శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని వాకలవలస లింగావలస గ్రామం రహదారి పరిసర ప్రాంతంలో పొలాలకు ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. విద్యుత్ పవర్ ఆఫ్ చేసి అందులోని రాగి వస్తువులను చోరీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో స్థానిక లైన్‌మెన్ పరిశీలించగా పొలాల గట్లు మీద ట్రాన్స్‌ఫార్మర్ పడి ఉండడాన్ని గుర్తించారు. శనివారం రూరల్ పోలీస్టేషన్‌లో ఏఈ శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.


