జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 8 2026 12:59 AM | Updated on Aug 8 2026 12:59 AM

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల జాబితా వెల్లడి విచారణ పేరుతో వేధింపులు శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 2.58 లక్షలు ‘సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం’ గూడ్స్‌ రైలుకు తప్పిన ప్రమాదం

శ్రీకాకుళం: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా అందించే ‘జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల’ కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 8 నుంచి 15 వరకు మాత్రమే సమర్పించాలని తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను స్థానిక మండల విద్యాశాఖ అధికారుల ద్వారా సమర్పించాలని, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత ఉప విద్యాశాఖ అధికారుల ద్వారా అందజేయాలని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల జాబితాను ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి వెల్లడించారు. తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీ క్రీడామైదానం వేదికగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌–2026 పోటీల్లో పాల్గొనే 76 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. అండర్‌–14, అండర్‌–16, అండర్‌–18, అండర్‌–20 బాలబాలికల వయో విభాగాల్లో జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే అథ్లెట్స్‌ ఈనెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తమ లగేజీతోపాటు పత్రాలు, మూడు పాస్‌ ఫొటోలతో ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ వద్ద సంఘ ప్రతినిధులు కె. మాధవరావు, చల్లా తవిటిరాజుల వద్ద రిపోర్ట్‌ చేయాలని మధుసూదన్‌, సాంబమూర్తి కోరా రు. మరిన్ని వివరాలకు 8500271575 నంబర్‌ ను సంప్రదించాలని వారు సూచించారు.

ఆమదాలవలస: వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవిపై నమోదైన కేసు విషయంలో పోలీసుల వైఖరి విస్తు గొలుపు తోంది. విచారణ పేరుతో ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు, మహిళలను స్టేషన్‌కు తరలించి వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను సైతం స్టేషన్‌కు పిలిపించి గంటల తరబడి నించోబెడుతున్నా రని బాధితులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపా రు. తాజాగా నలుగురిని పోలీసులు అదుపులో కి తీసుకున్నట్లు సమాచారం.

జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆ దాయం గత రెండు నెలలది శుక్రవారం లెక్కించారు. హుండీలో రూ.2,58,628గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడు కొండలు తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్‌ శివకుమార్‌ పాడి, మందస ఈఓ ఎస్‌.నాగేశ్వరరావు, అర్చకులు శేషాద్రి వెంకటాచలం భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశా రు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘డయల్‌ యువర్‌ ఎస్పీ – పోలీస్‌ గ్రీవెన్స్‌’ కా ర్యక్రమం నిర్వహించి సిబ్బంది, అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

మందస: మందస రోడ్డు సమీపంలో గూడ్స్‌ రైలుకు వెనుక భాగంలో ఉన్న చివరి వ్యాగన్‌ పట్టాలు తప్పి చక్రం విరిగింది. శుక్రవారం ఉదయం మందస రైల్వే స్టేషన్‌ బాలిగాం సమీపంలో ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తు న్న గూడ్స్‌ రైలు వెనుక వ్యాగన్‌ పట్టాలు తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో రైల్వే ఇంజి నీరింగ్‌ అధికారులు, సాంకేతిక బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చా రు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement