సాక్షి, గుంటూరు: అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రగడ చోటుచేసుకుంది. స్టాల్స్‌ను తిలకించడానికి వచ్చిన మంత్రి దుర్గేష్‌ను డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు గన్‌మెన్ అడ్డుకున్నారు. జనసేన నేతలను రఘురామకృష్ణరాజు గన్‌మెన్ పక్కకు నెట్టేశారు. దీంతో రఘురామకృష్ణ రాజు గన్‌మెన్‌తో జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. అరుపులు, కేకలతో ప్రాంగణం దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముందే గొడవ జరిగింది.




