శ్రీకాకుళం క్రైమ్ : టీడీపీ నేతల సూ చనలతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దశలవారీగా అక్రమ కేసులను బనాయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నాడు అంపోలు జంక్షన్ ఎన్‌హెచ్–16 అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద అలజడి చేశారన్న ఆరోపణలతో మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు ధర్మా న రామ్‌మనోహర్‌నాయుడు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్‌లపై 221, 223, 189(1), 121(1), 132, 285 ఆర్/ డబ్ల్యూ, 190 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు అంబటి శ్రీనివాసరావు, గేదెల పురుషోత్తం, సాయి, ఆర్.శంకరరావు మరికొంతమందిపై కూడా ఇవే సెక్షన్లు బనాయించి కేసులు కట్టారు.
వైఎస్ జగన్ పర్యటన రోజు రాత్రే ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్, మరో 20 మందిపై మహిళా ఎస్‌ఐ ఎం.ప్రవళ్లికను చుట్టుము ట్టి హత్యాప్రయత్నానికి ఒడిగట్టారని ఆరోపి స్తూ వివిధ నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్ల కింద ఆమదాలవలస పోలీసులు కేసులు కట్టిన సంగ తి తెలిసిందే. ఘటనాస్థలిలో లేనివారిని సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. టీడీపీ నేతల సూచనలతో ఆ రోజు నుంచి దశలవారీగా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూనే ఉన్నారు. పార్టీ ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, మరో 10 మందిపై, జె.ఆర్.పురం స్టేషన్‌లో 23 మందిపై కేసు కట్టారు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్రమ కేసులు కడుతున్నట్లు సమాచారం.
రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఈ–మెయిల్స్ పంపడంతో..
చింతాడ రవి, 20 మంది కోసం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసి వస్తున్న ఇద్దరిని సోమవారం రాత్రి రణస్థలం పోలీసులు విచారణ చేశారు. వీరిలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడు దేశ రాష్ట్రపతికి, మన రాష్ట్ర గవర్నర్‌కు జరిగిన పరిణామాలపై ఈ–మెయిళ్లు పంపడంతో పోలీసు లు ఉపాధ్యాయునితో పాటు చింతాడ రవి కా రు డ్రైవర్ రామ్మోహన్‌లను తక్షణమే విడిచిపెట్టారు. మరోవైపు వైఎస్సార్ సీపీకి చెందిన వా రిపై కడుతున్న కేసులు, అరెస్టుల విషయాలు మీడియాకు పొక్కితే సస్పెండ్ చేస్తామని పో లీసు సిబ్బందిని హెచ్చరిస్తుండడం గమనార్హం.


