కొత్తూరు: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మర ణం పాలైన ఘటన మండలంలోని పారాపురం గ్రామం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు ప్రకారం.. మండలంలోని గురండి గ్రామానికి చెందిన అలికాన ధర్మారావు, సావిత్రి దంపతులకు ముగ్గురు కుమారులు. అందులో మొదటి కుమారుడు ప్రసాద రావు (31) కొత్తూరులో ఉన్న ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు తన స్వగ్రా మం గురండి నుంచి ఆదివారం బైక్ మీద కొత్తూరు వ చ్చాడు. నగదు తీసుకుని తిరిగి బైక్‌పై వెళ్తుండగా పారాపురం వద్ద మెట్టూరు నుంచి కొత్తూరు వైపు ఎదురుగా వస్తున్న లారీ ప్రసాదరావు బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో ప్రసాదరావు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలేశాడు. స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ కె. వెంకటేష్ సంఘటన స్థలానికి కేసు నమోదు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలానికి చెందిన లారీ డ్రైవర్ జి.శంకర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రసాదరావు శ్రీకాకుళంలో మీ సేవా కేంద్రంలో పనిచేస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. పోలీసులు నచ్చజెప్పారు.


