పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో తన కొడుకు, కోడలు తనపై కక్షగట్టారని శ్రీకాకుళం నగరానికి చెందిన విశ్రాంత కోర్టు ఉద్యోగి పొందూరు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. తనను ఇంటినుంచి వెళ్లిపోవాలని అంటున్నారని, వారికి ఇంటిని రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆలనాపాలనా చూస్తున్న కూతుళ్లపై శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తనకు రక్షణతో పాటు తన ఆడ పిల్లలకు రక్షణ కల్పించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు.


