహుండం, బౌద్ధారామాలనూ పలువురు పర్యాటకులు సందర్శించారు. కళింగపట్నం వద్ద బీచ్‌కు అనుమతులు లేకపోవడంతో మైరెన్ సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది సందర్శకులకు అవగాహన కల్పించారు. ఎస్ఐ సీహెచ్.చిరంజీవి సిబ్బందితో గస్తీ నిర్వహించారు. -
ఆదిత్యుని దర్శనం అద్భుతం
● రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అరసవల్లి: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని ఆదివారం దర్శించుకోవడం అద్భుతమ ని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ సుధామూర్తి అన్నారు. ఆమె ఆదివారం అరసవల్లి సూర్యనారయణ స్వామిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ దంపతులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ గౌరవ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు చేయించారు. అంతరాలయం నుంచే ఆమె ప్రత్యేకంగా లక్ష ఒత్తులను వెలిగించి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదాశ్వీచనాన్ని, తీర్థప్రసాదాలను శంకరశర్మ ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో మాస్టర్ ప్లాన్ అమలుకు చేపడుతున్న చర్యల ను, దాతల సహాయాలను కోరుతున్నట్లుగా ఆల య ఈఓ ప్రసాద్ ఆమెకు వివరించారు. తాను అరసవల్లి ఆలయానికి రావడం ఇది రెండోసారి అని, ఆలయ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా చర్య లు చేపడతానన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి మల్లికార్జునరావు కుమార్తె బి.రమాదేవి, బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు తదితరులున్నారు. డీఎస్పీ వివేకానంద, వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేయించుకున్నారు. అనంత రం ఆమె శ్రీకూర్మంలోని కూర్మనాథుడిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలు చేశారు. -
సిక్కోలు మాస్టర్స్ అథ్లెట్స్ హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మా మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పతకాలతో సత్తాచాటారు. బాపట్ల వేదికగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు 7వ ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి తొమ్మిది మంది వెటరన్ అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించగా 24 పతకాలు సాధించారు. వీటిలో ఐదు బంగారు, తొమ్మిది రజత, పది కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిలో జి.అర్జున్‌రావురెడ్డి (మూడు పతకాలు), జేవీఎస్ జగన్నాథం (మూడు పతకాలు), ఎం.గోవిందరావు (నాలుగు పతకాలు), పి.రామచంద్రరావు (మూడు పతకాలు), బి.జానకిరావు (కాంస్యం), కె.సింహాచలం (కాంస్యం), జి.హైమావతి (మూడు పతకాలు), ఎస్.రమాదేవి (మూడు పతకాలు), ఎ.వాణి (మూడు పతకాలు) ఉన్నారు. క్రీడాకారులు పతకాలు సాధించడం పట్ల శ్రీకాకుళం మా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆదివారం అభినందించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎండీ కాసంఖాన్, కళావతి, ప్రధాన కార్యదర్శి గాలి అర్జున్రావరెడ్డి మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు. ● 24 పతకాలతో సత్తాచాటిన క్రీడాకారులు ● అభినందించిన సంఘ ప్రతినిధులు -
కిటకిటలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రయాణికులతో కిటకిటలాడింది. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలిరావడంతో రద్దీమయంగా కనిపించింది. తిరుగు ప్రయాణం కోసం కాంప్లెక్స్‌కు వచ్చిన వారంతా బస్సుల కోసం వేచి ఉండక తప్పలేదు. సకాలంలో బస్సుల రాకపోకలు జరగకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నారు. ఉచిత ప్రయాణం ఎవరు ఇవ్వమన్నారని, ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు బస్సులు నడపకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు మహిళా ప్రయాణికులు కూటమి ప్రభుత్వానికి తిట్టుకోవడం గమనార్హం. బస్సులు వచ్చిన వెంటనే ప్రయాణికులు ఒకరినొకరు నెట్టుకుంటూ సీట్ల కోసం ఎగబడ్డారు. -
సున్నావడ్డీ గుర్తుందా..?
శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ మాట మర్చిపోయినట్టుంది. ఎన్నికల సమయంలో మహిళలకు ఆర్థిక భరోసాగా ఏటా రూ.20వేలు ఇస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ ఊసే లేదు. 50 ఏళ్లకే పింఛన్ అన్న హామీకి ఎప్పు డో పాతరేశారు. జిల్లాలో వేలాది మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి తోడు మహిళ స్వయం శక్తి సంఘాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం రిక్త హస్తాలను చూపుతోంది. ఇప్పటికి రెండేళ్లుగా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీని విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆ ఆలోచనే చేయలేదు. దీంతో డ్వాక్రా మహిళలు వడ్డీ భారం మోయలేకపోతున్నారు. రెండు విడతల బకాయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు గాను రెండు విడతల్లో సున్నా వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం పేదలకు, మ హిళలకు ఏ ప్రయోజనం చేకూర్చడం లేదు. సూపర్ సిక్స్ విజయవంతం అంటూ బాకాలు ఊదుకోవడం తప్ప జనాలకు ఒరిగిందేమీ లేదు. 2023– 24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 29,544 సంఘాలకు గాను రూ.2,200.26 కోట్ల రుణా లను బ్యాంకు ద్వారా అందించారు. వీటికి గాను సున్నావడ్డీ రాయితీ రూ.52.34 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 19,307 సంఘాలకు గాను రూ.1528.38 కోట్ల రుణాలు అందజేశారు. వీటికి గాను రూ.39. 25 లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అసలు వీటి జోలికే వెళ్లడం లేదు. దీంతో సంఘాలు ఆర్థిక భారంతో కునారిల్లుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో.. 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అక్కా చెల్లెమ్మలు పడుతున్న కష్టాలను తెలుసుకొని మహిళా స్వయం శక్తి సంఘాల బ్యాంకు ద్వారా పొందిన రుణాలపై వడ్డీ తిరిగి చెల్లిస్తామని మాటిచ్చారు. అది తూచా తప్పకుండా పాటించారు. వరుసగా నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు వారు చెల్లించిన వడ్డీని తిరిగి వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి మాట నిలబెట్టుకున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న 40,595 స్వయం సహాయక సంఘాలలో 4,57,913 మంది సభ్యులకు తొలి ఏడాది రూ.36.29 కోట్లు, రెండో ఏడాది రూ.35.65 కోట్లు, మూడో విడతలో రూ.39.30 కోట్లు, నాలుగో విడతలో రూ.49.30 కోట్లు సున్నావడ్డీ రాయితీని అందజేశారు. సున్నావడ్డీ మాటే మర్చిపోయిన చంద్రబాబు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏటా మహిళా సంఘాలకు వడ్డీ జమ వడ్డీ భారం మోయలేక సతమతమవుతున్న మహిళలు -
ముహూర్తాలకు విరామం
● ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి ● వివాహ అనుబంధ రంగాలపై ఆర్థిక ప్రభావం మౌఢ్యమిలో శుభ కార్యాలు వద్దు ఏ శుభకార్యం తలపెట్టినా గురు, శుక్ర గ్రహాలు బలంగా ఉండాలి. సూర్యుడి స్థానాలను బట్టి గురు, శుక్ర మూఢాలు ఉంటాయి. ఫిబ్రవరి 17 వరకు అంటే దాదాపు మూడు నెలలు పాటు ముహూర్తాలు ఉండవు. – నారాయణపాడి, పురోహితుడు, ఇచ్ఛాపురం మండలం ఇచ్ఛాపురం రూరల్: శుభ కార్యాలకు దాదాపు మూడు మాసాలు విరామం వచ్చింది. నవంబర్ 27 నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యం వల్ల పెళ్లిళ్లు తదితర శుభ కార్యాలకు విరామం ఏర్పడుతోంది. మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుభకార్యాలు అధికంగా జరుగుతాయి. ఈ సారి మార్గశిరంలో ఒకటి రెండు ముహూర్తాలు ఉండగా, పుష్య మాసం శూన్యమాసం కావడంతో మాఘంలోనూ ఒక్క ముహూర్తం లేకపోవడం గమనార్హం. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, సరస్వతి జన్మదినమైన వసంత పంచమి, మహామాఘగా పిలిచే మాఘ పౌర్ణమి వంటి తిథులు ఈ సారి మూఢంతో కలిసిపోయాయి. వివాహ అనుబంధ రంగాలపై ప్రభావం శుభ కార్యాలు లేకపోతే దానికి అనుబంధంగా ఉండే అనేక రంగాలు కుదేలవుతాయి. వివాహ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు దుకాణాలు, స్వర్ణకారులు, క్యాటరింగ్, ఫొటో వీడి యో గ్రాఫర్లు, పూల దుకాణాలు, లైటింగ్, డీజేలు, అద్దె వాహనాలు, బాజాభజంత్రీలు ఇలా వివాహ అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వందలాది కుటుంబాలు నెలలు కొద్దీ నష్టపోవాల్సి వస్తోంది. ఇక పౌరోహిత్యమే తమ జీవనోపాధిగా ఉన్న బ్రాహ్మణులు ఈ మూడు నెలలు కాలం గడ్డు పరిస్థితులు అనుభవించాల్సి వస్తోంది. -
గురుభక్తిని చాటుకున్న శిష్యుడు
ఎచ్చెర్ల: తనకు డిగ్రీలో ఫిలాసపీ పాఠాలు బోధించిన గురువును గుర్తుంచుకున్న శిష్యుడు తాను రచించిన పుస్తకాన్ని గురువుకు అంకితమిచ్చారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న చీపురుపల్లి మండలం వంగపల్లిపేటకు చెందిన డాక్టర్ కె.హరీష్కిషన్ తాను రాసిన ‘పోర్ట్రయల్ ఆఫ్ విమెన్ ఇన్ ఠాగూర్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని తన గురువు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిలాసపీ డిఫార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.వి.రాజుకు గరివిడిలోని ఆయన నివాసంలో ఆదివారం అంకితం జేశారు. ఈ సందర్భంగా హరీష్కిషన్ మాట్లాడుతూ తనతో పాటు వేలాది మందికి ఉన్నత చదువులకు ప్రేరణ ఇచ్చారని, పరిశోధనకు మార్గదర్శకులుగా వ్యవహరించారని పేర్కొన్నారు. వరి కుప్ప దగ్ధంపై ఆరా మెళియాపుట్టి : గిరిశిఖర గ్రామమైన కేరాసింగిలో చీడిగుడ్డి గవిరేసు అనే రైతుకు సంబంధించి రెండెకరాల వరికుప్ప కాలిపోయిన ఘటనపై మెళియాపుట్టి ఎస్సై రమేష్‌బాబు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైతుతో మాట్లాడి వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గిరిజన గ్రామాల్లో ప్రజలు కలసిమెలిసి ఉంటారని, ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని అన్నారు. పంట చేతికొచ్చిన సమయంలో ఇటువంటివి జరిగితే రైతుకు శోకం మిగులుతుందన్నారు. ఇంటర్‌విద్య ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిలా అధ్యక్షుడిగా జొన్న పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గురుగుబెల్లి రేవంత్‌కుమార్, కోశాధికారిగా పొన్నాడ వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా కె.నరేష్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎస్.మధుబాబు, మహిళా కార్యదర్శిగా కె.యశోద, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.రాజశేఖర్, కార్యవర్గ సభ్యులగా బి.ప్రశాంత్, కె.మనోజ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పారావు, కమలాకర్, ఏపీ ఎన్జీవో సంఘం శ్రీకాకుళం నగర అధ్యక్షుడు బొత్స శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, పొందూరు తాలూకా సెక్రటరీ నర్సునాయుడు తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవితం సార్థకం శ్రీకాకుళం కల్చరల్ : మనిషి మనుగడకు భగవద్గీత ఎంతో ఉపకరిస్తుందని విశ్రాంత ఉపాధ్యాయుడు తుమరాడ జగన్నాథశాస్త్రి అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరంలో మానవ జీవితంలో భగవద్గీత అనే అంశంపై ఆదివారం ప్రవచనాలు చెప్పారు. భగవద్గీతలో కర్మ, భక్తి, మోక్ష యోగాల ఆవశ్యకతను వివరించారు. ప్రతి శ్లోకంలో ఐహిక జీవనానికి సంబంధం, సమస్య, సమాధానం తెలిపారు. జ్ఞానోపదేశం, శ్రవణ, మనన వినియోగం వల్ల జీవితం ఏ విధంగా సార్ధకమవుతుందో వివరించారు. అనంతరం వక్తను మందిర సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ నారాయణమూర్తి, డాక్టర్ కోమలరావు, నరసింహమూర్తి, విశ్వేశ్వరరావు, ఈశ్వరరావు, బాబూరావు, పట్నాయక్, వెంకటరావు, వెంకటరమణ, సూరిబాబు, పద్మావతి, సరస్వతి, అరుణ పాల్గొన్నారు. విద్యార్థిని మృతితో విషాదం శ్రీకాకుళం రూరల్ : సింగుపురం గ్రామానికి చెందిన కొత్తకోట లాస్యశ్రీ (14) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఈమె కొన్ని నెలలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూరగాయలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పోర్టు వాహనాల అడ్డగింత
