పార్టీ తరఫున పోరాటాలు
కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల తరఫున పోరాటాలు చేస్తుండడంతో నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేపట్టిన పర్యటనకు అన్ని వర్గాల ప్రజల నుంచి స్పందన రావడంతో అది తట్టుకోలేక అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మొత్తం కూటమి మోసాలపై చైతన్యం కావాలి.
– చల్లా రవికుమార్, నియోజకవర్గ పరిశీలకుడు, టెక్కలి
యువత, నిరుద్యోగులు తిరగబడాలి
ఎన్నికల మునుపు యువత, నిరుద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వారికి చేసిన మోసానికి గుణపాఠంగా తిరుగుబాటు చేయాలి. డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి.
– దువ్వాడ వాణి, జెడ్పీటీసీ, టెక్కలి


