బొండా ఉమా తీరు సరికాదు | - | Sakshi
Sakshi News home page

బొండా ఉమా తీరు సరికాదు

Aug 7 2026 12:50 AM | Updated on Aug 7 2026 12:50 AM

బొండా ఉమా తీరు సరికాదు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వ ర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంపై బొండా ఉమా దాడి చేయించడం సరికాదని వైఎస్సార్‌సీపీ బ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడు గుమ్మా నగేష్‌ గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న యువత, మహిళల ను దూర్భాషలాడుతూ, బ్రాహ్మణ సంఘ నేతపై కోడిగుడ్లతో దాడి చేయడం దారుణమన్నారు. బొండా ఉమా రాష్ట్రంలోని బ్రాహ్మణులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement