వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలకాలి | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలకాలి

Jul 30 2026 1:09 AM | Updated on Jul 30 2026 1:09 AM

వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్‌

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇటీవల అక్రమంగా అరైస్టెన మత్య్సకార సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుని ములాఖత్‌గా కలిసేందుకు జిల్లాకు గురువారం వస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకాలని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలో బుధవారం కృష్ణదాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖకు ఉదయం 11 గంటలకు చేరుకొని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం అంపోలు జైలు వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు వస్తారన్నారు. మత్య్సకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది వైఎస్సార్‌ కుటుంబమేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మత్య్సకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు జిల్లాలో మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ వంటి అనేక మంచి పనులు చేశామని తెలిపారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా లేనివిధంగా రోడ్డు యాక్సిడెంట్‌ను హత్య కేసుగా నమోదు చేసి అప్పలరాజు, ఆయన కుమారుడిని జైల్లో పెట్టడం దారుణమన్నారు. రాజకీయంగా అప్పలరాజుని ఎదుర్కొనే దమ్ములేక అరెస్టుతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కక్ష సాధింపులు చేస్తే చూస్తూ ఊరుకోమని భవిష్యత్‌లో కూటమి నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీఈసీ మెంబర్‌ అందవరపు సూరిబాబు, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం పార్లమెంట్‌ పరిశీలకుడు కేవీజీ సత్యనారాయణ, పార్టీ పలాస, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, దుంపల లక్ష్మణరావు, ఎస్‌ఈసీ మెంబర్‌ గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీను, రౌతు శంకరరావు, హర్షవర్దన్‌రెడ్డి, పొన్నాడ రుషి, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి, ఎంఏ రఫీ, బుక్కూరు ఉమామహేశ్వరరావు, సాధు వైకుంఠరావు, బాన్న నర్శింగరావు, కింజరాపు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement