రాపాక – దల్లవలస గ్రామాల మధ్యలో వరినారు కోసం బకెట్లతో నీరు తెస్తున్న దృశ్యం
కోటిపల్లి – గూడెం గ్రామాల మధ్యలో వరినారుకు తాగునీరు పెడుతున్న రైతు
వరుణుడి కోసం వేయి కళ్లతో చూస్తున్న అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఇప్పటివరకు వర్షాలు ముఖం చాటేయడంతో వరినారు మడుల్లోనే ఎండిపోతోంది. దీంతో కంటికి రెప్పలా కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. నారును కాపాడుకునేందుకు బోర్లు, బావుల చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చి నారుకు పోస్తున్నారు. ఇటీవల కొద్దిపాటి మబ్బులు వస్తుండడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోతే ఈ ఏడాది నష్టాలు తప్పవని వాపోతున్నారు. – జి.సిగడాం(పొందూరు)


