తోడితేనే నీరు.. ఆపితే కన్నీరు | - | Sakshi
Sakshi News home page

తోడితేనే నీరు.. ఆపితే కన్నీరు

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

కొండపేటకు బావి నీరే దిక్కు

నిరసన తెలిపిన గిరిజనులు

సారవకోట:

మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కొండపేట గిరిజన గ్రామం తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన సోలార్‌ మంచినీటి పథకం సరిగ్గా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 4 నుంచి రాత్రి 11 వరకు ఆ నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. పంచాయతీ ద్వారా నిర్వహించే రక్షిత మంచినీటి పథకం బోరు పూర్తిగా పాడైంది. తాగునీటి సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం స్థానికులంతా నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న బావి నీరు మాత్రమే దాహం తీరుస్తోందని, ఆ నీరు కూడా అడుగంటి పోయిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement