కవిటి: అతను ఓ రోజు కూలి. ఏ రోజు పని చేస్తే ఆ రోజు కడుపు నిండే పరిస్థితి. కష్ట పడడం కడుపు నింపుకోవడం తప్ప పొదుపు అంటూ లేని దుస్థితి. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పాము కా టు బారిన పడింది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో ఉంది. కన్న బిడ్డ అలా కదల్లేని స్థితిలో ఉండడం చూసి తండ్రికి కాళ్లు చేతులు ఆడడం లేదు. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం మడియారపుట్టుగకు చెందిన దుక్క రాజు కుమార్తె హారతి పా ము కాటుకు గురైంది. ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. కానీ చికిత్స ఖర్చును భరించే స్థోమత రాజుకు లేదు. రోజు కూలిగా పనిచేస్తున్న తనకు వైద్యం ఖర్చు భరించడం తలకు మించిన భారమవుతోందని, దాతలు స్పందించి తన కూతురి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
సాయం చేయదలచుకున్న వారు 9515977206
నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.


