లారీల నిలిపివేతతో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

లారీల నిలిపివేతతో అవస్థలు

Aug 2 2026 12:46 AM | Updated on Aug 2 2026 12:46 AM

లారీల నిలిపివేతతో అవస్థలు వజ్రపుకొత్తూరు: భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవంలో భాగంగా వీఐపీ ప్రయాణాల కోసం జాతీయ రహదారిపై ఎక్కడికక్క డే ట్రాఫిక్‌ నిలిపివేశారు. స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది సంయుక్తంగా టోల్‌ప్లాజాల వద్ద కాపు కాసి కోల్‌కతా వైపు నుంచి కుడివైపుగా వస్తున్న ప్రతి లారీని టోల్‌ ప్లాజాల వద్ద అడ్డుకుని నిలిపివేశారు. పలాస నియోజకవర్గంలోని లక్ష్మీపురం లోట్‌ ప్లాజా వద్ద కూడా శనివారం పెద్ద ఎత్తున లారీలను పోలీసులు ఆపేశారు. దీంతో లారీ డ్రైవర్లు అవస్థలు పడ్డారు. మండుటెండలో ఇదేం బాద అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాకీలపై రాజకీయ ఒత్తిడి ఆదిత్యాలయ సూపరింటెండెంట్‌గా వెంకటేశ్వరరావు

కంచిలి: భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పో ర్టు ప్రారంభోత్సవం పుణ్యమా అని జాతీయ రహదారిలో రాకపోకలు సాగించే లారీ ఆపరేటర్లు అవస్థలు పడ్డారు. శనివారం వేకువజా ము నుంచి మధ్యాహ్నం వరకు లారీలను పోలీ సులు జాతీయ రహదారిలో నిలిపివేశారు. జిల్లాలో అన్నిచోట్ల హఠాత్తుగా పోలీసులు లారీలను రోడ్డు పక్కన ఆపివేయించారు. దీంతో ఒక పూటంతా లారీ ఆపరేటర్లు అవస్థలు పడా ల్సి వచ్చింది. కనీసం ఎంత సమయం నిలిపివేస్తారో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఉద యం కాలకృత్యాలు నుంచి మధ్యాహ్నం భోజ నం చేసే వరకు అంతా అయోమయ పరిస్థితి ఏర్పడింది.

టోల్‌ప్లాజాల వద్ద..

శ్రీకాకుళం క్రైమ్‌ : ఆమదాలవలస వైఎస్సార్‌ సీ పీ సమన్వయకర్త చింతాడ రవి, ఆయన అనుచరులు 21 మందిని తక్షణమే అరెస్టు చేయాల ని పోలీసు ఉన్నతాధికార వర్గాల నుంచి ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడుకు తీవ్ర ఒత్తి డి వస్తోంది. దీంతో శుక్రవారం పీఎం బందోబస్తు హడావుడిలో జిల్లా పోలీసులు ఓ వైపు ఉంటూనే మరో వైపు ఈ పనిని కూడా భుజాన వేసుకున్నారు. ఈ కేసు విషయమై శుక్రవారం సెల్ఫీ వీడియో విడుదల చేసిన రవి ఎస్‌ఐ ప్ర వళ్లికపై తాము ఎలాంటి దాడికి పాల్పడలేదని, ఆ విషయం ఆమెకు కూడా తెలుసని.. కావా లనే కేసు నమోదు చేశారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి ఎస్‌ఐ సుముఖంగా లేకపోయినా ఒత్తిడి చేసి కేసు పెట్టించడం, చింతాడ రవికి ఈ విషయం ముందుగానే తెలిసిందని నాయకులు భావించ డం వంటివి చర్చనీయాంశమయ్యాయి. పోలీ సుల కాల్‌డేటా కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు అదే ఎస్‌ఐపై పోలీసులు చేయి వేసిన ఫొటో ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో ఆ కానిస్టేబుల్‌ నుంచి వివరణ కోరినట్లు సమాచారం.

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ సూపరింటెండెంట్‌గా కె.వెంకటేశ్వరరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. సింహాచలం దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ అరసవల్లికి డిప్యుటేషన్‌ ప్రాప్తికి అరసవల్లి ఆలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని సూచనలు స్వీకరించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పుష్కరిణి అభివృద్ధి పనులు, అన్నదాన మండపం, ప్రసాదాల విభాగంతో పాటు కేశఖండన శాల తదితర విభాగాల్లో సాధారణ పరిశీలన చేపట్టారు. ఈయన వెంట సీనియర్‌ అసిస్టెంట్‌ శోభనాద్రాచార్యులు, జూనియర్‌ అసిస్టెంట్‌ బాల భాస్కర్‌ సాయి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement