మంత్రి రాజీనామా చేయాలి
ఏపీ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నైతిక బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలు, యువత చైతన్యంతో ముందుకు రావాలి.
– గొర్లె కిరణ్‌కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే
నిరుద్యోగ భృతి ఏదీ..?
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. నేను చాన్నాళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాను. కొత్త నోటిఫికేన్లు ఏవీ రావడం లేదు. ఒక్క రూపాయి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. టీడీపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– గురాన భవాని, వల్లభరావుపేట


