టెక్కలి రూరల్: స్థానిక ఎన్‌టీఆర్ క్రీడా వికాస కేంద్రం విద్యార్థి తమిరి జ్ఞానదీప్ తైక్వాండో సీ.బీ.ఎస్.సీ సౌత్ జోన్ నేషనల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ నర్శిపురం శేఖర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యార్థి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ నెల 5వ తేదీ నుంచి 8 వరకు జరిగే ఈ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ విద్యార్థి ఎంపికపై తల్లిదండ్రులు భవాని, మురళీ కృష్ణతో పాటు పలువురు అభినందించారు. ఎంపికై న క్రీడాకారుడికి జిల్లా క్రీడాధికారి మహేష్ క్రీడాకిట్‌ను అందించి అభినందించారు.
కాంట్రాక్టు పోస్టులకు
సర్టిఫికెట్ వెరిఫికేషన్
శ్రీకాకుళం: జిల్లాలోని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రిన్సిపాల్, సీఆర్‌టీ, పీజీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి సబ్జెక్టుల వారీగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్న పోస్టులకు 1:3 నిష్పత్తిలో తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ పి.వేణుగోపాలరావు ఓ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని కోరారు.
నవోదయ ఖ్యాతి విశ్వవ్యాప్తి
సరుబుజ్జిలి: వెన్నెలవలస జవహర్ నవోదయలో చదువుకున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఉద్యోగాల్లో స్థిరపడి నవోదయను మరింత అగ్రస్థానంలో నిలబెట్టారని విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ బేతనసామి తెలిపారు. జవహర్ నవోదయ అవతరణ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులను సత్కరించారు. నవోదయ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలవడం అందరి సహకారంతో జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో పలువు రు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
‘మధ్యవర్తిత్వంతో కేసులకు త్వరిత పరిష్కారం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివాదాలను ఉభయ పక్షాల ఒప్పందంతో వేగంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ విధానం ఎంతో దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు సునీత కొండబోలు స్పష్టం చేశారు. నేషనల్ లీగల్ స ర్వీ సెస్ అథారిటీ (నల్సా), రాష్ట్ర న్యాయ సే వాధికార సంస్థ (అప్సా) ఆదేశాల మేరకు చేపట్టిన ‘మధ్యవర్తిత్వం దేశం కోసం–3.0’ ప్రచారంలో భాగంగా బుధవారం జిల్లా కో ర్టులో నిర్వహించిన న్యాయవాది మధ్యవర్తుల సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమంలో ఆమె ఆన్‌లైన్ ద్వారా పాల్గొని మాట్లాడారు. మధ్యవర్తిత్వ పద్ధతుల ద్వారా కక్షదారులకు ఆర్థిక భా రం, సమయం ఆదా అవుతాయని, వివాదాలు స్నేహపూర్వక వాతావరణంలో ముగిసిపోతా యని పేర్కొన్నారు. కేరళకు చెందిన మాస్టర్ ట్రైనర్ పి.సురేష్ కుమార్ ఆన్‌లైన్ ద్వారా హా జరై మధ్యవర్తిత్వంలో పాటించాల్సిన మెలకువలు, రాజీ మార్గాల ప్రాముఖ్యతపై న్యాయవాదులకు విస్తృత అవగాహన కల్పించారు.
శాకంబరిగా మహాలక్ష్మీ అమ్మవారు
శ్రీకాకుళం కల్చరల్: బలగలోని శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో బుధవారం ఆషాడ బహుళ సప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారిని విశేష శాకంబరీ అవతారంలో అలంకరించారు. అర్చన ప్రధాన అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ, మణిశర్మ కిరణ్ శర్మల ఆధ్వర్యంలో విశేష కుంకుమార్చన శ్రీ చక్ర నవావరణ వైభవంగా జరిగాయి.


