న్యూస్‌రీల్
శ్రీకాకుళం
అరకొర నిధులతో..ఆటల పోటీలకు అరకొర నిధులే ఉన్నాయి. నేటి నుంచి పోటీలు మొదలుకానున్నాయి. –10లో
● వంశధార–నాగావళి అనుసంధానంపై నీలినీడలు
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
● ఆందోళనలో రైతులు
గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026
హిరమండలం, బూర్జ:
వంశధార–నాగావళి అనుసంధానం.. దశాబ్దాలుగా నాయకుల నోట నలుగుతున్న మాట ఇది. ఎన్నికల ముందు వినిపించినంతగా ఎన్నికల తర్వాత ఈ మాట వినిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా ఈ రెండు నదుల కలయికను సాధ్యం చేసేందుకు ఒక్క అడు గు కూడా వేయలేకపోయింది. ఇక వంశధార–బాహు దా నదుల అనుసంధానం ఊసెత్తడమే మర్చిపోయారు. ప్రస్తుతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోతున్నాయి. నదు ల అనుసంధానం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఎత్తిపోతలదీ అదే పరిస్థితి..
జిల్లాలో జీవనాడులుగా వంశధార, నాగావళి నదులు ఉన్నాయి. ఇప్పటికే వంశధారపై నిర్మించిన గొట్టా బ్యారేజీ జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తోంది. అయితే వంశధార నదిలో వృథా నీటిని ఒడిసిపట్టేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి తలపెట్టారు. ఒడిశాతో జల వివాదాల నేపథ్యంలో వంశధారలో వరద నీటిని డైవర్షన్ స్కీమ్ ద్వారా రిజర్వాయర్‌లోకి పంపించి కాలువల ద్వారా నీటిని అందించాలని పరితపించారు. అలా ప్రారంభమైన ఆయన ప్రయత్నాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశా యి. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒక వైపు ఒడిశాతో జల వివాదాలకు పరిష్కారం చూపుతూనే గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ప్రధాన పనులను పూర్తిచేయగలిగారు. కానీ కూటమి వచ్చి రెండేళ్లవుతున్నా ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో చుక్కా శ్రీనివాస్, డాక్టర్ గూడేన, కిరణ్, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు
రెవెన్యూ శాఖలో అలజడి
నరసన్నపేటలో భూ ఆక్రమణలపై 19 మంది ప్రభుత్వ సిబ్బందిపై చర్యలకు ఉత్తర్వులు
దురదృష్టకరం..
నదుల అనుసంధానంపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం దురదృష్టకరం. వంశధార–నాగావళి నదుల అనుసంధానంతో జిల్లాకు ఎంతో మేలు జరుగుతుంది. అయినా ప్రభుత్వం దృష్టిసారించకపోవడం అన్యాయం. ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
– పెనుమజ్జి విష్ణుమూర్తి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, ఎల్‌ఎన్ పేట
కదలిక లేదు..
వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి ఎలాంటి ముందడుగు పడలేదు.
కనీసం ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు.
2017లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ నదుల అనుసంధానానికి ప్రతిపాదించింది. కానీ పనులను సకాలంలో ప్రారంభించలేదు.
ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలంటే కచ్చి తంగా మరోసారి టెండర్లు పిలవాలి. గజ్జిలి గెడ్డ వద్ద ఉన్న రోడ్డు కింద నుంచి కాలువ తీసి ఆరు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టాలి.
30 స్ట్రక్చర్ల నిర్మాణాలు పూర్తిచేయాలి. ఇందుకుగాను 49.23 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు గాను రూ.8.26 కోట్లు చెల్లించాలి. 7.50 ఎకరాల దేవాదాయ శాఖ భూ సమస్యను పరిష్కరించాలి.
అనుసంధానం పనులు పూర్తిచేస్తే ఎల్‌ఎన్‌పేట, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఐదు వేల ఎకరాలకు, నారాయణపురం ఆనకట్ట ప్రధాన కాలువ కింద ఉన్న 18,527 ఎకరాలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది.