టెక్కలి: టెక్కలి మండలం కె.కొత్తూరు గ్రామంలో ఆదివారం రాత్రి పోర్టు వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. కోటబొమ్మాళి నుంచి జాతీయ రహదారి మీదుగా కె.కొత్తూరు గ్రామాల మీదుగా మూలపేట పోర్టుకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. టెక్కలి శివారు ప్రాంతంలో ఉన్న పోర్టు రోడ్డు గుండా వాహనాలను తీసుకువెళ్లకుండా తమ గ్రామాల మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో అంతా భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు నిలదీశారు. భారీ లోడులతో వెళ్తున్న వాహనాల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఇకపై తమ గ్రామం మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. సాఫ్ట్‌బాల్ రాష్ట్రపోటీల్లో సిక్కోలుకు తృతీయం శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో శ్రీకాకుళం బాలురు జట్టు తృతీయస్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీహెచ్‌స్కూల్ వేదికగా ఈనెల 12 నుంచి 14 వ తేదీ వరకు రాష్ట్రపోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తృటిలో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయిన శ్రీకాకుళం బాలురు జట్టు తృతీయ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. జిల్లా జట్టు రాణింపుపై డీఈఓ ఎ.రవిబాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ నాయకులు కె.రవికుమార్, ఎస్.శ్రీనివాసరావు, ఎంవీ రమణ, ఎం.తిరుపతిరావు, ఆనంద్‌కిరణ్, ఢిల్లేశ్వరరావు, మల్లేష్, హరికృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ కళాశాలలో ఇంటర్ కాలేజ్ మీట్ క్రీడలు ఎచ్చెర్ల: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ మీట్ క్రీడలను ఎస్ఎస్ఆర్ పురం గ్రామలో ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు వ్యవసాయ కళాశాలలో ఆదివారం కొనసాగించారు. జావెలిన్‌త్రో క్రీడలో ఎస్కేవైసీఎస్ వ్యవసాయ కళాశాల విద్యార్థి కిరణ్‌నాయక్ గోల్డ్ సాధించగా, వెండి పతకం బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి పి.నిఖిల్, రజత పతకం రా మానుజులు నాయక్‌లు సాధించారు. రిలే రన్నింగ్ 400/100 మీటర్లులో నైరా వ్యవసా య కళాశాలకు స్వర్ణం, ఎచ్చెర్ల వ్యవసా య కళాశాలకు వెండిపతకం, మహానంది వ్యవసా య కళాశాలకు రజతం లభించాయి. ట్రిపుల్ జంప్‌లో బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థి బి.చంద్రశేఖర్ స్వర్ణపతకం సాధించగా ఎస్వీ సీ తిరుపతి వ్యవసాయ కళాశాల విద్యార్థి నిర్మ ల్ వెండి పతకాన్ని, ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థి వి.లక్ష్మణ్ రజత పతకాలను సాధించారు. 200 మీటర్లు రన్నింగ్ విభాగంలో ఎస్వీసీ తిరుపతి వ్యవసాయ కళాశాల విద్యార్థి అక్షయ్‌కుమార్ స్వర్ణం సాధించాడు. నైరా వ్యవ సాయ కళాశాల విద్యార్థి భానుప్రకాశ్ వెండి పతకాన్ని సాధించగా ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థి వైకుంఠలక్ష్మణ్ రజతం దక్కించుకున్నాడు. విజేతలకు ఎస్కేవై వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎల్.నారంనాయుడు అభినందనలు తెలిపారు. -
ధనుర్మాసపు వేకువన.. దైవనామ సంకీర్తన
కొత్తూరు: ధనుర్మాసం సందర్భంగా ఏటా కొత్తూరులో నిర్వహించే హరేరామ నగర సంకీర్తనకు 45 ఏళ్లు పూర్తయ్యాయి. లోక కల్యాణార్ధం కొత్తూరుకు చెందిన వైశ్యరాజు శ్రీరామరాజు 1980లో తన ఇంటి నుంచి హరేరామ నగర సంకీర్తన ప్రారంభించారు. గ్రామంలో వేకువజామున హరేరామ నగ ర సంకీర్తన చేసుకుంటూ గ్రామంలోని సీతారామ మందిరం వద్దకు చేరుకొని ఆలయంలో కూడా భజన చేసేవారు. కొంతకాలానికి ఆయనతో మరికొందరు జత కలిశారు. ఇలా 45 ఏళ్లుగా ఊరిలో హరేరామ నగర సంకీర్తనను చేస్తున్నారు. ప్రస్తుతం నగర సంకీర్తనలో సుమారు 20 మంది పాల్గొంటున్నారు. తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లతో పాటు కరోనాలో కూడా నగర సంకీర్తన ఆపలేదు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సంతకవిటికి చెందిన యాలాల శ్రీనివాసరావు ప్రవచనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండడంతో పాటు లోకకల్యాణార్థం ఈ సంకీర్తనలు నిర్వహించనున్నట్లు నిర్వాహుకులు లోతుగెడ్డ భగవాన్‌దాసు నాయుడు, ఎల్.జగ్గునాయుడు, కె.ఆనందరావు, ఎ.ఆదినారాయణ, వైకుంఠరావులతో పాటు పలువురు సభ్యులు తెలిపారు. -
నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
అరసవల్లి: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు షెడ్యూల్‌ను శనివా రం వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ చేపట్టనున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు జూనియర్స్ కేటగిరిలో, 9, 10 తరగతుల విద్యార్థులకు సీనియర్ కేటగిరిలో చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ పోటీలుంటాయని వివరించారు. ఆసక్తి గల వారు శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 9440812387, టెక్కలి డివిజన్లో 9440812389, పలాస డివిజన్లో 9440907281 నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు పొదుపు ఆవశ్యకతను వివరించేలా అవగాహన కలిగేలా సిబ్బందితో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. -
గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కంచిలి: ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంతోపాటు 24 కిలోల 700 గ్రాముల గంజాయిని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలోని కంచిలిలో ఎస్ఐ పి.పారినాయుడు, తన సిబ్బంది పట్టుకున్నట్లు సోంపేట సీఐ బి.మంగరాజు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా మోహన గ్రామ సమీపంలోని ఉదయగిరి గ్రామానికి చెందిన ఆర్.రాజు అనే వ్యక్తి వద్ద అదే జిల్లాలోని పనగుడి గ్రామానికి చెందిన మిలన్ మిచెన్ బిరా అనే వ్యక్తి 24 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అనంతరం శుక్రవారం రెండు బ్యాగుల్లో 24 ప్యాకెట్లను సర్ది, ముంబాయికి చెందిన శంకర్‌కి కోణార్క్ ట్రైన్లో వెళ్లి ఇవ్వడానికి తన ద్విచక్ర వాహనంపై వరుసకు పిన్ని అయ్యి దీపా లిమా అనే మహిళతో కలిసి కంచిలి రైల్వేస్టేషన్‌కు బయల్దేరాడు. అయితే అదే సమయంలో కంచిలి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ పి.పారినాయుడు తన సిబ్బందితో సోంపేట రైల్వేస్టేషన్ జంక్షన్లో వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు సీఐ మంగరాజు తెలిపారు. -
ప్రమాదాలకు షార్ట్‌కట్!
శ్రీకాకుళం క్రైమ్ : రెండంటే రెండు నిమిషాలు.. కాస్త ముందుకెళ్లి సరైన దారిలో ప్రయాణం సాగిస్తే ఏ ప్రమా దమూ జరగదు.. ఇంటి దగ్గర మనల్నే నమ్ముకున్న కుటుంబం ఉందని ఆ క్షణాన గుర్తుకొస్తే బతికి బట్ట కట్టినట్లే.. అయితే చాలా మంది ‘మనకేం కాదులే..’ అనే నిర్లక్ష్యంతో దగ్గర దారి(షార్ట్‌కట్ రూట్)లో ప్రయాణిస్తున్నారు. రెప్పపాటులో ప్రమాదానికి గురై విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. పదే పదే అదే నిర్లక్ష్యం.. జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కొందరు వాహనచోదకులు నిర్లక్ష్యం వీడటం లేదు. రహదారి నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఓ వైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా ఏమాత్రం వారిలో బెదురూ, బెణుకూ ఉండటం లేదు. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. సర్వీసు రోడ్లనుంచి హైవే దాటి అవతలి రోడ్డు వైపు దాటేందుకు అనధికార షార్ట్‌కట్ యూటర్న్‌లను ఆశ్రయిస్తున్నారు. మారని తీరు పోలీసులు ఎంత నిలువరిస్తున్నా కొందరు భారీ వాహనదారులు అలసత్వం వీడటం లేదు. సర్వీసురోడ్లు, హైవేలపై గంటల తరబడి వాహనాలు నిలిపేస్తున్నారు. ఈ జాఢ్యం హరిశ్చంద్రపురం నుంచి మడపాం వరకు ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మడపాం టోల్‌ప్లాజా వద్ద నేషన ల్ హైవే అథారిటీ అధికారులు అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నవారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. షాపుల ముందే కాంక్రీట్ దిమ్మలు, తారుతో ఉన్న మెటల్, చిప్స్ కుప్పలు వరుసగా వేసేశారు. అయినప్పటికీ భారీ వాహనదారులు గంటల తరబడి రోడ్డు మధ్యలోనే వాహనాలు నిలిపివేస్తున్నారు. -
రోడ్ల పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్డాండ్ : సంక్రాంతి పండగ నాటికి జిల్లాలోని రహదారులన్నింటినీ గుంతలు లేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి శ్రీకాకుళం ఆర్అండ్బీ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.82 కోట్ల విలువైన 28 పనులు మంజూరయ్యాయని, నాణ్యతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నాణ్యతను పరిశీలించిన తర్వాతే ప్రతినెలా బిల్లులు మంజూరు చేస్తామన్నారు. ముఖ్యంగా నీరు నిలిచే సమస్య ఉన్న రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన ఆ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రేపే కోటి సంతకాల ర్యాలీ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అంచనాలకు మించి స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులు ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రం నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నాయని, ఈ నెల 15న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు టౌన్హాలులోని పార్టీ నగర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం టౌన్‌హాల్ వద్దకు జిల్లాలోని పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు 40 ఏళ్ల అనుభవంలో ఒక్క మెడికల్కాలేజీౖకైనా శ్రీకారం చుట్టారా? అని రవిబా బు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటుపరం చేయాలనే చూస్తుంటారని, ఇప్పటికి 53 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారన్నారు. పేదల ఆరోగ్యమన్నా.. పేదోడికి వైద్యమన్నా చంద్రబాబుకు ఎందుకంత నిర్లక్ష్యమో అర్ధం కావడం లేదన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీ కరణ చేసి రెండేళ్లపాటు జీతభత్యాలు ఇస్తామనడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఆదాయం ప్రైవేటుకు, ఖర్చులు ప్రభుత్వానికా అని ప్రశ్నించారు. ఏడాదిన్నర పాలనలో రూ.2.66లక్షల కోట్లు అప్పు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి రాజధానికిరూ. లక్ష కోట్లు ఖర్చుచేయడం అవసరమా అని ప్రశ్నించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేఖిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తిచేసేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 15న ఉదయం 10గంటలకు శ్రీకాకుళం నగరంలో టౌన్‌హాల్ వద్ద నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 18న కోటి సంతకాల ప్రతులతో గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, కార్యవర్గ సభ్యులు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు చింతాడ వరుణ్, సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకుడు కరిమి రాజేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, బీసీ విభాగం నగర అధ్యక్షుడు గద్దిబోయిన కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ లే అవుట్లు..!
పుట్టగొడుగుల్లా.. ● నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ● చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ప్లాట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్ల పక్క న ప్రభుత్వ భూములు, చెరువులు, వరద కాలువలు ఉన్నా వాటిని సైతం అందులో కలిపేస్తున్నారు. ఈవిధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. మున్సిపాలిటీలో ఇటువంటి అక్రమ లే అవుట్లు సుమారు 22 ఉన్నాయి. ఇందులో అత్యధిక శా తం టీడీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ లో కీలక స్థానాల్లో ఉన్నవారివేనని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని అధికారులు పలాస పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఉదయపురం రెవెన్యూలోని సర్వే నంబరు 221/13లో ఇటీవల వేసిన సీతమ్మ గుడి వద్ద లే అవుట్ స్థానికంగా వివాదాస్పదమైనా అధికారు లు స్పందించ లేదు. వ్యక్తుల సదుపాయం కోసం కూర్చోడానికి వేసిన చిన్న చిన్న బల్లలను సైతం తొలగించడంతో ఆ బల్లలు వేసిన తాళాసు మన్మథరావు, అదే ప్రాంతానికి చెందిన నౌగాపు మల్లి, స్థానిక ప్రజలు అడ్డుకున్నప్పటికీ ఆగలేదని, అంతేకాకుండా ఆ పక్కన ఎప్పుటినుంచో ఉన్న వంశధార కాలువ గట్టును లే అవు ట్ వేసిన వ్యక్తి రోడ్డులో కలిపేశాడని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే కాశీబుగ్గ సూదికొండ పక్కన ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయం పక్కన సుమారు 4 ఎకరాల వరకు కబ్జా జరిగిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం పేదలు నిర్మించిన ఇళ్లను సైతం కూల్చేశారు. అలాగే 200 పడకల కిడ్నీ ఆస్పత్రి పక్కన సర్వే నంబరు 253లో 300 మూరల భూమిని దోపిడీ కాజేశారు. పద్మనాభపురం శనీశ్వరుడి మెట్ట ప్రాంతంలో రెండెకరాలు భూమిని టీడీపీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ ఆక్రమించుకొని చదును చేసుకున్నాడు. ఈవిధంగా ఒకపక్క అక్రమ లేఅవుట్లు.. మరో పక్క భూకబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా తాను కొత్తగా వచ్చానని.. మొత్తం లే అవుట్లు 22 ఉన్నమాట వాస్తవమేనన్నారు. వీటి వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. -
ఆరామ ద్రావిడ సంఘం ఆత్మీయ కలయిక
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆరావ ద్రావిడ బ్రాహ్మణ సంఘం సభ్యులు 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా ఆఫీసు వద్ద శనివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక సాంప్రదాయాలతో, సనాతన సంస్కృతి వైభవాలతో, సమాజ హితాన్ని కాంక్షిస్తూ అందరూ మార్గదర్శకంగా ఉండాలని సమావేశానికి అధ్యక్షత వహించిన అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర అధ్యక్షుడు ఇప్పిలి శంకర్ శర్మ పిలుపునిచ్చారు. చిన్నారులకు ఆటల పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బంకుపల్లి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కచేరి కార్యక్ర మం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, సంఘం గౌరవ అధ్యక్షుడు వేమ కోటి సూర్యనారాయణ శర్మ, అంపోలు రుద్రకోటి శర్మ, వేమకోటి నరహరశాస్త్రి, అమ్ములు ఉమామహేశ్వర శర్మ, భాస్కరభట్ల శ్రీరామశర్మ, పెంటా శ్రీనివాస్ శర్మ, ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి, బంకుపల్లి సత్యనారాయణ శర్మ, రేజేటి వెంకటరమణ, సత్య ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆరామ ద్రావిడ సంఘం నూతన కార్యవర్గాన్ని రేజేటి రామాచార్యులు, వేమకోటి నరహరి శాస్త్రి, వేమకోటి సూర్యనారాయణ శర్మల అధ్యక్షతన చేపట్టారు. దీనిలో భాగంగా కేంద్ర అధ్యక్షుడిగా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యదర్శిగా జోస్యుల శివప్రసాద్‌శర్మ, కోశాధికారిగా ధర్మపురి గౌరీశంకరశాస్త్రి, శ్రీకాకుళం అధ్యక్షుడిగా సుసరాపు గణపతి శర్మ, కార్యదర్శిగా దార్లపూడి రవి ప్రతాప్శర్మ, కోశాధికారిగా లక్ష్మీధనుంజయశర్మ, విజయనగరం అధ్యక్షుడిగా అంపోలు ఉమామహేశ్వరశర్మ, కార్యదర్శిగా పులఖండం కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కామ్రేడ్ కొండయ్య ఆశయ సాధనకు కృషిచేద్దాం
ఆమదాలవలస: సీఐటీయూ జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ మెట్ట కొండయ్య ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో కొండయ్య స్వగృహం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. 1970వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో ఆమదాలవలస చక్కెర కర్మాగారంలో దివంగత చాపర అప్పారావు, దిగుమర్తి విశ్వనాథం, మెట్ట కొండయ్య సీఐటీయూ యూనియన్ను ఏర్పాటు చేశారన్నారు. సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని 56 రోజులపాటు నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా సమ్మె పోరాటాలు చేసి విజయవంతం చేశారని కొనియాడారు. సమ్మె కాలంలో కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, తన భార్య వద్ద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి కార్మిక కుటుంబాలకు సహాయం చేసిన గొప్ప మానవతావాది అని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీ, కామ్రేడ్ కొండయ్య కుటుంబ సభ్యులు, సీఐటీయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్, భవిరి కృష్ణమూర్తి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీనియర్ జర్నలిస్ట్ సువ్వారి మురళీధర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పంచాది లతాదేవి, జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి జనార్ధనరావు, ప్రజా సంఘాల నాయకుడు బొడ్డేపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా బెల్లం ఊటలు ధ్వంసం
సోంపేట: ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో శనివారం దాడులు నిర్వహించి 10 వేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ తెలిపారు. ఒడిశా పోలీసులతో కలిసి ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లోని నాటుసారా తయారు చేసే గ్రామాల్లో శ్రీకాకుళం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామచంద్రకుమార్, ఎన్పోర్స్మెంట్ సూపరింటెండెంట్లు మురళీధర్, శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేపట్టారు. గంజాం జిల్లాలోని గంగాపూర్ గ్రామంలో 4,500 లీటర్ల బెల్లం ఊటలు, రాంచంద్రాపూర్ గ్రామంలో 5,500 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి తిరుప్పావై ప్రవచనాలు
గార: శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంలో ఈ నెల 16 నుంచి తిరుప్పావై ప్రవచనా లు ప్రారంభమవుతా యని స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభా చార్యులు శనివారం తెలిపారు. తిరుమల తిరు పతి దేవస్థానాలు ఆధ్వర్యంలో దేశమంతటా 240 దేవాలయాల్లో, మన జిల్లాలో శ్రీకూర్మనాథాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీకాకుళం కోదండ రామాలయాల్లో ప్రవచనాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16న నెల గంట కార్యక్రమంతో పాటు, తిరుప్పావై ప్రత్యేక పూజలుంటాయని తెలిపారు. జనవరి 14 వరకు ప్రతిరోజు సాయంత్రం బేడా మంటపంలో ప్రవచనాలు జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొనాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 6508 కేసులను రాజీ చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా వెల్లడించారు. ఇందులో సివిల్ కేసులు 202, క్రిమినల్ కేసులు 6253, ప్రీ లిటిగేషన్ కేసులు 53 రాజీ అయ్యా యని వివరించారు. వీటితో పాటు హెచ్ఎంపీవో కేసులలో భార్యాభర్తలు తిరిగి కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ చెస్ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీకాకుళంలో ప్రొఫెషనల్ చెస్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఫిడే ఇన్స్ట్రక్టర్, చీఫ్ కోచ్ ఎం.రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం కొత్త రోడ్డులోని సీఎస్ఎన్ ట్రస్ట్ కార్యాలయంలోని చెస్ శిక్షణ కేంద్రంలో శిబిరం ప్రారంభించారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ చెస్ ఇన్ స్కూల్ ట్రైనర్ సనపల భీమారావు మెంటర్‌గా వ్యవహరిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం ప్రతి శని, ఆదివారాల్లో రోజుకు 8 గంటల చొప్పున కొనసాగుతుందని వివరించారు. తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పదిమంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి 28వ వరకు విశాఖపట్నంలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో గెలుపే లక్ష్యంగా తర్ఫీదు అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బగాది కిషోర్, జామి రమేష్, సంయుక్త కార్యదర్శి వై.ఎస్.వి.కుమార్, అసోసియేషన్ సభ్యులు అభినవ్, వసంతరావు, ఆర్బిటర్ సైదా బేగం తదితరులు పాల్గొన్నారు. కవిటి: మండలంలో కవిటి – గొండ్యాలపుట్టుగ రోడ్డు మార్గంలోని కొబ్బరితోటల పొదల్లో శనివారం ఉదయం నవజాత మగ శిశువు మృతదేహం కనిపించింది. వేకువజామున వాకింగ్‌కు వెళ్లే పాదచారులు గుర్తించి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్ఐ వి.రవివర్మ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. రిమ్స్‌లో హౌస్ సర్జన్ నిర్వాకం ఓ పాజిటివ్ రక్తం ఎక్కించిన వైనం శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలలో శనివారం ఫిమేల్ వార్డులో ఓ రోగికి హౌస్సర్జన్లు బీ పాజిటివ్ రక్తానికి బదులుగా ఓ పాజిటివ్ రక్తం ఎక్కించడం వివాదాస్పదమైంది. శ్రీకాకుళం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన అదపాక అలివేలు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో రిమ్స్‌లో చేరింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. శనివారం రోగి బంధువులు మూ డో యూనిట్ రక్తాన్ని తీసుకొచ్చారు. దీనిని ఎక్కిస్తున్న 5నిమిషాల్లోనే రోగి శరీరంలో తేడా లు కనిపించడంతో రక్తాన్ని పరిశీలించగా వేరొ క రోగి కోసం తీసుకొచ్చిన ఓ పాజిటివ్ రక్తాన్ని అలివేలు ఎక్కిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే దానిని తొలగించారు. రోగిని వేరొక వార్డుకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నా రు. రోగి బంధువులు అలివేలు ఆరోగ్య పరిస్థితి విష మంగా ఉండడంతోనే వేరొక వార్డుకు తరలించారని ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్, ఆర్ఎంఓ సుభాషిణిలు రోగిని పరిశీలించి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వేరొక వార్డుకు తరలించామని, కంగారుపడా ల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఘటనపై ఆదివారం విచారణ జరిపిస్తామన్నారు. -
సిక్కోలుకు మీరు చేసింది సున్నా!
● మాయ మాటలు తప్ప మంచి ఏముంది? ● విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ‘ప్రజలు మీకు 50 ఏళ్ల అధికారం ఇచ్చారా..! ఐదేళ్లే కదా అధికారం ఇస్తారు.. తాజా పదవీకాలంలో అప్పుడే ఏడాదిన్నర కాలం పూర్తయింది. మీ ఇంట్రస్టులు మీకున్నాయి తప్ప ఏ ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదు.. శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో చెప్పాలి’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం చంద్ర బాబును సూటిగా ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పనులు కనీసం మొదలుపెట్టగలిగారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులు.. ప్రజలకు తిప్పలు.. ఏడాదిన్నరలో రూ.2.65 లక్షల కోట్లు అప్పు చేశారని ధర్మాన ధ్వజమెత్తారు. ప్రతి ఏటా రూ.2లక్షల కోట్లు బడ్జెట్ ప్రొవిజన్ ఉందని, అంటే రెండేళ్లలో రూ.4 లక్షల కోట్లు, అప్పు చేసిన రూ.2.65 లక్షల కోట్లు కలిసి మొత్తం రూ.6.65 లక్షల కోట్లలో శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన కేపిటల్ ఇన్వెస్ట్మెంట్ కనీసం రూ.500 కోట్లు చూపించగలరా? అని ప్రశ్నించారు. ఆమదాలవలస రోడ్డు ఆగిపోయిందని విమర్శలు చేశారే తప్ప రూ.40 కోట్లు ఇవ్వలేకపోయారన్నారు. ఎల్లోమీడియాలో ఎన్నో వార్తలు రాసినా కనీసం పేమెంట్ ఇవ్వలేకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు గార బ్రిడ్జి పూర్తి కాలేదని, సమీకృత కలెక్టరేట్ పూర్తి కాలేదని మండిపడ్డారు. ఒక్క నిర్మాణమైనా ప్రారంభించి పూర్తి చేయగలిగారా? అని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పడం మినహా సంస్కరణలు మీకు చేతగాదన్నారు. భూసర్వే వల్ల గ్రామాల్లో వివాదాలతో చితికిపోతున్న అనేక కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. జగన్ అధికారంలో ఉంటే సర్వే పూర్తయ్యేదన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పెడితే ఆ భూమి తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఓట్లు సంపాదించుకున్నారే తప్ప ఒకరి భూమి మరొకరు తీసుకోవడం రాష్ట్రపతికి గానీ, గవర్నర్‌కు గానీ ఉండదన్నారు. భారత రాజ్యాంగంలో ఆ అవకాశమే లేదని స్పష్టం చేశారు. కామెంట్ బాక్స్పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. 2020లో జగన్మోహన్రెడ్డితో కలిసి తాను తీసుకొచ్చిన భూసంస్కరణల వల్లే పేదలకు మేలు జరిగింది. రాష్ట్రంలో 1977 తర్వాత రైతులకు మేలు జరిగింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే. ఉద్యోగులతో తప్పుడు పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే.. వారంతా మూకుమ్మడి సెలవుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో రూ.12వేల కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చారు. ఆ పట్టాల్ని సైతం ఎలా అమ్ముకోవాలో అన్న ఆలోచన తప్ప పేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఏ ఒక్క కూటమి నాయకులకూ లేదు. బ్రిటీషర్లు వెళ్లిన తర్వాత కాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసర్వే చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాత రెవెన్యూశాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించడం దారుణం. 18 నెలల పాలనలో పేదల కోసం కనీసం ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేని దుస్థితి చంద్రబాబు ప్రభుత్వానిది. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఏ కార్యాలయానికి వెళ్లినా.. మీ ఎమ్మెల్యేకు చెప్పారా? లేదా? అక్కడ డబ్బులిచ్చుకుని రా.. అన్న పరిస్థితి ఏర్పడింది. -
ధాన్యం బస్తాలు దగ్ధం
టెక్కలి రూరల్: మండలంలోని బొరిగిపేట గ్రామం నుంచి మేఘవరం వైపు వెళ్లే మార్గంలో పొలంలో ఉంచిన చింతాడ బుడ్డు అనే రైతుకు సంబంధించిన ధాన్యం బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చినట్లు స్థానికులు తెలిపారు. పొలంలోని ధాన్యం బస్తాల్లో ఎక్కించి సుమారు 15 బస్తాల ధాన్యం పొలంలో ఉంచగా.. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి సమీపంలో ఉన్న గడ్డిని కాల్చడంతో ధాన్యం బస్తాలకు సైతం మంట అంటుకుంది. ఇది గుర్తించి స్థానికులు హుటాహూటిన మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే నాలుగు ధాన్యం బస్తాలు కాలిపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సంతబొమ్మాళి: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నౌపడ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పరపటి హరిణి ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం భాను ప్రకాష్ తెలిపారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో జరిగిన 51వ రాష్ట్రస్థాయి జూనియర్ అండర్– 20 బాలబాలికల కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం బాలికల జట్టు ద్వితీయ స్థానాన్ని, బాలుర జట్టు తృతీయ స్థానం కై వనం చేసుకున్నారు. బాలికల జట్టు విజయం సాధించడంలో నౌపడ విద్యార్థినులు కీలక పాత్రపోషించారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పరపటి హరినిని జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. ఎంపికపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
చోరీ కేసులో ముద్దాయికి జైలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ద్విచక్ర వాహనం చోరీ చేసిన కేసులో పట్టుబడిన ముద్దాయి గొల్లకంచిలి గ్రామానికి చెందిన డొక్కరి రవికి 8 నెలల జైలు శిక్షతోపాటు, రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు వచ్చిన ట్లు స్థానిక ఎస్ఐ పి.పారినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట ఏజేఎంఎఫ్‌సీ జడ్జి కేసును విచారించిన తర్వాత ఈ మేర కు తీర్పు వెలువరిచినట్లు తెలిపారు. ఈ కేసు వాదనలో ఏపీపీగా పి.నరేష్, దర్యాప్తు అధికా రిగా తాను వ్యవహించినట్లు పేర్కొన్నారు. సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు గ్రామానికి చెందిన కొమర రాజయ్య (63) అనే మత్య్సకారుడు శనివారం సముద్రంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే రాజయ్య చేపల వేట కోసం సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. సముద్రపు ఒడ్డున ఒక కర్రను పాతి.. దానికి ఒకవైపు వలను కట్టాడు. మిగిలిన వలను కట్టడానికి సముద్రపు లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు. సముద్రపు లోపల వల కడుతున్న సమయంలో పెద్దపెద్ద కెరటాలు రావడంతో ఆ వలలో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయాడు. ఇది చూసిన మత్య్సకారులు రాజయ్యను కాపాడే లోపే మృతి చెందడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నౌపడ ఎస్ఐ జి.నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. టెక్కలి: టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం టెక్కలిలో సుమారు రూ.1.47 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. టెక్కలి గ్రామ పంచాయతీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్‌ను ప్రారంభించారు. అలాగే బాలికల క్రీడా మైదానం, బాలికల పాఠశాలలో వంటశాల, టాయిలెట్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి తదితరులు పాల్గొన్నారు. కోర్టు భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టాలి టెక్కలిలో కోర్టు భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని టెక్కలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంత్రి అచ్చెన్నాయుడుని కోరారు. మంత్రిని కలిసినవారిలో అధ్యక్షుడు పి.అజయ్‌కుమార్, ఏజీపీ డి.వి.వివేకానంద, న్యాయవాదులు పి.బాబురావు, పి.సాయిరాజు, చంద్రశేఖర్ పట్నాయక్, వైకుంఠరావు, పి.ఆనంద్, కె.బాబురావు తదితరులు ఉన్నారు. -
ఆగిన ఆయువు
సొంత వైద్యం వద్దు పాలసింగి గ్రామంలో కిడ్నీ వ్యాధులపై వైద్య శిబిరంలో పాల్గొన్నాను. తాజాగా ఎలాంటి మరణాలు లేవు. అయితే గ్రామాల్లో ఉన్న వారు ప్రతి ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్లను సంప్రదించాకే మందులు వాడాలి. సొంత వైద్యం వద్దు. – శరత్ జ్యోత్స్న, నెఫ్రాలజిస్టు ఎందుకు వచ్చిందో.. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. నాకు కిడ్నీ వ్యాధి సోకి మూడేళ్లు గడిచింది. అస లు ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలీదు. ఊరిలో నీరు తాగడం వల్లే వచ్చిందని అంటున్నారు. – జన్ని వరలక్ష్మి కిడ్నీ వ్యాధి బాధితురాలు, పాలసింగి మితిమీరి మందులు వద్దు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మితిమీరి మందులు వాడకూడదు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ తో పాటు జ్వరం, ఇతర సమస్యలకు అధికంగా మాత్రలను విని యోగిస్తారు. వీటి ప్రభావం కిడ్నీలపై ఉంటుంది. – ఎస్.గాయత్రీ, వైద్యురాలు. మా నాన్న చనిపోయారు మా నాన్న మెండబోయిన అప్పన్న కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ఆయన చాలా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. – జర్జంగి లక్ష్మి, కిట్టాలపాడు, టెక్కలి మండలం కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న పాలసింగి గిరిజన గ్రామంఇప్పటి వరకు కిడ్నీ వ్యాధితో మరణాలు 15 వ్యాధి విస్తరించిన గిరిజన గ్రామాలు: పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి కిడ్నీ వ్యాధి విస్తరిస్తోంది. పచ్చని పల్లెలకు ముచ్చెమటలు పట్టిస్తూ నిశ్శబ్దంగా ఆయువు తినేస్తోంది. దశాబ్దాలుగా ఉద్దానం పల్లెల్లో చావు డప్పు మోగిస్తున్న ఈ మహమ్మారి కన్ను ఇప్పుడు టెక్కలి మండలంపై పడింది. ఎందుకు వ్యాధి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలుసుకునే లోపే ప్రాణాలను హరించేస్తోంది. మండలంలో ఇప్పటికే 15 మంది వరకు వ్యాధి బారిన పడి చనిపోయారు. పదుల సంఖ్యలో బాధితులుగా మారుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న వ్యాధి బారిన పడి పల్లెలు తల్లడిల్లిపోతున్నాయి. టెక్కలి/టెక్కలిరూరల్: టెక్కలి మండలంలోని పలు గ్రామాల్లో కిడ్నీ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి తదితర గ్రామాల్లో కిడ్నీ వ్యాధి విజృంభిస్తోంది. మిగిలిన గ్రామాల్లో కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నా పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి తదితర గ్రామాల్లో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. ఈ గ్రామాల్లో అధిక శాతం మంది వ్యవసాయ కూలీలే. మొన్నటి వరకు కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి గ్రామాల్లో కిడ్నీ వ్యాధి జాడలు కనిపించాయి. తాజాగా పాలసింగి గిరిజన గ్రామంలో వెలుగు చూసిన కిడ్నీ వ్యాధులపై మెడికల్, ఆర్డబ్ల్యూఎస్ ఇతర శాఖల అధికారులు శిబిరాలు నిర్వహించి రక్త పరీక్షలు, నీటి పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయా పరీక్షల్లో ఎక్కడా లోపం లేదని తేలుతున్నా జనం మాత్రం ఈ వ్యాధి బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు వ్యాధి బారిన పడిన వారంతా 35 ఏళ్లు దాటిన వారే. ఈ గ్రామాల్లోనే ఎందుకు..? టెక్కలి నుంచి మెళియాపుట్టి వెళ్లే మార్గంలో సన్యాసినీలాపురం, సవరకిల్లి, కిట్టాలపాడు, పాలసింగి వరుసగా వస్తాయి. ఇదే దారిలో కిడ్నీ వ్యాధులూ విజృంభిస్తున్నాయి. ఈ కోణం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. పాలసింగి, కిట్టాలపాడు, సన్యాసినీలాపురం, సవరకిల్లి గ్రామాల ప్రజలు శుద్ధ జలానికి నోచుకోలేదు. కొందరు బావి నీరు తాగుతుండగా కొందరు బోరు నీటిపై ఆధారపడుతున్నారు. వ్యాధి ప్రబలుతుండడంతో ఈ నీటిని తాగేందుకు భయపడుతున్నారు. కానీ ప్రత్యామ్నాయం అంతగా కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యం. వ్యాధి బారినపడిన వారి వయసు: పదుల సంఖ్యలో బాధితులు పల్లె తల్లడిల్లుతోంది అత్యధికంగా గిరిజనులు జీవనం సాగిస్తున్న ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామంలో సుమారు ఏడుగురు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో చిన్నింటి అప్పలస్వామి, జన్ని మోహన్‌రావు, అనుపురం సుభద్ర, జన్ని వరలక్ష్మి మరో ముగ్గురు టెక్కలి, పలాస, శ్రీకాకుళం ఆస్పత్రులలో వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామంలో మెండబోయిన సోమేష్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సన్యాసినీలాపురం గ్రామంలో బెహరా సోంపమ్మ, జీరు గంగారావు, నౌగాపు లక్ష్మి, జి.లక్ష్మణరావు తో పాటుగా మరో నలుగురు వ్యక్తులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సవరకిల్లి గ్రామంలో జయనవలస తిరుమలరావు ఈ వ్యాధి బారిన పడ్డారు. టెక్కలి మండలాన్ని భయపెడుతున్న కిడ్నీ భూతం పాలసింగి, కిట్టాలపాడు, సవరకిల్లి, సన్యాసినీలాపురం గ్రామాల్లో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధులు ఏ గ్రామంలోనూ కనిపించని శుద్ధజలం సదుపాయం ఏటా పెరుగుతున్న బాధితుల సంఖ్య ప్రభుత్వ చర్యలు శూన్యం ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామానికి చెందిన మల్లిపురం పార్వతి అనే మహిళ రెండేళ్ల కిందట డయాలసిస్ చేయించుకుంటూ మృతి చెందారు. గత ఏడాది జన్ని రత్నాలు అనే మహిళ సైతం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. కిట్టాలపాడు గ్రామంలో మోద లక్ష్మినారాయణ, కుందు అప్పన్న, మోద సవరయ్య, మెండబోయిన అప్పన్న, మెండపోయిన వెంకటరావుతో పాటు సుమారు మరో ఐదుగురు మృత్యవాత పడ్డారు. సన్యాసినీలాపురం గ్రామంలోనూ గురుజు కామరాజు అనే వ్యక్తి ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ వ్యాధితోనే మృతి చెందారు. గురుజు సింహాచలం, రావివలస కాంచన, జీరు కృష్ణారావు, జీరు భాస్కరరావు, జీరు బుడమ్మ, బెవర తవిటయ్య తో పాటు మరి కొంత మంది కూడా మృతి చెందారు. సవరకిల్లి గ్రామంలో ఇటీవల కాలంలో కిల్లి సోమేశ్వరరావు అనే గిరిజనుడు ఈ కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడ్డారు. ఈ గ్రామాలన్నీ ఒకే మార్గంలో ఉండడం గమనార్హం. -
కదం తొక్కిన అంగన్వాడీలు
● కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన అంగన్వాడీ కార్యకర్తలు ● పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట శ్రీకాకుళం పాతబస్టాండ్: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్అండ్బీ బంగ్లా జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ధర్నా సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.కల్యాణి, సుధ పలు డిమాండ్లు వినిపించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, పెరిగిన వేతనాలను ఇవ్వాలని కోరారు. మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ సెంటర్లను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం అంగన్వాడీ సెంటర్లకు నష్టం చేస్తుందని అన్నారు. ఎన్నికల ప్రచారాల్లో టీడీపీ అనేక హామీలు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక ఏమీ చేయడం లేదన్నారు. తోపులాట అంగన్వాడీలంతా కలెక్టర్ కార్యాలయం లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి కార్యకర్తలు కింద పడిపోయారు. అంతలో ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ.విమల వచ్చి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్వీ రమణ, ఆర్.ప్రకాశరావు, బి.మురళి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు -
‘యువత బాధ్యతగా ఉండాలి’
పొందూరు: యువత ప్రవర్తన, చేసే పనులు బాధ్యతాయుతంగా ఉంటే వారి లక్ష్యాన్ని సు లువుగా చేరుకోగలరని సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా విడుదల ప్రమోషన్లో భాగంగా పొందూరులోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. యువతలో క్రమశిక్షణ, పట్టుదల, కృతజ్ఞత, సామాజిక బాధ్యతల భావన, నైతిక విలువలు బలపడాలని అన్నారు. యువత వ్యసనాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, వాటి వైపు మొగ్గు చూపకూడదని చెప్పారు. బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కేసు రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన పిన్నింటి మల్లేశ్వరరావు(64)కు స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ అయిందని డీఎంఓ పీవీ సత్యనారాయణ, లావేరు పీహెచ్సీ వైద్యులు మౌనిక తెలిపారు. అయితే ఆయనలో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. పదిరోజుల కిందట పొలం పనులకు వెళ్లిన మల్లేశ్వరరావుకు పేడ పురుగు కరిచింది. రెండు రోజుల తర్వాత జ్వరం వచ్చింది. ఈ నెల 10న ఆయన 104 సిబ్బందికి చూపించుకున్నారు. లావేరు పీహెచ్‌సీకి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలి సూచించగా అలాగే చేశారు. లావేరు వైద్యులు రక్త నమూనాలను శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్య బృందం ఆయన ఇంటికి వెళ్లగా ఆయన పొలం పనులకు వెళ్లిపోయారు. మళ్లీ వచ్చి పరిశీలించగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా బెజ్జిపురం గ్రామంలో వైద్య శిబిరంతో పాటు, ప్రాంతాలన్నీ బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు వీధుల్లో అవగాహన కల్పించారు. 15న కోటి సంతకాల ప్రజాఉద్యమం ● విజయవంతం చేయాలని కృష్ణదాస్ పిలుపు నరసన్నపేట: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల అభిప్రాయ సేకరణ ప్రజా ఉద్య మం చివరి దశకు చేరిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ నెల 15న కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్‌తో కలసి కృష్ణదాస్ నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సంతకాల ప్రతులు ఇప్పటికే జిల్లా పార్టీ కార్యాలయానికి చేరాయని, 15న ఈ ప్రతులు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని టౌన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతుల వాహనాన్ని జెండా ఊపి తరలిస్తామన్నారు. సమావేశంలో పార్టీ పొందర, కూరాకుల విభాగం అధ్యక్షుడు రాజా పు అప్పన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు సురంగి నర్శింగరావు, ఐటీ విభాగం కార్యదర్శి కల్లి అజయ్, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సతివాడ రామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తాకట్టు చిచ్చు.. అతనే రాజేశాడు
● గార ఎస్బీఐలో బంగారం మాయం కేసుకు సంబంధించి కీలక ఆధారాల సేకరణ ● బాధిత కుటుంబానికి ఎండార్స్మెంట్ ఇచ్చిన పోలీసులు ● ఆర్ఎం పాత్రపై నిజమైన ‘సాక్షి’ కథనాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గార స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో తాకట్టు బంగారం మాయం కేసుకు సంబంధించి మొదటి నుంచి ‘సాక్షి’ పత్రిక రాసిన కథనాలే నిజమయ్యేలా ఉన్నాయి. అందుకు తగ్గట్టు పోలీసులు కీలకమైన ఆధారాలు సేకరించడమే కాకుండా కీలక సూత్రధారిగా అనుమానించిన రీజనల్ మేనేజర్ తోటకూర రమణమూర్తి రాజు, సీనియర్ అసోసియేట్ అండ్ జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం ప్రమేయం బయటపడింది. దీనికి సంబంధించి ఎండార్స్‌మెంట్‌ను బ్యాంకు ఉద్యోగిని ఉరిటి స్వప్నప్రియ కుటుంబానికి డీఎస్పీ సీహెచ్ వివేకానంద గురువారం అందించారు. స్వప్నప్రియ తల్లి ఫిర్యాదుతో అనేక మలుపులు.. తన కుమార్తె స్వప్నప్రియను ఇంతటి భారీ కుంభకోణంలో ముద్దాయిని చేసి అన్యాయంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారంటూ జాతీయ మానవ హక్కుల, మహిళా కమిషన్, ప్రస్తుత హోం మినిస్టర్, సీఎంఓ కార్యాలయాలకు స్వప్నప్రియ తల్లి ఉరిటి సరళాదేవి కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని డీఎస్పీ వివేకానంద కేసు విచారణ చేపట్టారు. ఆధారాలు సేకరించడమే కాకుండా 15 మందికి పైగా అనుమానితులను విచారణ చేస్తున్నారు. రెండో కోణంలో ‘సాక్షి’ కథనాలు... స్వప్నప్రియపైనే నెపం అంతా నెట్టేసి, ఆమెను ప్రధాన నిందితురాలిగా బ్యాంకు ఽఅధికారులు కథ నడిపించారు. ఒక్కరే ఖాతాదారులు తనఖా పెట్టిన రూ.4.7 కోట్ల విలువైన 7.146 కిలోల బంగారాన్ని ప్రైవేటు వ్యక్తులతో కలసి మాయం చేసిందన్నది అంత సులువైన పని కాదని, బ్యాంకు ఉన్నతాధికారులు, ఆడిటర్లు, కీలక సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదని ‘సాక్షి’ బలంగానే నమ్మింది. దీనికి తగ్గట్టుగానే డీఎస్పీ వివేకానంద అనేక కోణాల్లో విచారణ చేశారు. 2022లో స్వప్నప్రియ డిప్యూటీ మేనేజర్‌గా చేరడం, 2023 నవంబరులో తాకట్టు నగలు మాయమైన ఘటన వెలుగులోకి రావడం, నవంబరు 23న క్యాషియర్ ముంజేటి సురేష్‌ను స్వప్నప్రియే దాడి చేయించిందంటూ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫేక్ ఫిర్యాదు చేయడం, వెనువెంటనే ఆమె క్యారెక్టర్ మంచిది కాదంటూ, కుంభకోణంలో ఆమే ప్రధాన పాత్రధారంటూ బ్లాక్‌మెయిలింగ్ కథనాలు రావడం, తట్టుకోలేక నవంబరు 29న ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, వెనువెంటనే చనిపోయిన స్వప్నప్రియే సోదరుడు కిరణ్ సాయంతో అంతా చేసిందంటూ పోలీసులకు నవంబరు 30న రీజనల్ మేనేజర్ తోటకూర రమణమూర్తి రాజు, మేనేజర్ రాధాకృష్ణలు ఫిర్యాదు చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దానికి తగ్గట్టుగానే పోలీసులు డిసెంబరు 8న అసలు నిందితులను వదిలేసి ఏడుగురిని అరెస్టు చేయడం, రికవరీ బంగారాన్ని కోర్టుకు అప్పగించడం మరింత అయోమయానికి గురిచేసింది. రాజు ఆధ్వర్యంలోనే.. అటు కోర్టును, ఇటు పోలీసులను, తల్లిలా భావించాల్సిన సొంత బ్యాంకును తప్పు దోవ పట్టించి రీజనల్ మేనేజర్ రాజే ఇ దంతా చేశారని అప్పట్లోనే అనుమానాలు రేకెత్తాయి. తర్వాత జరిగిన అనేక పరిణామాలే రాజే అసలైన సూత్రధారి అయ్యుంటారని రుజువు చేశాయి. కుంభకోణం జరిగిన సమయంలో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్‌తో సహా మరికొందరిని ఆగమేఘాలపై బదిలీ చేసేయడం, జాయింట్ కస్టోడియన్లుగా ఉన్న ఇద్దరు క్యాషి యర్లలో ఒకరిని పోలీసుల ఒత్తిడితో లొంగిపోయి అరెస్టు అయ్యేలా చేయడం, మరొక కస్టోడియన్ జి.లోకనాథంను వదిలేయడం, 2023 అక్టోబరులో స్వప్నప్రియ సంచులు మాయం చేసినట్లు (సీసీ ఫుటేజీ ఆధారంగా నమ్మించి), 14 నెలలుగా ఈ తతంగం జరిపినట్లు పోలీసుల వద్ద చెప్పిన ఆర్ఎం రాజు అంతకుముందు నెలలో జరిగిన సెంట్ర ల్ ఆడిట్లో అంతా క్లియర్‌గా ఉన్నాయంటూ వారిపై ఉన్నతాధికారులకు ఎలా నివేదిక పంపించారన్నది పోలీసులను ఆలోచింపజేశాయి. నరసన్నపేట, శిలగాం బ్రాంచిల కుంభకోణాల్లోనూ రాజు పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. పోలీసు ఎండార్స్‌మెంట్‌తో క్లారిటీ పోలీసులు స్వప్నప్రియ కుటుంబానికి ఇచ్చిన ఎండార్స్మెంట్ ప్రకారం అప్పటి, ఇప్పటి ప్ర భుత్వాల ప్రమేయం కానీ, పోలీసుల ప్రమే యం కానీ ఈ కేసులో లేదని, ఆర్ఎం రాజు, సీనియర్ అసోసియేట్ అండ్ జాయింట్ కస్టోడియన్ జి.లోకనాథం ప్రమేయం ఉందని ఆధారాలు సేకరించారు. బాధి త కుటుంబానికి ఇచ్చిన ఎండార్స్మెంట్లో ఇదంతా స్పష్టం చేశారు. -
చలికాలం.. జరభద్రం!
● జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో ఉపశమనం కోసం సొంత వైద్యం మానుకోవాలి. అందుబాటులో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాలి. ● కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ● వంట పాత్రలపై మూతలు తప్పనిసరిగా వేయాలి. ● చేతులు పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోకూడదు. ● శీతల పానీయాలు, ఐస్క్రీంలకు దూరంగా ఉండాలి. ● చిన్నారులను స్వెటర్లు లేకుండా బయట తిరగనీయకూడదు. శ్వాస సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో సమస్యలకు ఆస్కారం అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు -
ఉత్సాహంగా అంతర్ కళాశాలల పోటీలు
ఎచ్చెర్ల : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని కింజరాపు ఎర్రంనాయుడు వ్యవసాయ కళాశాలలో శుక్రవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలు, సాంసృతిక, సాహిత్య సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు. స్థానిక కళాశాలతో పాటు 18 వ్యవసాయ కాలేజీలకు చెందిన 486 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ ఎల్.నారంనాయుడు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నైరా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.జోగినాయుడు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బుడుమూరు శ్రీరామ్మూర్తి, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, దుర్గాశ్రీనివాస్, ఐ.కిషోర్, డాక్టర్ ఆర్.రవికాంత్‌రెడ్డి, జి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసు నమోదు
రణస్థలం: మురవాడ గ్రామానికి చెందిన అక్కివరపు ప్రసాద్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి శుక్రవారం తెలిపారు. రణస్థలం మండలం గిరివానిపాలెం గ్రామానికి చెందిన బాలిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల 9న ప్రసాద్ అనే వ్యక్తి వచ్చి గిరివానిపాలెం పట్టుకెళ్లిపోయాడు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్‌ను పట్టుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ధాన్యం బుగ్గిపాలు మెళియాపుట్టి : గిరిశిఖర గ్రామం కేరాసింగిలో రెండెకరాలకు సంబంధించిన వరి ధాన్యం దగ్ధమైంది. చీడిగుడ్డి గవిరేసు తన భార్య భారతితో కలిసి రెండురోజుల క్రితం రెండెకరాల్లో వేసిన ధాన్యాన్ని కోతకోసి కల్లానికి చేర్చాడు. గురువారం రాత్రి వరకు యంత్రంతో నూర్చి కుప్పగా వేసి దానిపై టార్పాలిన్లు కప్పి ఇంటికిచేరాడు. కొద్దిసేపటికే పొలంలో మంటలు రావడంతో అక్కడికి వెళ్లి చూసేసరికి ధాన్యం కాలిపోయింది. ఎవరో గిట్టనివారు నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. -
ముందు జాగ్రత్తలే మేలు..
చలికాలంలో ముందు జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు చల్లని గాలిలో, మంచు పట్టిన సమయంలో బయట తిరగటం మంచిది కాదు. అలర్జీలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. – డాక్టర్ జి.వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్, పాతపట్నం చలి నుంచి రక్షణకు చిన్నారులకు స్వెటర్లు, వేడి నీటితో స్నానం చేయించాలి. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ వి.మన్మధరావు, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, సీహెచ్‌సీ, పాతపట్నం -
సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై పరిశోధనలు చేయాలని విజయనగరం జేఎన్టీయూ డైరెక్టర్ జి.స్వామినాయుడు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఐసీఈఎంటీఏ–25 పేరిట నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ మెటీరియల్స్ ఫర్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులు ఇంజినీరింగ్ విద్యకు నూతన దిశలను చూపుతున్నాయన్నారు. ఎమర్జింగ్ మెటీరియల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తు టెక్నాలజీలకు బాటలు వేస్తున్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొని తాజా పరిశోధనలు, అభివృద్ధి అంశాలు, ఏఐ డేటా సైన్స్ అన్వయాలు వంటి అంశాలపై 188 పత్రాలు అందగా అందులో 110 ఎంపిక చేసినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ శ్రీరాములు, బి.వి.రమణ, టి.నరేష్, రత్నమణి, ఎం.రమణయ్య, జయంతి, సంతోషకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వందేభారత్ రైలు ఢీకొని విద్యార్థిని మృతి
కంచిలి: మండల కేంద్రం కంచిలి వద్ద రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని సాలిన గంగోత్రి(తనూజ) మృతిచెందింది. బలియాపుట్టుగ కాలనీలో నివాసం ఉంటున్న ఈమె గొల్లకంచిలి గ్రామంలో ఉన్న తన మేనత్త ఇంటికి రైల్వే ట్రాక్ దాటి వెళుతుండగా గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని మృతిచెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్‌రావు శుక్రవారం తెలిపారు. తండ్రి పురుషోత్తం కళాసీ పనిచేస్తున్నాడు. ముగ్గురు కుమార్తెల్లో తనూజ పెద్దమ్మాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థిని మృతిచెందడంతో ప్రధానోపాధ్యాయుడు ఎస్.చాణిక్య, సహోపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. మృతురాలి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. వ్యక్తి ఆత్మహత్య జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన బొమ్మాళి ఎండువాడు (61) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్షవాతం, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు భరించలేక మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ అశోక్‌బాబు తెలిపారు. కుమారుడు బొమ్మాళి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై డి.రాము, డి.శ్రీను, బి.గణేష్ శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా.. అతివేగంతో ముందువెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారా? అనే విషయం తెలియడం లేదు. గణేష్ అనే వ్యక్తికి కాళ్లు విరిగిపోయి, ఎడమ చెయ్యి తెగిపడటంతో గుర్తు తెలియని వాహనం పైనుంచి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునిస్వల్పగాయాలైన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్ర గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కోటబొ మ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. -
చేపల వేట కోసం దేనికై నా సిద్ధం
● పోర్టు, మత్స్యశాఖ అధికారులకు తేల్చిచెప్పిన మత్స్యకారులు సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో తమ జీవనాధారమైన సముద్రంలో చేపల వేట కోసం చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమేనని మత్స్యకారులు తెగేసిచెప్పారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం భావనపాడు జట్టి ప్రాంతంలో మత్స్యకారులతో పోర్టు, మత్స్యశాఖ, మైరెన్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ సముద్రంలో చేపలు పడే ప్రాంతాన్ని ఆక్రమించుకొని గ్రిడ్జింగ్ పనులు చేపడుతున్నారని, ఇప్పుడు ఈ ప్రాంతంలో చేపల వేట చేయకూడదని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి10 గంటల వరకు సముద్రంలో డ్రెడ్జింగ్ పనులు ఆపేస్తే ఆ సమయంలో వేట చేసుకుంటామని చెప్పారు. పోర్టు నిర్మాణంలో భావనపాడు సముద్రం ముఖద్వారాన ఇసుకమేటలు వేయడం వల్ల మూడేళ్లుగా వేట సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇప్పుడు కోనేం, ఇతర చేపలు సమృద్ధిగా దొరికే అవకాశముందని, 45 రోజులు పాటు వేట చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. వేట సాగనివ్వకపోతే సుమారు 836 కుటుంబాలు వలసబాట తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణంలో భాగంగా ఏ ఒక్క మత్స్యకారుడికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇప్పుడు చేపల వేట కూడా చేయవద్దంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. మా సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే తిరిగి వారి సమస్యలను చెప్పడం భావ్యం కాదన్నారు. పోర్టుతో పాటు ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో తమకు మేలు చేకూరేలా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ, టెక్కలి మత్స్యశాఖ అధికారి ధర్మరాజు పాత్రో, మైరెన్ సీఐ రాము, మత్స్యకార సంఘ అధ్యక్షుడు గొరకల ఆదినారాయణ, మత్స్యకార నాయకులు కారాడ చిన్నబాబు, ఆలుపిల్లి పోతయ్య, రాజేష్, కారాడ చిన్నయ్య, కారాడ పోతయ్య తదితరులు పాల్గొన్నారు. రాజీపడలేం.. భద్రత విషయంలో రాజీపడితే మత్స్యకారులకే ప్రమాదమని పోర్టు అధికారులు తేల్చిచెప్పారు. డ్రెడ్జింగ్ సమయంలో బోట్లు వస్తే ప్రమాదం జరిగి అందరూ బాధపడాల్సి వస్తుందన్నారు. ఆ ప్రాంతంలో కాకుండా మిగతా చోట వేట సాగించుకోవచ్చన్నారు. డ్రెడ్జింగ్ జరిగే ప్రాంతానికి బోట్లు వస్తే క్షణాల్లో ముక్కలైపోతాయని చెప్పారు. అయినప్పటికీ సమస్యను పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్‌తో సెంచూరియన్ ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
పదోన్నతుల్లో అవకతవకలౖపై విచారణ!
అరసవల్లి/సారవకోట: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడుతుండటం పట్ల ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. జిల్లా డీఎంహెచ్ఓ శాఖలో పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించి, ఏడు రోజులు పూర్తి నివేదిక ఇవ్వాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌కు జాతీయ ఎస్టీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 159 గ్రేడ్ 3 ఏఎన్ఎం ప్రమోషన్ విషయంలో అవకతవకలు జరిగాయని దళిత ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. దీనిపై కలెక్టర్ కమిటీ వేసి విచారణ చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది అధికారులు ముడుపులు తీసుకుని పదోన్నతుల జాబితా సిద్ధం చేశారని దళిత ఆదివాసీ సంఘాల ఆరోపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరిగితే అర్హులైన గ్రేడ్–3 ఏఎన్ఎంలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 15 నుంచి అభ్యుదయ యాత్ర శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు, వాటి నిర్మూలనే లక్ష్యంగా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 15 నుంచి అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రజలంతా ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జె.ఆర్. పురం సర్కిల్ పరిధి నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ యాత్ర డిసెంబరు 29 వరకు కొనసాగనుందని వివరించారు. రెవెన్యూ, విద్యా, మెడికల్ అండ్ హెల్త్, ఉమెన్ అండ్ ఛైల్డ్‌లైన్, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొనేలా విద్యాసంస్థలు చొరవ తీసుకోవాలని, పట్టణాలతో పాటు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమర్థ పోలీసులుగా తీర్చిదిద్దాలి శ్రీకాకుళం క్రైమ్: కానిస్టేబుల్ అభ్యర్థులకు సమగ్ర శిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని అందించి సమర్ధ పోలీసులుగా తీర్చిదిద్దాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, పోలీసు శిక్షణా కేంద్రం సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలవాలన్నారు. నూతన చట్టాలు, పోలీసు నిబంధనలపై అవగాహన కల్పించాలని, నేరపరిశోధనల్లో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఆకట్టుకున్న మాక్ పోలింగ్ నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎస్ఎస్ఏ ఆదేశాల మేరకు విద్యార్థులతో యాక్టిజన్ క్లబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించామని హెచ్ఎం వకులా రత్నమాల తెలిపారు. వీరి ఎన్నిక పోలింగ్ పద్ధతిలో నిర్వహించారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.లక్ష్మణరావు, లీలారాణి, కేశవరావు, సుభాషిణి, లక్ష్మీ భవానీ, భీమారావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఖోఖో జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికలు, సీనియర్స్ పురుషులు మహిళల ఖోఖో జట్ల ఎంపికలు ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం, కార్యదర్శి సీహెచ్ ఫాల్గుణరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాదు శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా ఉదయం 9 గంటలకు ఎంపికల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఎంపికై నవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. సీనియర్స్ విభాగానికి వయస్సుతో సంబంధం లేదని, జూనియర్స్‌కు మాత్రం 2025 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లులోపు బాలబాలికలు అర్హులని చెప్పా రు. వయస్సు, ఎత్తు, బరువు కలిపి 250 పాయింట్ల(ఇండెక్స్ 250)కు మించి ఉండకూడ దని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు 94419 14214 నంబర్‌ను సంప్రదించాలన్నారు. సోలార్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబునాయుడు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సాగర్‌నగర్‌లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసు మ్, పీఎం సూర్యఘర్, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. -
ధాన్యం సేకరణ, ఎరువులకు కంట్రోల్ రూమ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం సేకరణ, ఎరువులకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788కు ఫోన్ చేసి తెలియజేయవచ్చునని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త మొబైల్ ఫోన్లు శ్రీకాకుళం అర్బన్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు 3385 కొత్త శాంసంగ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాదిన్నర కాలంగా అంగన్వాడీలు పాత మొబైల్ఫోన్ల తో నానా అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అంగన్వాడీలు పాత ఫోన్లను కొద్ది నెలల కిందటే ఐసీడీఎస్ కార్యాలయానికి అప్పగించి యాప్‌లలో ఆన్లైన్ విధానంలో ఆయా పథకాలకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియను నిలుపుదల చేశారు. పాత ఫోన్లు పనిచేయడం లేదని, కొత్త ఫోన్లు ఇస్తే తప్ప ఆన్లైన్లో యాప్‌ల వివరాలు నమోదు చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులకు అంగన్వాడీలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జిల్లాలోని 16 ప్రాజెక్టుల పరిధిలో 130 సూపర్వైజర్లు ఉండగా వారి పరిధిలోని 3,385 కొత్త మొబైల్ ఫోన్లను అంగన్వాడీలకు అందజేయనున్నారు. 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు అరసవల్లి: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మ రింత తెలిసేలా అవగాహన కల్పించేలా ఈ వా రోత్సవాలను జరుపుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో వి ద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లుగా, అలాగే విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 20న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. -
మెరుగైన ఫలితాల సాధనకే 100 రోజుల ప్రణాళిక
పొందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తర గతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవికుమార్ అన్నారు. మండలంలోని తోలాపి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం 8.30 గంటలకు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. వంద రోజుల పాటు అన్ని సబ్జెక్టులకు ప్రత్యేక తరగతుల నిర్వహణతో పాటు వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయని పాఠశాలలో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడితో పాటు హెచ్ఎంలపైనా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. తోలాపి పాఠశాలలో గణిత సబ్జెక్టు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు బోధనను రెండు పీరియడ్ల పాటు పరిశీలించిన డీఈఓ బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్)లో భాగంగా జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నవి, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలు తెలుసుకున్నారు. ఏ ప్రాజెక్టులు ఎంత ప్రతిపాదిత పెట్టుబడితో వచ్చేందుకు అంగీకారం తెలుపుతున్నారు, వాటి వల్ల చేకూరే ఉపాధి కల్పన అవకాశాలు వాటిని పరిశీలించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, టెక్కలి, శ్రీకాకుళం ఆర్డీఓలు కృష్ణమూర్తి నాయుడు సాయి ప్రత్యూష, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, పరిశ్రమలు, రహదారులు భవ నాలు, అగ్రికల్చర్, హార్టికల్చర్ పశుసంవర్ధక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ ,బోర్డ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● తుఫాన్ సాయం.. మానవత్వం మాయం
ఇక్కడ పాడైపోయి కనిపిస్తున్నవి కూరగాయలే కాదు మన వ్యవస్థలు కూడా. ఇవి తుఫాన్ బాధితుల కడుపు నింపాల్సిన పదార్థాలు. తుఫాన్ ముంచెత్తినప్పుడు నిరుపేద మత్స్యకారులు ఖాళీ కడుపుతో ఉండకూడదని కేటాయించిన కూరగాయలు ఇలా రోడ్డుపక్కన మొలకెత్తి కనిపిస్తూ వ్యవస్థలను వెక్కిరిస్తున్నాయి. మోంథా తుఫాన్ సందర్భంగా సంతబొమ్మాళి మండలం భావనపాడులో మత్స్యకారులకు పంపిణీ చేయకుండా 40 రోజుల పాటు ఉంచేసిన తుఫాన్ సరుకులు గురువారం ఇలా ఎవరికీ చెందకుండా పారబోశారు. ‘మోంథా సరుకులు మొలకెత్తాయి’ అనే శీర్షికన సాక్షిలో ఇదివరకు ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆ ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ రేషన్ డీలర్‌కు చీవాట్లు పెట్టారు. సమాధానం చెప్పలేక సంబంధిత రేషన్ డీలర్ చివరకు కుళ్లిపోయిన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు రోడ్డు పక్కన పెంటమీద పారవేశారు. – సంతబొమ్మాళి -
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం
● రైతులను దోచుకుంటున్నారు ● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: ధాన్యం కొనుగోలు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, రైతులు దగా పడుతున్నారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఆమదాలవలసలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతు లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీని వల్ల మధ్యవర్తులు, దళారులు రాజ్యమేలుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. బరువు కోతలు, తేమ పేరుతో జరుగుతున్న మోసాలను ప్రభుత్వం మౌనంగా చూస్తోందని మండిపడ్డారు. సొసైటీల నుంచి మిల్లుల వరకు అన్ని దశల్లో రైతులకు న్యాయం జరగడం లేదని, పంట నాణ్యత ఎంత బాగున్నా ధరలో అయాచిత కోతలు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల కు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తి రస్కరిస్తే, రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు. ఫిర్యాదు చేసినా.. జిల్లాలో కొనుగోలు వ్యవస్థ మొత్తం అవినీతిమయమైందని, మిల్లర్లు, సంబంధిత అధికారులు, మిల్లర్ల యూనియన్ ప్రతినిధులు కలసి రైతులను బహిరంగంగా దోచుకుంటున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతుల నుంచి 3 నుంచి 5 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నా సివిల్ సప్లై శాఖ చేతులు ముడుచుకుందన్నారు. ఒక్కో బియ్యం లారీపై సివిల్ సప్లై అధికారులు రూ.2500లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడం చాలా బాధాకరమని, ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్లాయో నిగ్గు తేల్చాలని కోరారు. జిల్లాలోని గోడౌన్లు అన్నీ ఏఎస్ డబ్ల్యూసీ ద్వా రా అద్దెకు తీసుకున్నప్పటికీ, నిర్వహణ బాధ్యత పూర్తిగా ఓనర్లకే అప్పగించడం, వారు ఒక్కో బియ్యం లారీపై రూ.400లు వసూలు చేయడం వ్యవస్థలో అక్రమాలు ఎంత లోతుగా ఉన్నాయో చెబుతున్నాయని పేర్కొన్నా రు. మిల్లులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులపై 10 శాతం పన్ను ముసుగులో మంత్రి అచ్చెన్నాయుడు సోదరులు, వారి అనుచరులు, అసోసియేషన్ పేరుతో రూ. 8 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జేసీ స్థాయిలో కూడా సమస్యలను నిదానంగా తీసుకోవడం వల్లే అవినీతి పెచ్చుమీరుతోందన్నారు. జిల్లాలో ఇప్పటికే 30 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు అవినీతి, అధిక భారం, లైసెన్స్ సమస్యలతో మూతపడే స్థితిలో ఉన్నాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైస్ మిల్లులు మూసుకునే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. బాబాయి, అబ్బాయిలపై మండిపాటు జిల్లా వ్యవహారాలు పూర్తిగా జిల్లాకు చెందిన మంత్రి ఆధీనంలో నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. జిల్లాలో బాబాయి కుమ్మేస్తే, దేశంలో అన్ని ఎయిర్‌పోర్టులకు తాళాలు వేసి అబ్బాయి అధికారం చెలాయిస్తున్నారని తమ్మినేని ఎండగట్టారు. స్థానిక పరిపాలన నుంచి కేంద్ర స్థాయి వరకు ఒకే కుటుంబం అధికారాన్ని తమ మనుగడకు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో యువ నాయకుడు తమ్మినేని చిరంజీవినాగ్ పాల్గొన్నారు. -
అన్నదాతకు అన్యాయం
● జిల్లాలో ధాన్యం కొనుగోలులో అంతా గోల్మాల్ ● కొనుగోలు కేంద్రాల కంటే ముందుగానే ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు ● తక్కువ ధరకు కొనుగోలు, అదనంగా నాలుగైదు కిలోలు తూకం ● కుమ్మకై ్కన మిల్లులకు తరలింపు ● అంతా తానై వ్యవహరిస్తున్న కీలక నేత, సోదరుడు కీలక నేత, సోదరుడి మంత్రాంగంవ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో అంతా కుమ్మకై ్క రైతులను దోచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి, పెద్దల అండదండలు ఉన్న మిల్లుల్లో ఉన్న ధాన్యానికి భారీ తేడా కనిపిస్తోంది. దాదాపు ప్రతి మిల్లులోనూ వేలాది ధాన్యం బస్తాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చినవి కావు. మూడింతలు ధాన్యం దళారుల ద్వారా మిల్లులకు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల సిబ్బంది కంటే ముందే రైతుల్ని సంప్రదించి, రకరకాలుగా భయపెట్టి కొనుగోలు చేస్తున్నారు. బస్తాకు రూ.1400 నుంచి రూ.1600 చెల్లించి, అదనంగా నాలుగైదు కిలోల వరకు తూకం వేసుకుంటున్నారు. దగ్గరుండి రైతుల ద్వారానే మిల్లుకు తరలిస్తున్నారు. ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత దళారులు చెప్పిన కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నారు. అక్కడున్న ఆపరేటర్లు కూడా మిలాఖత్ అయి అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతులను దోచుకుంటున్న మిల్లర్లను కీలక నేత, సోదరుడు అండ్‌కో దోచుకుంటున్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యం ఆడించాక కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు 290 క్వింటాళ్ల లారీకి రూ.2500 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఆ సీఎంఆర్‌ను గోడౌన్‌కు చేరవేసేటప్పుడు లారీకి రూ.1200 నుంచి రూ.1300 తీసుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ధాన్యం ఆడినందుకు ప్రభుత్వం ఇచ్చే చార్జీల్లో 10 శాతం సొమ్మును బిల్లులు జమ కాకముందే వసూలు చేసేస్తున్నారు. ఇదంతా అడ్డగోలుగా జరుగుతోంది. ఈ ముడుపులన్నీ ఆ కీలక నేత, సోదరుడి వద్దకే చేరుతున్నాయి. దోపిడీపై టీడీపీకి చెందిన ఓ మిల్లరే ఫిర్యాదు కూడా చేశారు. ధాన్యం కొనుగోలులో విఫలం ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైంది. కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయంగా మిగిలాయి. అధికారులు వస్తున్నారే తప్ప ప్రయోజనం లేదు. – పంగ వెంకటరమణ, చిన్న కరగాం, నరసన్నపేట మండలం తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం మద్దతు ధర కావాలంటే ధాన్యం అమ్ముకోవడానికి కనీసం వారం రోజులు పడుతోంది. నిల్వ ఉంచుకునే సదుపాయాలు లేకపోవడంతో దళారులకు రూ.200 తక్కువకే ఇచ్చేస్తున్నాం. – తోట సూర్యనారాయణ, పెద్ద కరగాం, నరసన్నపేట మండలం ముప్పుతిప్పలు కొనుగోలు కేంద్రాల్లో ట్రక్‌షీట్ జనరేట్ చేయించుకుని, మిల్లుకు తరలించే లోపు ఆ మిల్లుల్లో అధికంగా ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. అక్కడ అన్లోడింగ్ చేసే విషయంలో జాప్యం జరుగుతోంది. అదనం కూడా అడుగుతు న్నారు. – కవిటి రామరాజు, వ్యవసాయ సలహా మండలి మాజీ అధ్యక్షుడు, యలమంచిలి, కోటబొమ్మాళి మండలం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవినీతి పెచ్చుమీరిపోయింది. ఏకంగా కీలక నేత సోదరు డు ఓ సంఘం కార్యాలయంలో అధ్యక్షుడి సీట్లో కూర్చొని చక్రం తిప్పుతున్నాడు. నేత, సోదరుడి కనుసన్నల్లో అంతా జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వీటి నిర్వహణ బాధ్యత అనుయాయులకు అప్పగింత, రైతుల నుంచి అదనంగా ధాన్యం తూకం వేసుకుని తీసుకోవడం, మిల్లర్లకు సహకరిస్తున్నందుకు వారి దగ్గర నుంచి రకరకాలుగా ముడుపుల వసూళ్లు అన్నీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దళారులే మేలంటూ.. ప్రభుత్వం చెప్పినట్టుగా రైతులు ధాన్యం విక్రయించుకోవాలంటే చాలా వ్యవధి పడుతోంది. డాక్యు మెంట్లు చూపడం, ట్రక్షీట్లు, వాహనాల ఏర్పాటు వంటివన్నీ జాప్యానికి కారణాలే. మిల్లర్ల వద్ద కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తేమ శాతం తక్కువగా ఉందని సాకులు చెప్పి ఆరేడు కిలోలు అదనంగా తీసుకుంటున్న దాఖలాలూ ఉన్నాయి. అదే దళారుల ద్వారా మిల్లులకు వెళ్తే ఈ బాధలన్నీ తప్పుతున్నాయి. దీంతో రైతులు దళారులనే ఆశ్రయిస్తున్నారు. దాన్నే కొందరు మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా దోపిడీ గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు ఉండగా దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల కంటే ముందుగానే రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసేశారు. ఆ ధాన్యాన్ని కుమ్మకై ్కన మిల్లర్లకు తరలించారు. దీంతో మిల్లుల్లో ఉన్న ధాన్యానికి, కొనుగో లు కేంద్రాల్లో నమోదైన ధాన్యానికి పొంతన లేకుండా పోయింది. వాస్తవంగా కొనుగోలు కేంద్రాల్లో ఎంత నమోదైతే అంతే ధాన్యం మిల్లుల్లో ఉండాలి. అందుకు భిన్నంగా చాలా వరకు మిల్లుల్లో నిల్వలు ఉన్నాయి. ఇప్పుడీ ధాన్యాన్ని కౌలుకిచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలతోను, తమకు కావాల్సిన వారి రైతుల పేరిట అధికంగా విస్తీర్ణం చూపించి ట్రక్‌షీట్ జనరేట్ చేస్తున్నారు. పలు కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు కూడా మిల్లర్లు, దళారులతో కుమ్మక్కు కావడం వల్ల ట్రక్‌షీట్ జనరేట్ మాయాజాలం యథేచ్ఛగా జరిగిపోతోంది. అంటే ప్రభు త్వం ఇచ్చే మద్దతు ధర మొత్తం తమకు కావాల్సిన రైతుల ఖాతాల్లో పడుతుంది. ఆ సొమ్మును తర్వాత డ్రా చేసుకుంటారు. రైతుల నుంచి తక్కువ కొనుగోలు చేసి, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు ధరను తీసుకుంటారు. ఇదే సమయంలో ఒడిశాలో తక్కువకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా ఇక్కడే కొనుగోలు చేసినట్టు ట్రక్‌షీట్ జనరేట్ చేయిస్తున్నారు. ఈ రకమైన దోపిడీ జిల్లాలో అత్యధికంగా సారవకోట, నరసన్నపేట, జలుమూరు, పోలా కి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో ఎక్కువగా జరిగింది. ఇక్కడ జరిగిన అక్రమాలపై ఆరోపణలు అధికారుల దృష్టికి రావడంతో ఓ అధికారి అకస్మిక తనిఖీ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినట్టు సమాచారం. కానీ, ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మిల్లర్ల స్థాయిలో అవినీతి ప్రభుత్వం త్వరితగతిన కొనుగోళ్లు చేయకపోవడం, కొనుగోలు కేంద్రాల సిబ్బంది చొరవ చూపకపోవడం, ప్రభుత్వం గోనె సంచెలు సకాలంలో ఇవ్వకపోవడం, జీపీఎస్ చేసిన రవాణా వాహనాలు అందుబాటులో ఉండకపోవడం, కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ట్రక్ షీట్ జనరేట్ కాకపోవడం వంటి కారణాలతో రైతులు తప్పని పరిస్థితుల్లో పెద్దల అండదండలున్న మిల్లర్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్న దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాకు చెందిన కీలక నేత, సోదరుడు కనుసన్నల్లో నడుస్తున్న మిల్లులు, వారితో కుమ్మకై ్కన దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారు చెప్పిన ధర నడుస్తోంది.100 కిలోల బస్తాకు ప్రభుత్వం మద్దతుధర రూ.2,389 నుంచి రూ.2369వరకు ఉన్నప్పటికీ రూ.1400 నుంచి రూ.1600 వరకు దళారులు కొనుగోలు చేసి, ఒక్కో బస్తా నుంచి రూ.700 నుంచి రూ.900వరకు దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఒక బస్తాకు అదనంగా ఐదారు కిలోలు తూకం వేసుకుంటున్నారు. -
సృజనాత్మక బోధనతో ఉత్తమ ఫలితాలు
శ్రీకాకుళం రూరల్: బోధనలో సృజనాత్మకతను జోడిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని గురుకుల విద్యాసంస్థల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. పెదపాడులోని అంబేడ్కర్ గురుకులంలో భాషా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు గురువారం ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు శతశాతం ఫలితాలు సాధించేలా అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం స్టేట్ రిసోర్స్ పర్సన్ ఐ.సంతోష్‌కుమార్ హిందీ ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ కె.తారకరామారావు, గురుకుల కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎస్.పద్మజ, ఎన్.రామకృష్ణ, బుచ్చిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మక ‘యూనివర్సిటీ’ శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్య, వైద్య రంగాలు నడవాల్సి ఉన్నా అవేమీ కానరావడం లేదని, తల్లిదండ్రుల నుంచి లక్షలు సొమ్ము దోచేస్తుండటంతో వారంతా అప్పులపావుతున్నారని జిల్లా బార్ అసోషియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే ఇతివృత్తంతో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సందేశాత్మకంగా ‘యూనివర్శిటీ’ చిత్రం తీసి ప్రభుత్వాల తీరుని ఎండగట్టేలా చేశారని చెప్పారు. దర్శక నటుడు ఆర్.నారాయణమూర్తి గురువారం శ్రీకాకుళంలోని ఎస్.వి.సి. థియేటర్లో చిత్రం విడుదల సందర్భంగా రావడంతో ఆయన్ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. సినిమా వృత్తాంతం నేటి సమాజానికి అద్దంపడుతోందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివ ప్రసాదరావు, వాన కృష్ణచంద్, గేదెల వాసుదేవరావు, ఎన్ని సూర్యారావు, న్యాయవాదులు, మామిడి క్రాంతి, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి, రెడ్డి విశ్వేశ్వరరావు, కడగల రాంబాబు, బొత్స సుదర్శనరావు, వాన ప్రమోద్, రచయిత అట్టాడ అప్పలనాయుడు, సాహిత్యాభిలాషి దాసరి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ రణస్థలం: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు పైడిభీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో అఖిల భారత మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. దేశంలో వివిధ రంగాల కార్మికులను, సంఘాలను ఐక్యం చేసి బలమైన కార్మిక వర్గ పోరాటాలను నిర్మించేందుకు ఆర్.కె. బీచ్‌లో జరిగే మహాసభలు దోహదపడతాయన్నారు. సమావేశంలో కార్మికులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్స్ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెలమల రమణ, వెంపడాపు లక్ష్మణరావు, ఎమ్. నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నట్టా.. లేనట్టా!
రిమ్స్‌లో పోస్టుల భర్తీ శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు విడుదలైన నోటిఫికేషన్ రద్దయ్యిందో.. కొనసాగుతుందో తెలియక అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో అయోమయం చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రిమ్స్ అధికారులు 41 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. సుమారు 2500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.300 చొప్పున, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చొప్పున ఫీజు చెల్లించారు. ఇలా దరఖాస్తుదారుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు రిమ్స్ ఖాతాకు జమైంది. మంత్రి ఆదేశాలతో బ్రేక్! ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అభ్యర్థులంతా ఎదురుచూస్తుండగా అక్టోబర్‌లో రిమ్స్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎందుకు జారీ చేశారన్నది తెలియకపోయినప్పటికీ, తన దృష్టికి తీసుకురాకుండా నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేశారని ఇదే సమావేశంలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జరిగిన నెల వరకు అధికారుల్లో కదలిక లేకపోవడంతో అభ్యర్థులతో పాటు మిగిలిన వారంతా నోటిఫికేషన్ రద్దయిందని భావించారు. డీఎంఈ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలకు మంజూరైన పోస్టులను ఆయా అధికారులు భర్తీ చేసినా శ్రీకాకుళంలో పెండింగ్‌లో ఉండిపోవడం పట్ల డీఎంఈ అధికారులు రిమ్స్ అధికారులపై మండిపడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలను తెలియపరచగా.. అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేయవద్దని, అభ్యర్థులు ఫీజు చెల్లించడం వల్ల వారంతా ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయని తక్షణం మెరిట్ జాబితాను విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఆదేశాలతోనే రిమ్స్ అధికారులు మెరిట్ జాబితాను విడుదల చేశారని సమాచారం. కారణం ఏదైనాప్పటికీ ఎటువంటి అవకతవకలు జరగకపోయినా నోటిఫికేషన్‌ను మంత్రి ఆదేశాల మేరకు రద్దు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణం ఈ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్‌పై స్పష్టమైన ప్రకటనను విడుదల చేయాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ రద్దుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం అయినా మెరిట్ జాబితా విడుదల చేసిన రిమ్స్ అధికారులు సెలక్షన్ జాబితా విడుదల కాకపోవడంతో అభ్యర్థుల అయోమయం అనూహ్యంగా మెరిట్ ప్రకటన.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితా నోటీస్ బోర్డులో ఉంచామని, ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా అభ్యర్థులు తెలియజేయాలని గత నెలలో రిమ్స్ అధికారులు అనూహ్యంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో మెరిట్ ఉన్న అభ్యర్థులు తమకు ఉద్యోగాలు వచ్చేసినట్లేనని సంతోషపడ్డారు. అయితే మెరిట్ జాబితా విడుదలై నెల రోజులకు పైబడుతున్న సెలక్షన్ జాబితా ప్రకటించకపోవడంతో ఇటీవల కొందరు అభ్యర్థులు గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించారు. అయితే, నోటిఫికేషన్ రద్దయిందని దీనికోసం మరల కలవక్కర్లేదని కలెక్టర్ చెప్పడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నోటిఫికేషన్ రద్దుకు గల కారణాలు కూడా తెలియరావడం లేదు. కేవలం మంత్రి ఆదేశాల మేరకే నోటిఫికేషన్ రద్దు చేశారని రిమ్స్‌లోని కొందరు ఉద్యోగులు చెబుతున్నప్పటికీ ఆదేశాల అనంతరం మెరిట్ జాబితాను ఎందుకు విడుదల చేశారు అన్నదానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. నిర్ణయం వారిదే.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మెరిట్ జాబితాను కమిటీకి సమర్పించాం. నోటిఫికేషన్ రద్దు చేస్తారా? భర్తీ చేస్తారా? అన్నది మా పరిధిలో లేని విషయం. – డాక్టర్ అప్పలనాయుడు, ప్రిన్సిపాల్, రిమ్స్ వైద్య కళాశాల -
కన్ను పడిందా.. స్థలం గోవిందా!
● తామరాపల్లిలో ప్రభుత్వ స్థలంపై టీడీపీ కార్యకర్తల కన్ను ● ఇప్పటికే పలు స్థలాలు ఆక్రమించుకున్న అధికార పార్టీ వర్గీయులు నరసన్నపేట : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం అన్న చందంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అనుమతులు లేకుండా పలుచోట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు స్థలాలను కబ్జా చేసిన అధికార పార్టీ కార్యకర్తలు తాజాగా జాతీయ రహదారికి ఆనుకొని తామరాపల్లి వద్ద పాత సర్వే నంబర్ 3/15ఎ (ఎల్పీ 11)లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తామరాపల్లి, జమ్ములకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఈ స్థలంలో నిర్మాణ పనులు చేపడుతున్నారు. విలువైన ఈ స్థలాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వ యంత్రాంగం కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీరి కన్ను పడటంతో స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఈ స్థలం లక్షలు విలువ చేస్తుందని చెబుతున్నారు. ఈమేరకు తామరాపల్లికి చెందిన ముచ్చ గణేష్ సంబంధిత అదికారులకు ఈ స్థలం ఆక్రమణల గురించి తెలియజేశారు. వెంటనే తహసీల్దార్ స్పందించి వీఆర్వో లుకలాపు శ్రీనును పంపించి పరిస్థితిని తెలుసుకున్నారు. పనులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ స్థలంలో ఎటువంటి పనులు చేయవద్దని వీఆర్వో ఆక్రమణదారులకు సూచించారు. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారని, స్థలాన్ని పరిరక్షించి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని గణేష్ విజ్ఞప్తి చేశారు. బొడ్డవలస రెవెన్యూ పరిధిలో.. మరోవైపు, నరసన్నపేట పంచాయతీ బొడ్డవలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 46/1ఎలో ఉన్న జిరాయితీ భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి పట్టణానికి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టి దిబ్బలను చదును చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వీఆర్వో శ్యామ్ ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే జిరాయితీ పేరిట శ్మశానం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేసే అవకాశం ఉందని, సర్వే చేసి శ్మశాన స్థలం నిర్ధారించాల స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే రాతికర్ర చెరువులో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌కు నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీ తదితరులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇందిరానగర్‌లోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబందనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. సుడా అధికారులు మొదట్లో అనుమతులు ఇచ్చి తర్వాత స్టాప్ ఆర్డర్ఇచ్చారు. తదుపరి అనుమతులు పొందే వరకూ పనులు చేపట్టవద్దని ఆదేశించినా పనులు యథేఛగా జరుగుతున్నాయి. ఇలా అధికార పార్టీ వర్గీయులు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ట్రావెల్ బస్సులో రూ.69 లక్షల చోరీ
పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.69 లక్షలు పోయినట్లు శ్రీకాకుళంలోని గుజరాతి పేటకు చెందిన జామి చంద్రశేఖరరావు ,వి.వినోద్ బాబు తెలియజేశారు. బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం శ్రీకాకుళం నుంచి విజయవాడకు రెండు బ్యాగుల్లో రూ.కోటి 29లక్షలతో బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం సమీపంలో గల హోటల్ వద్ద భోజన విరామం కోసం బస్సును నిలుపుదలచేశారు. బాధితుల్లో ఒకరు బస్సులో భోజనం చేయగా, మరొకరు హోటల్‌కు వెళ్లారు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు ఒకబ్యాగు పట్టుకుని పరుగులు పెట్టినట్లు బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు వెంటనే పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై దుర్గాప్రసాద్ రంగప్రవేశం చేసి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
నృత్యోత్సవ వేడుక
సిక్కోలు వేదిక.. ● రేపు బాపూజీ కళామందిర్లో ‘సప్తమీ నాట్యోత్సవం’ ● ప్రదర్శనకు సిద్ధమైన ఐదుగురు ప్రపంచస్థాయి కళాకారులు ● సంగీత గురు రఘునందన్‌కు లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు శ్రీకాకుళం కల్చరల్ : మరో మహత్తర వేడుకు సిక్కోలు సిద్ధమైంది. ఈ నెల 13న శ్రీకాకుళం నగరానికి చెందిన శివశ్రీ నృత్యకళానికేతన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఐదుగురు ప్రపంచస్థాయి కళాకారులు ‘సప్తమీ నాట్యోత్యోత్సవం’ పేరిట అద్భుత నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు సురేంద్రనాథ్(కూచిపూడి), బిజీనా సురేంద్రనాథ్(మోహినీయాట్టం), సౌరవ్‌రాయ్(కథక్), పరిమళ(భరతనాట్యం), ప్రీతీప్రియ(ఒడిస్సీ) ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం వీరికి శివశ్రీ నాట్య పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.నల్లాన్ చక్రవర్తుల రఘునందన్ -
స్వగ్రామానికి వస్తూ మృత్యుఒడికి..
సంతబొమ్మాళి : గెద్దలపాడు గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు చింతల సంతోష్ (26) స్వగ్రామానికి వస్తూ రైలులో గుండెపోటుకు గురై గురువారం మృతి చెందాడు. లక్కివలస ఎంపీటీసీ సభ్యుడు చింతల రాజులు కుమారుడైన సంతోష్ హిమాచల్‌ప్రదేశ్‌లో జియాలజిస్టుగా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి స్వగ్రామం గెద్దలపాడు వచ్చేందుకు బుధవారం రైలులో బయలు దేరారు. మార్గమధ్యలో గురువారం ఉదయం నాగపూర్ సమీపంలో వచ్చే సరికి రైల్లో గుండెపోటు రావడంతో సీటులోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రాజులు, ఆదిలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుతుందని స్థానికులు తెలిపారు. చింతల సంతోష్ (ఫైల్) -
‘మాస్టర్’్స పోటీల్లో సత్తాచాటాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్రపోటీల్లో పతకాల పంట పండించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా మా మాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వేదికగా మా అథ్లెటిక్స్ అధ్యక్షుడు ఎండీ కాసింఖాన్ కళావతి ఆధ్వర్యంలో ఎంపికై న అథ్లెట్లకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపట్లలో ఈ నెల 12 నుంచి జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న మాస్టర్స్ అథ్లెట్స్ తుది జాబితాను ప్రకటించారు. వివిధ విభాగాల్లో పురుషులు, మహిళలు కలిపి 21 మందిని ఎంపిక చేశారు. అనంతరం ఎమ్మెస్సార్ మాట్లాడుతూ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్రపోటీల్లో పతకాల మోద మోగించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులందరికి కాసీంఖాన్ దంపతుల మనమరాలు సఫియా కమల్ పేరున క్రీడా దుస్తులు, ట్రాక్ షూట్, టీ షర్ట్లు అందజేసినట్లు తెలిపారు. డీఎస్ఏ కోచ్ అర్జున్‌రావు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపోటీల్లో మొదటి రెండుస్థానాల్లో నిలిచినవారు జాతీయ పోటీలకు ఎంపికవుతారని చెప్పారు. కార్యక్రమంలో పలువురు మాస్టర్ అథ్లెట్లు, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. -
వరి కుప్పలు దగ్ధం
ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధిలోని కాళింగ మన్నయ్యపేటలో సువ్వారి స్వామినాయుడు, కూన మోహనరావులకు చెందిన వరి కుప్పలకు బుధవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 90 సెంట్లకు సంబంధించిన వరి కుప్పలు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కాలిపోవడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ టి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వరికుప్పలను పరిశీలించారు. అగ్నిమాపక అధికారి బొడ్డేపల్లి హరినారాయణ, వీఆర్వో ఇంద్ర పాల్గొన్నారు. గత ఏడాది కూడా.. ఇదే గ్రామంలో గురుగుబెల్లి రాజశేఖర్ అనే రైతుకు చెందిన వరి కుప్పలను గత ఏడాది దగ్ధం చేశారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఈ ఏడాది కూడా అదే మాదిరిగా వరికుప్పలను దగ్ధం చేశారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో చొక్కాకుల బంధ ఆక్రమణలు తొలగించడం వల్లే ఈ విధంగా వరికుప్పలను దగ్ధం చేస్తున్నారని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
లక్షన్నర మంది చిన్నారులకు పల్స్‌పోలియో
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఐదేళ్లలోపున్న 1,55,876 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. మూడు రోజుల్లో దాదాపు 6,18,024 ఇళ్లను సందర్శించి 1.55 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని వివరించారు. మొదటి రోజు పోలియో బూత్‌లు, తర్వాత రెండు రోజులు ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,252 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సంతల వద్ద ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం 40 ట్రాన్సిట్ బూత్‌లు పనిచేస్తాయని వివరించారు. వీటికి అదనంగా, వీధులు, పొలాల్లోకి వెళ్లేందుకు 84 మొబైల్ బృందాలను నియమించినట్లు తెలిపారు. వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు వంటి 101 హై రిస్క్ ఏరియాలను గుర్తించామన్నారు. మొత్తం 7,430 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండు రోజుల ముందు నుంచే మైకింగ్, డప్పు చాటింపు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్ఓ అనితను కలెక్టర్ ఆదేశించారు. -
పరిహాసమా!
పరిహారమా..● కేలీ విత్తనాలతో నష్టపోయిన సోంపేట, కంచిలి మండలాల రైతులు ●నష్ట పరిహారం అందించడంలో విత్తన కంపెనీ దోబూచులాట ●ఏఓ మధ్య వర్తిత్వంతో మరింత జఠిలం శ్రీకాకుళం పాతబస్టాండ్ : చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఖరీఫ్ ప్రారంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో వారు ఇచ్చిన విత్తనాలు చల్లితే చాలాచోట్ల కేలీలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని కంచిలి, సోంపేట మండలాల్లో ఈ సమస్య ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే చివరికి కేలీలు రావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. జాప్యమెందుకో? కేలీ వరి విత్తనాలతో మోసపోయిన రైతులకు నష్ట సరిహారం అందజేయడంలో విత్తన కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయాధికారులు దోబూచులాడుతున్నారు. న్యాయంగా అందజేయాల్సిన పరిహారం ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇప్పటికే కేలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని సోంపేట, కంచిలి మండలాలకు చెందిన పలువురు రైతులు గత వారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదుచేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు విత్తన కంపెనీ ప్రతినిధులు, సోంపేట మండల వ్యవసాయ అధికారి, రైతులతో నాలుగు రోజుల కిందట చర్యలు జరిపారు. రెండు మండలాల్లో సుమారుగా 200 బ్యాగులు ఆర్జీఎల్ 2537 రకం విత్తనాలు పంపిణీ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ విత్తనాలు సుమారు రెండు వేల ఎకరాల్లో పంట వేసినట్టు నిర్ధారించారు. కేలీ విత్తనాలు వల్ల ప్రతి ఎకరాకు సుమారుగా 10 క్వింటాళ్ల ధాన్యం నష్టం వచ్చినట్టు వెల్లడించారు. దీని ప్రకారం ఎకరాకు 10 క్వింటాళ్ల వంతున ప్రస్తుత ధర ప్రకారం రూ.17500 నష్టపరిహారం విత్తన కంపెనీ అందజేయాలని రైతులు బీన ఢిల్లీరావు తదితరులు కోరారు. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఎకరాకు రూ.2500 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. ఇదిలా ఉండగా, ఫౌండేషన్ సీడ్ ఇస్తామని కంపెనీ ప్రతినిధులు మాయమాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు, విత్తన కంపెనీ ప్రతినిధులకు సంధానకర్తగా ఉన్న సోంపేట మండల వ్యవసాయాధికారి ఈ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ప్రయోజనం తప్ప రైతుల ప్రయోజనాలు చూడటం లేదని వాపోతున్నారు. చర్చల ద్వారా న్యాయం జరగకపోతే న్యాయస్థానం ద్వారానైనా పరిహారం హక్కును పొందుతామని స్పష్టం చేస్తున్నారు. దీనికి విత్తన కంపెనీతోపాటు వ్యవసాయ అధికారులు బాధ్యులవుతారని, రైతుల కోసం మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
21న ఘంటసాల ఆరాధనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం సమీపంలో అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ నెల 21న ఘంటసాల శతజయంతి వేడుకలను పురస్కరించుకొని 12 గంటల పాటు నిర్విరామ ఆరాధనోత్సవం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కోశాధికారి సుబ్బారావు తెలిపారు. పీఎన్ కాలనీలోని వరసిద్ధి వినాయక పంచాయతన ఆలయంలో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, జీబీఏ స్వరమాధురి సంయుక్త నిర్వహణలో జరిగే ఘంటసాల ఆరాధనోత్సవంపై బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994 నుంచి సంస్థ ప్రతినిధులు ముద్దాలి రఘురామ్, సభ్యుల సహకారంతో వివిధ జిల్లాల్లో 12 గంటలు, 24 గంటలు, 36 గంటలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎంతోమంది బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, లీల వంటి ప్రముఖ గాయకులను సత్కరించామన్నారు. ఇక్కడ కూడా ప్రముఖ గాయకుడు కారుణ్యను సత్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. అధ్యక్షుడు పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ఎంపిక చేసిన 118 గీతాలతో 60 మంది గాయకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నిర్విరామంగా ఆలపిస్తారని, స్థానిక కళాకారులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో కన్వీనర్ ఎం.వి.కామేశ్వరరావు, నిక్కు అప్పన్న, జంధ్యాల శరత్‌బాబు పాల్గొన్నారు.


