కంచిలి: ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయడమే శ్రేయస్కరమని శ్రీకాకుళం జిల్లా రైతు శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ వెంకటరావు పేర్కొన్నారు. మండలంలోని కొల్లూరు రైతుసేవ కేంద్రం పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతన్న మీ కోసం కా ర్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఇప్పటికే వరి వేసి ఉన్న పంట పొలాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆత్మ పథకంలో భా గంగా కొల్లరు గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, పంటల మార్పిడిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్, వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు శాస్త్రవేత్త డాక్టర్ ఉదయబాబు, మండల వ్యవసాయాఽధికారి కొంకేన సురేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.


