● వరుణుడి కరుణ కోసం..
వర్షాలు కురవాలని కోరుతూ నీలాదేవిపురం గ్రామంలోని శివాలయంలో సోమవారం జలాభిషేకం నిర్వహించారు. వానలు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో గ్రామస్తులంతా కలిసి బిందెలతో నీరు తీసుకువచ్చి శివుడిని అభిషేకించారు. – బూర్జ
కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి నాయకులకు బుద్ధి ప్రసాదించాలని, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న తమ నాయకుడు సీదిరి అప్పలరాజుకు మంచి జరగాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పలాస–కాశీబుగ్గలో ఉన్న కోసంగిపురం జంక్షన్ వద్ద గల శివాలయం, రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న రామాలయంలో సోమవారం పార్టీ శ్రేణులు, మహిళలు కలిసి క్షీరాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
– పలాస
చినుకు జాడ లేక పొలాలు బీడు వారుతున్నాయి. బూర్జ మండలంలో దాదాపు 6000 ఎకరాల్లో పంట సాగు నీరు లేక ఎండిపోతోంది. మబ్బులు కాస్తున్నా వాన లేకపోవడంతో రైతులకు నిరాశే ఎదురవుతోంది. చిన్న లంకాం గ్రామంలో మహిళలు నారు రక్షించుకోవడానికి బిందెలతో నీరు పోస్తున్నారు. – బూర్జ


