ప్రతి రోజూ పోలీసులు స్టేషన్‌కు పిలుస్తున్నారని ఆవేదనతో ఓ యువకుడు వంద అడుగుల ఎత్తు గల ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి పోలీసులనే బెదిరించాడు. ‘స్టేషన్‌కు పిలిస్తే నేను చచ్చిపోతా’ అంటూ ఖాకీలకు షాకిచ్చిన ఘటన పోలాకి మండలం బెలమర గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పాలబోయిన శివ దుర్గారావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడని పోలాకి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ కోసం పోలీసులు పలుమార్లు స్టేషన్‌కు పిలిచారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు బెలమర సచివాల యం పక్కనే ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎక్కి అక్కడ నుంచి దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దాదాపు రెండుగంటల తర్వాత పోలాకి ఎస్‌ఐ రంజిత్ నేతృత్వంలోని పోలీసులు సాహసోపేతంగా యువకుడిని కాపాడారు. కిందకు దిగిన తర్వాత కుటుంబ సభ్యులు, గ్రామపెద్దల సమక్షంలో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలాకి:


