ఎట్టకేలకు డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ మూడున్నర నెలల జాప్యంతో విద్యార్థులకు అవస్థలు ఈనెల 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ప్రవేశాల షెడ్యూల్ ఇలా...
షెడ్యూల్ ప్రకారం క్లాసులు
మొద్దు నిద్ర వీడి..
డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాల కు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెంటనే దరఖాస్తులు చేసుకోవాలి. ఈనెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యా లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీల గుర్తింపుతోపాటు, అక్కడి పరిస్థితులు, వసతులు, సౌకర్యాలు, ఫ్యాకల్టీని పరిగణలోకి తీసుకుని కాలేజీలను వెబ్ ఆప్షన్‌లో ఎంచుకోవాలి.
– డాక్టర్ ఎన్.ఎస్.ఎన్.స్వామి, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల
శ్రీకాకుళం న్యూకాలనీ:
ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మొద్దునిద్రను వీడింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై.. డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ కోసం మూడున్నర నెలలగా ఎదురుచూస్తూ విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్న విషయం తెలిసిందే. డిగ్రీ నోటిఫికేషన్ కోసం జరుగుతున్న జాప్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఈ మేరకు 2026–27 కొత్త విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇదిలా ఉండగా 2026–27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ ప్రవేశాల కాలేజీయేట్ ఎడ్యుకేషన్ వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400లు, బీసీ రూ.300లు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.200లు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మూడున్నర నెలల ఎదురుచూపులు
వాస్తవానికి ఉన్నత విద్యా వ్యవస్థపై శీతకన్నేసిన కూటమి ప్రభుత్వం.. డిగ్రీ ప్రవేశాల విషయంలో నూ తన ఉదాశీన వైఖరిని మరోసారి ప్రదర్శించింది. సకల శాఖల మంత్రిగా చలామణీ అవుతున్న నారా లోకేష్ తన విద్యాశాఖను గాలికొదిలేస్తుండ డం వల్ల మూడున్నర నెలలు(100 రోజులు పైబడి)పాటు నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరిగిందని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పాఠశా ల విద్యను అస్తవ్యస్తం చేస్తున్న ప్రభుత్వం.. కళాశా ల విద్య, సాంకేతిక విద్యను కనీసం పట్టించుకుకు న్న పాపాన పోవడం లేదు. ప్రతిపక్షం, విద్యావేత్త లు, విద్యార్థి సంఘాలు, కాలేజీల నుంచి తీవ్రస్థాయిలో డిమాండ్లు, విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 102 డిగ్రీ కళాశాల లు ఉన్నాయి. వీటిలో 15 ప్రభుత్వ, 87 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 28 వేలు వరకు సీట్లు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. కానీ గతేడాది ఈ సంఖ్య పది వేలకు పడిపోయింది. కొన్ని ప్రైవేట్ కళాశాల ల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రభు త్వ కళాశాలల్లో సైతం గతంలో పోలిస్తే ప్రవేశాలు చాలావరకు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్ కోర్సులు మూసివేసే దిశగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయకపోతుండడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
ఈనెల 5న నోటిఫికేషన్ వెలువడగా.. 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తు లు చేసుకోవాల్సి ఉంటుంది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు చేపించుకోవాలి.
ఆగస్టు 15 నుంచి 19 వరకు ఎంపిక చేసుకునే కాలేజీతోపాటు ఎంచుకున్న కోర్సులకు వెబ్ ఆప్షన్ కు గడువు విధించారు.
ఆగస్టు 26వ తేదీన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. వారి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది.
ఆగస్టు 27వ తేదీ నుంచి క్లాసులు మొదలు కానున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్దేశించిన షెడ్యూ ల్ ప్రకారం విద్యార్థుల ప్రవేశాలు, సీట్ల కేటాయింపులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్స్‌కు ఛాన్స్ ఉంది. 26వ తేదీన సీట్ల కేటాయింపు, 27వ తేదీన నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
– డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల


