శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

ఎస్పీ గారు..ఇదేం తీరు? గంజాయితో ఇద్దరు అరెస్టు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాక నేడు

జిల్లా జైలులో మాజీ మంత్రి సీదిరికి పరామర్శ

జాతీయ రహదారి మీదుగా సాగనున్న పర్యటన

ఏర్పాట్లపై సమీక్ష చేసిన నేతలు

జిల్లాలో కొందరు పోలీసుల వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కో రూల్‌ అమలు చేయడం విమర్శలకు తావిస్తోంది. 8లో

ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 8లో

గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026

ఽసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం జిల్లాకు వస్తున్నారు. అక్రమ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అంపోలులో ఉన్న జైలులో ములాఖత్‌ ద్వారా కలిసి, పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి.. భోగాపురం, పూసపాటిరేగ, పైడి భీమవరం, రణస్థలం, ఎచ్చెర్ల మీదుగా నవభారత్‌ జంక్షన్‌ వద్ద శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కొత్తరోడ్డు మీదుగా అంపోలు జైలు వద్దకు చేరుకుంటారు. జిల్లాకొస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు, కలిసేందుకు వేలాదిగా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. జిల్లాలోని దారులన్నీ శ్రీకాకుళం నగరం, అంపోలు వైపు కలవనున్నాయి. కాగా, జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి నగర శివారులో ఉన్న హోటల్‌ గ్రాండ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ హర్షవర్దన్‌రెడ్డి తదితరులు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్‌, సమన్వయకర్తలు పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, విజయనగరం జిల్లా పార్లమెంట్‌ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబు, దుంపల లక్ష్మణరావు, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయికుమార్‌, ఎన్ని ధనుంజయ్‌, తూర్పు కాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌, ధర్మాన కృష్ణ చైతన్య, గొండు కృష్ణమూర్తి, గేదెల పురుషోత్తం, సీదిరి అప్పలరాజు సోదరుడు త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.మాజీ ముఖ్యమంత్రి పర్యటన సాగే మార్గం, భద్రత ఏర్పాట్లు, నాయకుల సమన్వయం, వాహనాల పార్కింగ్‌ తదితర వాటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్చించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష చేస్తున్న తలశిల రఘురాం, బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్‌, గుడివాడ అమర్‌నాథ్‌,

మజ్జి శ్రీనివాసరావు, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement