ప్రజలే ఉద్యమించాలి
డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రజలంతా ఉద్యమించాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. టీడీపీ కార్యకర్తలకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కట్టబెట్టారు. ఇక నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటివి ప్రభుత్వానికి గుర్తు లేవు. – రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే


