మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని గర్జించిన యువత
● వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన
● డీఎస్సీ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేయాలని డిమాండ్
కలెక్టరేట్‌కు ర్యాలీగా వస్తున్న విద్యార్థులు, పార్టీ శ్రేణులను రోప్‌లతో అడ్డుకుంటున్న పోలీసులు
కదం తొక్కుతూ.. పదం పాడుతూ యువతరం గర్జించింది. డీఎస్సీ అక్రమాల నిగ్గు తేల్చాలని రోడ్డెక్కి నిరసన తెలిపింది. పోలీసుల దిగ్బంధాలను దాటుకుంటూ.. ఆంక్షల సంకెళ్లు ఛేదిస్తూ ధిక్కార నినాదాన్ని సర్కారుకు వినిపించింది. పరీక్షల్లో జరిగిన అక్రమాలనే కాదు.. ఎగ్గొట్టిన నిరుద్యోగ భృతిని, ఆపేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వానికి గుర్తు చేసింది. వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామాను ముక్తకంఠంతో కోరింది.
శ్రీకాకుళం పాతబస్టాండ్/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని, యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లను మర్చిపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి యువతకు న్యాయం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కూడా పోలీసులు అడ్డుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యా రంగంలో వైఫల్యాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన ‘విద్యార్థి, యువత ర్యాలీ’ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. పోలీసుల ఆంక్ష లు, దిగ్బంధాలను దాటుకుని జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీకాకుళం చేరుకున్నారు. మంగళవారం ఉదయం నరసన్నపేటలో పోలీసుల అడ్డంకులను ఛేదించుకుని బయలుదేరిన నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ రహదారిలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన జనసందోహంతో కలెక్టరేట్ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది.
రోడ్డుపై ఉద్రిక్తత
కలెక్టరేట్ వైపు ఊరేగింపుగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వా గ్వాదం, తోపులాట చోటుచేసుని ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిరసన ప్రదర్శనలకు ఎలాంటి ముందస్తు ప్రభుత్వ అనుమతి లేదని, చట్టభద్రత దృష్ట్యా సహకరించాలని పోలీసులు కోరగా.. వారి విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వకుండానే నేతలు, కార్యకర్తలు నిరసన తెలిపి అక్కడ నుంచి వెనుదిరిగారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, సమన్వయకర్తలు పేరాడ తిలక్, శాడి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, చింతాడ రవికుమార్, పార్టీ సీఈసీ మెంబర్, నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకులు అంధవర పు సూరిబాబు, రాష్ట్ర కార్యదర్శులు దుంపల రామారావు, కేవీజీ సత్యనారాయణ, తూర్పుకాపు కుల రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ఎస్‌ఈసీ మెంబర్ గొండు కృష్ణమూర్తి, వెలమకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షులు చింతాడ వరుణ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు అశోక్‌చక్రవర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకు లు పిన్నింటి సాయి, చల్ల రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ముత్తా విజయ్‌కుమార్, బొడ్డేపల్లి రమేష్‌కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతీ దివ్య, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్య క్షులు రౌతు శంకరరావు, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, క్రిష్టియన్, మైనార్టీ విభాగం నాయకులు ప్రత్తి అన్వేష్, వైఎస్సార్‌సీపీ నాయుకులు సాధు వైకుంఠరావు, మండవల్లి రవి, అంధవరపు రమేష్, గొండు రఘురాం, సీదిరి త్రినాఽథరావు, గంట్యాడ రమేష్, వైవీ శ్రీధర్, కోత సతీష్, నక్క రామరాజు, భరద్వాజ్, సనపల నారాయణరావు, నర్తు నరేంద్రయాదవ్, పీస శ్రీహరి, మూకళ్ళ తాతబాబు, చిట్టి జనార్ధన,టి. కామేశ్వరి, సీహెచ్ భాస్కరరావు, ఎండ రమేష్, చింతాడ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


