శ్రీకాకుళం పాతబస్టాండ్:
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వంలో రాజీ పడటమే అసలైన రాజమార్గమని శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ ఎస్‌ఏ) అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు స్పష్టం చేశారు. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘మధ్యవర్తిత్వం దేశం కోసం–3.0’ అవగాహన ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు భారీ ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ, వాణిజ్య, ఆస్తి సంబంధిత వివాదాలను అత్యంత గోప్యంగా, తక్కువ ఖర్చుతో, స్వల్ప సమయంలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, మధ్యవర్తిత్వ సేవల సమాచారం కోసం డీఎల్‌ఎస్‌ఏ టోల్ ఫ్రీ సంఖ్య 15100 ను 24 గంటలు సంప్రదించవచ్చని పిలుపునిచ్చారు.
ర్యాలీ నిర్వహిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు


