బాబా ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

బాబా ఆలయంలో చోరీ

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

బాబా ఆలయంలో చోరీ పట్టుబడిన దొంగ పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాలు చిరిగిన నోటు తెచ్చిన చేటు

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ పరిధి వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగినట్లు అలయ అర్చకులు బంకుపల్లి శాస్త్రి గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వింజాంపాడు గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి గురువారం ఉదయం ఆలయ అర్చకుడు వెళ్లేసరికి అలయం ముందు ఉన్న రెండు హుండీలు తెరిచి ఉండడం గుర్తించారు. అనంతరం అలయం లోపలికి వెళ్లి చూసేసరికి బాబా విగ్రహం పైనున్న కిరీటం సైతం చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వెంటనే కోటబొ మ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ సింహాచలం ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించా రు. గుర్తు తెలియని వ్యక్తి దుప్పటి కప్పుకుని వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సుమా రు రూ.40 వేలు విలువ కలిగిన వెండి కిరీటంతో పాటుగా కొంత మొత్తంలో నగదు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అయితే ఇదే గ్రా మంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

నరసన్నపేట: స్థానిక శ్రీరాంనగర్‌లో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్లిన బమ్మిడి దేవ కుమార్‌ గాయప డి స్థానికులకు చిక్కాడు. వివరా ల్లోకి వెళ్తే.. గురువారం వేకువజామున శ్రీరాంనగర్‌లోని ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు దేవకుమార్‌ ప్రయత్నించాడు. ఇంతలో ఇంట్లో అలికిడి రావడంతో భయపడి పై అంతస్తు నుంచి కిందికి దూకాడు. పరిగెత్తి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ కాలికి గాయమవ్వడంతో కదలలేకపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఏరి యా ఆస్పత్రిలో అతడికి చికిత్స చేయించారు. కాలికి గాయమైందని కట్టు వేయాలని వైద్యు లు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నరసన్నపేట ఎస్‌ఐ బి. గణేష్‌ తెలిపారు.

ఇచ్ఛాపురం: రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. స్థానిక పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించా రు. ఈ సందర్భంగా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో గతంకంటే అధికంగా ఉత్తీర్ణత సాదించాలని సూచించారు. మిషన్‌ మార్చ్‌ కార్యక్రమంలో ప్రతీ విద్యార్థి తప్పక హాజరై పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని లైబ్రరీలు, ల్యాబ్‌, కిచెన్‌ షెడ్‌ల ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని నిబంధనలకు అనుగుణంగా అందించాలని స్పష్టం చేశారు. ఉపవిద్యాశాఖాధికారి విలియ మ్స్‌, మండల విద్యాశాఖాధికారి కె.సూర్యారా వు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంతబొమ్మాళి: చిరిగిన రూ.500ల నోటు విషయంలో గొడవ జరగడంతో ఒకరు గాయపడిన ఘటన మండలంలో ని మలగాం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, బాధి తులు తెలిపిన వివ రాల మేరకు.. గ్రామానికి చెందిన పది మంది డ్వాక్రా సభ్యుల లోన్‌ డబ్బులు ప్రతినెలా ఒక సభ్యురాలు కట్టాల్సి ఉంటుంది. జూలై నెలకు సంబంధించి సభ్యురాలు మామిడి పున్నమ్మ వంతు వచ్చింది. దీంతో లోన్‌ డబ్బులు రూ.20 వేలు తీసుకొని బ్యాంకుకు వెళ్లింది. అయితే అందులో ఒక రూ.500ల నోటు చిరిగిపోవడంతో అధికారులు తిరస్కరించారు. దీంతో తన వద్దనున్న మరొక రూ.500ల నోటును ఇచ్చి లోన్‌ డబ్బులు కట్టడం జరిగింది. సభ్యుల్లో చిరిగిన రూ.500ల నోటు ఎవరిచ్చారు అనేది చూసుకోలే దు. బ్యాంకుకు వెళ్లిన తర్వాత తెలియడంతో వేరేచోట చిరిగిన రూ.500ల నోటు ఇస్తే రూ. 100లు కమీషన్‌ తీసుకొని రూ.400లు ఇచ్చార ని మిగతా సభ్యులకు పున్నమ్మ చెప్పింది. దీంతో వచ్చేనెల అదనంగా రూ.10లు చొప్పున ఇస్తామని కొంతమంది సభ్యులు అంగీకరించా రు. అయితే కావాలనే చిరిగిన రూ.500 నోటు ఇచ్చి అందరి మీద వసూలు చేయడం ఏమిట ని ఒక సభ్యురాలు నౌపడ ఆదిలక్ష్మి ప్రతిరోజూ పున్నమ్మతో వాగ్వావాదం చేసేది. ఈ క్రమంలో బూతులు తిట్టుకోవడంతో ఇరువురి మధ్య తగాదా జరిగింది. ఈ తగాదాలో పున్నమ్మ, అమె భర్త అప్పయ్యపై కర్రలతో నౌపడ రాంబాబు, జోగారావు, చిన్నయ్య, అదిలక్ష్మి, రాజు, లక్ష్మిలు దాడి చేశారు. ఈ దాడిలో అప్పయ్య చేయి విరిగిపోయి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో టెక్కలి జిల్లా అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై సంతబొమ్మాళి పోలీసు లు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement