మధ్యలోనే ఆపివేసిన గ్రోయిన్ నిర్మాణ పనులు
తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టిన వైనం
వరదలు వస్తే ఇబ్బందులు తప్పవని
మత్స్యకారుల ఆందోళన
రూ.1.90 కోట్లు ఖర్చు
గ్రోయిన్ కొట్టుకుపోయే ప్రమాదం
సగంలోనే నిలిచిన గ్రోయిన్ నిర్మాణ పనులు
శ్రీకాకుళం రూరల్:
మత్స్యకారుల చిరకాల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం చిదిమేసింది. ఎప్పటినుంచో ప్రపోజల్ లో ఉన్న పెదగనగళ్లవానిపేటలోని సముద్రతీరం వెంబడి వస్తున్న నాగావళి నదీ ప్రవాహాన్ని దారి మళ్లించే గ్రోయిన్ నిర్మాణపు పనులు మధ్యలోనే వదిలేసింది. దీంతో మత్స్యకారుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఇసుక తవ్వకాలు, వరదలు, ప్రకృతి విపత్తులు కారణంగా నాగావళి నది ప్రవా హం దిశ మార్చుకొని తీరప్రాంత గ్రామాల వైపు మళ్లుతోంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ భూము లు భారీగా కోతకు గురై నదిలో క్రమంగా కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో నది ఎప్పుడు గ్రామాలపై విరుచుకుపడుతోందనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు నదీ ప్రవాహం అడ్డుగా మారడంతో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేక పలువు రు మత్స్యకారులు వలస బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అరకొర పనులతో నిధులు వృథా
సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం చైన్నె నుంచి నిపుణుల కమిటీని రప్పించి పరిశీలించింది. అనంతరం ఎల్ ఆకారంలో శాశ్వత గ్రోయిన్ నిర్మిస్తే నాగావళి ప్రవాహం నేరుగా సముద్రంలోకి మళ్లి సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిటీ పేర్కొంది. దీనికోసం సుమారు రూ.94.50 కోట్ల అంచనా తో ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్ సమక్షంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు నివేదికను పంపించా రు. అయితే శాశ్వత నిర్మాణాలకు కేంద్రస్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో.. రాష్ట్ర ప్రభు త్వం తాత్కాలిక గ్రోయిన్ నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. దీన్ని ఇరిగేషన్ శాఖ అధికారు లకు అప్పగించి 270 మీటర్లు పొడవున మూడు విడతలుగా గ్రోయిన్ నిర్మాణ పనులను అంచెలంచెలుగా ప్రారంభించారు. అయితే మంజూరైన నిధుల ఖర్చు అనంతరం పనులు నిలిపివేశారు. దీంతో ఖర్చు చేసిన నిధులన్నీ సముద్ర గర్భంలోనే వృథా అవుతాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అదనపు నిధులు మంజూరైతేగానీ గ్రోయిన్ నిర్మాణాన్ని పూర్తిచేయలేమంటూ ఇరిగేషన్ అధికారులు మధ్యలోనే వదిలేశారు.
ప్రమాదంలో మత్స్యకారులు
గ్రోయిన్ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1.90 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ నిధులతో కొంతమేర ఎల్ సేపును తీసుకొచ్చాం. ఇంతవరకు మాత్రమే మాకు ఆదేశాలు వచ్చాయి. అంతకుమించి పనులు చేయలేము.
– సుధాకర్‌రావు, ఇరిగేషన్ అధికారి, శ్రీకాకుళం
గ్రోయిన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తేనే ప్రవాహపు వరదలకు అడ్డుకట్ట వేయవచ్చు. కానీ అధికారు లు మధ్యలోనే పనులు ఆపివేశారు. పొరపాటు న తీవ్రస్థాయిలో వరదలు వస్తే ఉన్న గ్రొయిన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మా తీర ప్రాంత ప్రజలకు ముప్పు ఏర్పడుతుంది.
– తాతారావు, పెదగనగళ్లవానిపేట
నదీ ప్రవాహాన్ని శాశ్వతంగా నియంత్రించే పనులు చేపట్టాల్సిన సమయంలో తాత్కాలిక పనులకు పరిమితం కావడంతో సుమారు పదివేల మంది ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో ఉన్నాయ ని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రవాహం లోతు పెరగడంతో తొమ్మిది మంది వరకు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందువలన వెంటనే పూర్తిస్థాయిలో గ్రోయి న్ నిర్మాణం పూర్తి చేయాలని తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


