ఉద్యోగ సేవల్లో కలసి పనిచేసి, రిటైర్ అయిన తర్వాత కూడా సేవల్లో ఉంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ 40 ఏళ్ల స్నేహాన్ని కొనసాగిస్తున్నారు అరసవల్లికి చెందిన విశ్రాంత డిప్యూటీ ఇంజినీ ర్లు ముద్దాడ అప్పలనాయుడు, కుప్పిలి నరసింహమూర్తి. శ్రీకాకుళంలోనే పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. 1979లో అసిస్టెంటు ఇంజినీర్లుగా వృత్తిని ఒకే శాఖలో ప్రారంభించి, డిప్యూటీ ఇంజినీర్లుగా పదవీ విరమణ చేశారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇద్దరూ కలసి 30ఏళ్లకు పైగా అయ్యప్పమాల ధారణలు చేసి శబరిమలకు కలసి వెళుతున్నారు. నగరంలో కృష్ణాపార్కు వద్ద, అరసవల్లిలో షిరిడి సాయిబాబామందిరాన్ని నిర్మించారు.


