ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

● రైతు నుంచి రూ. 20వేలు లంచం డిమాండ్‌

● రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రైల్వేట్రాక్‌పై భారీ సర్పం

మంత్రి రాజీనామా చేయాల్సిందే

రణస్థలం: లావేరు మండలంలోని లోపెంట పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారి అరుబారికి మల్లేశ్వరరావు ఒక రైతు నుంచి రూ. 20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌ గా బుధవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం అవినితి నిరోధక శాఖ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణరావు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎచ్చెర్ల మండలంలోని అజ్జరాం గ్రామానికి చెందిన కొయ్యి సత్యనారాయణ అనే రైతుకు లావేరు మండలంలోని లోపంట, సహాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో భూములు ఉన్నాయి. అతని భూములు మ్యుటేషన్‌ చేసేందుకు, పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు వీఆర్‌ఓ రూ. 20వేలు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై రెండు రోజుల కిందట రైతు ఏసీబీని సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం రూ.20వేలు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే వీఆర్‌ఓ స్వగ్రామం మురపాకలో తన ఇంటిలో కూ డా సోదాలు నిర్వహించారు. మల్లేశ్వరరావు వీఆర్‌ఏ నుంచి వీఆర్వోగా ఉద్యోగోన్నతి పొందా డు. 2023 నుంచి లోపెంటలోనే పని చేస్తున్నాడు. అంతకుముందు రణస్థలం మండలంలోని తెప్పలవలసలో వీఆర్వోగా పని చేశారు. ఆ సమయంలో తెప్పలవలస పంచాయతీలో వివాదాస్పద భూము లు సరి చేస్తామని, ప్రభుత్వ భూములు రైతుల పేరున ఎక్కిస్తామని చెప్పి రైతుల నుంచి లక్షల్లో సొ మ్ములు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతులు తిరగబడడంతో కొంతవరకు పెద్దమనుషుల సమక్షంలో సొమ్ములు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రైడ్‌లో ఏసీబీ సీఐ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement