ఆమదాలవలస: జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన ఆదరణ, ఆమదాలవలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్‌కు పెరుగుతున్న అభిమానం చూడలేక చింతాడ రవిపై అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్ అన్నారు. ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ మహిళా ఉద్యోగిని బలి చేసిన సంఘటన జిల్లా అంతా తెలుసని, అలాంటిది ఆ యన చింతాడ రవిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. గతంలో పోలీసులు, అధికారులపై కూన రవికుమార్ మాట్లాడిన మాటలు అందరికీ వినిపించారు. గంజాయి.. అంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్న కూన రవికుమార్ రాజకీయ పతనం మొదలైందన్నారు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలను ఎలా వేధించారో జనాలకు ఇంకా గుర్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీని కూడా కూన కించపరుస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. సిన్సియర్‌గా పనిచేసే మహిళా ఎస్‌ఐను పావుగా వాడుకోవడం తగదన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు తమ్మినే ని శ్రీరామమూర్తి మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి చింతాడ రవికుమార్ వచ్చారని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని అన్నారు. చింతాడ ఎమ్మెల్యే కావడం ఖాయమని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పొందూరు జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, మున్సిపాలిటీ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ సరుబుజ్జిలి మండలాధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, పొందూరు మండలాధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, బూర్జ మండలాధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి జెడ్‌పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, బూర్జ ఎంపీపీ కర్ణం కృష్ణం నాయుడు, నియోజకవర్గ మున్సిపాలిటీ విభాగ అధ్యక్షులు పొదిలాపు తిరుపతిరావు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు బొడ్డేపల్లి విశ్వేశ్వరరావు, జిల్లా మున్సిపాలిటీ విభాగ కార్యదర్శి గొలివి పురుషోత్తం,పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ విభాగ కార్యదర్శి బద్రి రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు కింజరాపు సురేష్ తదితరులు పాల్గొన్నారు.


