పద్ధతులు సవరించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

పద్ధతులు సవరించాల్సిందే

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

● ముదిరిపోతున్న వరి నారు ● యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటకు మేలు

● ముదిరిపోతున్న వరి నారు ● యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటకు మేలు

ఆమదాలవలస: జిల్లాలో సాధారణ వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాలువల ద్వారా సాగునీరు అంతంత మా త్రమే అందడం వల్ల వరి నారు ఎండిపోవడంతో పాటు ముదిరిపోతుంది. జిల్లాలో ఆమదాలవలస, రణస్థలం, జి.సిగడాం, పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌, వజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో వర్షాభావ పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వరి నాట్లు వేయడం కొద్దిగా ఆలస్యంగా జరుగుతోంది. రాబో యే వారం రోజుల్లో వర్షాధారంగా, సాగునీటి కాలువల ద్వారా సాగునీరు లభ్యమైనప్పుడు ముదురు వరి నారు నాటేటప్పుడు రైతులు తగు యాజమాన్య పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు సలహాలు అందించారు.

యాజమాన్య పద్ధతులు

●35 నుంచి 50 రోజుల నారు వయసు ఉంటే చదరపు మీటరుకు 44 కుదుళ్లు, 50 నుంచి 65 రోజుల నారు వయస్సు ఉంటే చదరపు మీటరుకు 66 కుదుళ్లు వచ్చేలా వరి మొనలు వేసుకోవాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అందువలన నాట్లు తక్కువ లోతులో నాటితే పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

● ముదురు నారు నాటేటప్పుడు నిర్ణీత విస్తీర్ణంలో కుదుళ్ల సంఖ్యను పెంచి కుదురుకు దగ్గర దగ్గర 4 నుంచి 5 మొక్కలు వంతున నాట్లు వేయాలి.

● ముదురు నారు నాటేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదు కంటే 25 శాతం పెంచి 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా అంటే 70 శాతం ఆఖరి దమ్ములోనూ ఎకరానికి 50 కిలోల డీఏపీ, 35 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్‌, మిగతా 30 శాతం 30 కిలోల యూరియా, 15 కిలోల ఫొటాష్‌ అంకురం దశలో వా డాలి. నత్రజని ఎరువులను బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36–48 గంటల తరువాత పలుచగా నీరు పెట్టాలి.

● నారు నాటడానికి సిద్ధం చేసేటప్పుడు నారు కట్టల చివర్లు తుంచి నాటాలి. ఇలా చేయడం వల్ల నారులో ఉండే కీటకాలను నియంత్రించవచ్చు. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు ఆకు కొనలపై పెట్టిన గుడ్లు నాశనం అవుతాయి.

● నారు నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీయాలి. దీని వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగా తగిలి చీడపీడల ఉద్ధృతి కొంతవరకు అదుపు చేయవచ్చును. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులను వేయడానికి ఇంకా పైరు స్థితిగతులను గమనించడానికి ఈ కాలిబాటలు బాగా ఉపయోగపడతాయి. ఈ కాలిబాటలు నాటే సమయంలోను లేదా నాటిన 5 రోజుల లోపు తీసుకోవాలి.

● నాటిన 15 రోజుల లోపు కార్బోప్యూరాన్‌ 3జి గుళికలు ఎకరానికి 8 కిలోలు చొప్పున వేసుకుంటే తొలి దశల్లో కాండం తొలుచు పురుగు ఉద్ధృతి నియంత్రించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement