సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేత చింతాడ రవికుమార్‌ను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. శ్రీకాకుళం డిఎస్పీ ముందు లొంగిపోయేందుకు వెళ్తుండగా రోడ్డుపై ఆయన కారును ఆపి అదుపులోకి తీసుకున్నారు.
చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ‘‘నా అనుచరులను ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను, నా కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధిస్తున్నారు. దాదాపు 50 నుంచి 60 మంది వరకు కార్యకర్తలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. రాష్ట్రంలో అరాచక పాలన ఈ రోజు సాగుతుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఎక్కడికి తీసుకు వెళ్తున్నారో కనీసం చెప్పడం లేదు. ప్రతిరోజు పదిమంది పోలీసులు వచ్చి వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తున్నారు.
..హైకోర్టులో ఓ వైపు న్యాయ పోరాటం చేస్తున్నాం. కార్యకర్తలు ఇబ్బంది పడకూడదని డిఎస్పీ వద్ద లొంగిపోదామని వెళ్తున్నా.. మార్గ మధ్యలో నన్ను ఆపారు. ఎక్కడకి తీసుకువెళ్తున్నారో చెప్పడం లేదు. ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు.. బలవంతంగా కారు ఎక్కిస్తున్నారు’’ అంటూ చింతాడ రవికుమార్ మండిపడ్డారు.


