● తల్లికి వందనం పథకం రాలేదని పీజీఆర్‌ఎస్‌లో తల్లిదండ్రుల విన్నపాలు
● బతికి ఉన్న బాలుడు చనిపోయినట్టు చూపించారని ఆరోపణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లికి వందనం పథకం కొందరికే వచ్చిందని, అన్ని అర్హతలు ఉన్నా తమకు సాయం అందలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పీజీఆర్‌ఎస్‌ను ఆశ్రయించారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ తప్పు, ఇల్లు ఉంది, ఆదా యం ఎక్కువగా ఉంది వంటి కారణాలను చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశ వ్యక్తం చేశారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన పలువురు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ను సవరణ చేయలేదు. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఇటీవల వివా హం అయిన వారు, వేరే కుటుంబాలుగా ఏర్పడిన వారు, పిల్లలు ఉన్నవారు నాలుగేళ్ల కిందట ఉన్న మ్యాపింగ్‌లోనే ఉంటున్నారు. దీంతో వారి వివిధ కారణాలు చెప్పి, ఈ సంక్షేమాన్ని ఎగవేస్తున్నారు.
● ఆమదాలవలస మున్సిపాలిటీ 14వ వార్డు సచివాలయం పరిధికి చెందిన రోణంకి రోహిత్ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. గత ఏడాది ‘తల్లికి వందనం’ పథకం కింద లబ్ధి పొందినప్పటికీ, ఈ ఏడాది పథకం వర్తించలే దు. దీనిపై అధికారులను ఆశ్రయించగా, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో విద్యార్థి ఏకంగా ‘మరణించినట్లు’ నమోదు కావడంతో పథకం నిలిచిపోయిందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేదన్నారు.
● శ్రీకాకుళంలోని హయత్‌నగర్‌కు చెందిన ఆలాపన దేవి తన ఇద్దరు కుమారులు చైతన్య (6వ తరగతి), హర్షవర్ధన్ (3వ తరగతి) పేర్లపై గత ఏడాది లబ్ధి పొందారు. ఈ ఏడాది కుటుంబ మ్యాపింగ్ తండ్రి పేరుపై నమోదవడంతో పథ కం నిలిచిపోయిందని తెలిపారు. విడిగా నివసిస్తున్నప్పటికీ పథకం అందలేదన్నారు.
● శ్రీకాకుళం నగరంలో నివాసం ఉంటున్న సీహెచ్ ప్రవీణ్ రెండేళ్లుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ను మార్చాలని కోరుతూ పలు సార్లు వినతిని పీజీఆర్‌ఎస్‌లో పెట్టుకున్నా, ఇప్నటి వరకు చర్యలు లేవు. దీంతో ఈసారి కూడా తల్లికి వందనం పడలేదు.
● పీజీఆర్‌ఎస్‌కు ఇంత మంది వచ్చారంటే.. బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని అక్కడ చర్చించుకున్నారు.


