మోటార్‌ యాక్ట్‌ను సవరించాలి | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ యాక్ట్‌ను సవరించాలి

Aug 9 2026 2:28 AM | Updated on Aug 9 2026 2:28 AM

మోటార్‌ యాక్ట్‌ను సవరించాలి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం ఉద్దానం ప్రాజెక్టులో నాబార్డు భాగస్వామ్యం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డ్రైవర్లకు నష్టం చేసే 2023 నూతన మోటార్‌ యాక్ట్‌ను సవరించాల ని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఆటో అండ్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్టు వర్క ర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం ఎన్జీవో హోమ్‌లో టి.తిరుపతిరావు అధ్యక్షతన డ్రైవర్ల ప్రథమ మహాసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడు తూ.. డీజీల్‌, పెట్రోల్‌ ధరల మీద వేసిన వ్యాట్‌ జీఎస్టీ, సెస్‌ పన్నులు రద్దు చేయాలని.. జరిమానాలు పెంచే జీవో నంబర్‌ 21, 31 రద్దు చేయాలన్నారు. ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులపై ఉన్న పోలీస్‌ ఆర్టీవో ఈ చలనాలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్‌ భరో కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నా రు. గౌరవ అధ్యక్షులుగా ఈ.తిరుపతిరావు, కన్వీనర్‌గా వి.ఎస్‌.సురేష్‌, కో–కన్వీనర్‌గా డి. యోగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా రాము, సూరాల గోపి, రమణమూర్తి, రాజు, సూరిబాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కవిటి: మండలంలోని జాడుపుడి జంక్షన్‌ సమీపంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమా దం తప్పింది. స్థానికులు అందించిన సమాచా రం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న లాంగ్‌ లగేజీ లారీని అదేమార్గంలో వెళ్తున్న బొలేరో పికప్‌ వాహనం ఢీకొంది. లారీని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో బొలేరో వాహనం టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ రూటు మారి డివైడర్‌ పైకి ఎక్కేసింది. దీంతో లారీపై ఉన్న లగేజీ చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డును క్లియర్‌ చేసే క్రమంలో రోడ్డుపై పడిన సామగ్రిని ప్రొక్లెయిన ర్ల సాయంతో తొలగించి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు వెంటవెంటనే ప్రారంభించా రు. కవిటి పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తెలగ సామాజిక వర్గమంతా ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా తెలగ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. నగరంలోని తెలగ సంక్షేమ భవనంలో జిల్లా అధ్యక్షుడు పిల్లల నీలాద్రిరావు అధ్యక్షతన సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సామాజిక వర్గ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది నాయకులు చిత్తశుద్ధిగా పనిచేశారని, అయితే ఇంకా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్న తెలగ కులానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రగతి ఫలాలు పూర్తిగా అందడం లేదన్నారు. సంఘ భవనానికి స్థల దాతలైన దివంగత దూస ఆదినారాయణరావు, దూస సరోజిని దంపతులకు నివాళులర్పించారు. స్థల దాత కుమార్తె రజని మరో రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. సమావేశంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇండుగు లక్ష్మీనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు దయానంద్‌ మాస్టారు, విశ్రాంత మెజిస్ట్రేట్‌ శ్యామ్‌, నిర్మాణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహనాయుడు, జి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

హిరమండలం: ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులో నాబార్డు భాగస్వామ్యం అయ్యిందని సీజీఎం గోపా ల్‌ తెలిపారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు తాగునీటిని అందించేందుకు ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.700 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు నాబార్డు రూ.124 కోట్లు సమకూర్చింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పనితీరును సీజీఎంతో కూడిన అధికారుల బృందం శనివారం పరిశీలించింది. వంశధార రిజర్వాయర్‌ వద్ద చేపడుతున్న ఇంటెక్‌ వెల్‌, పంపు హౌస్‌, 529 మీటర్ల అప్రోచ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌తో పాటు అక్కడి నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీజీఎం గోపాల్‌ మాట్లాడుతూ పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కిడ్నీ వ్యాధుల దృష్ట్యా సురక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకం మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి పథకంలో నాబార్డు భాగస్వామ్యంగా ఉన్నందున ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement