వలస మత్స్యకారుడు మృతి | - | Sakshi
Sakshi News home page

వలస మత్స్యకారుడు మృతి

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

రణస్థలం: కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వద్ద సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుడు మూగి నిలేకరి(34) సముద్రంలో మునిగి మృతి చెందినట్లు కొమరవానిపేట గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 3వ తేదీన రాత్రి ఒక బోటుపై నుంచి మరో బోటు మారే క్రమంలో ప్రమాదవశాత్తు జారీ సముద్రంలో పడిపోయాడు. గురువారం తెల్లవారు జామున ఒడ్డుకు కొట్టుకు రావడంతో అక్కడ పోలీ సులు కేసు నమోదు చేశారు. మృతుని స్వగ్రామం రణస్థలం మండలంలోని కొచ్చెర్ల పంచాయతీలో గల కొ మరవానిపేట. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో కొమరవానిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement