నేను 5 ఎకరాల్లో వరి పండిస్తున్నాను. ఒక 50 సెంట్ల విస్తీర్ణంలో విత్తనాలు వేశాను. మొలక రాలేదు. మిగిలిన విస్తీర్ణంలో వెద వేశాను. మొలక వచ్చినా నీరు లేక ఎండిపోతున్నాయి. చాలా ఆందోళనగా ఉంది. కాలువ శివారు భూములు మావి. మా పొలం పక్కనే పల్లం బట్టి ఉంది. అయినా ఏం ప్రయోజనం. నీరు వస్తే కదా.. ఎనిమిదేళ్ల కిందట ఇలా ఇబ్బందులు పడ్డాం. మళ్లీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. – రువ్వ వాసు, రైతు మడపాం
సాగునీరు ఇవ్వాలి
వంశధార నీరు పొలాలకు అందడం లేదు. మాకు అందుబాటులో ఓపెన్ హెడ్ చానల్స్ ఉన్నాయి. వీటిని అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదు. దీంతో మాలాంటి గ్రామాలకు సాగు నీరు ఇబ్బందిగా ఉంది.
– బైరి రాజులు , రైతు, ముద్దాడపేట


