అప్పుల్లో ఆల్‌టైమ్‌ రికార్డు.. మరోసారి అప్పు చేసిన చంద్రబాబు | Chandrababu Naidu government sets a record in debt | Sakshi
Sakshi News home page

అప్పుల్లో ఆల్‌టైమ్‌ రికార్డు.. మరోసారి అప్పు చేసిన చంద్రబాబు

Sep 22 2026 8:01 PM | Updated on Sep 22 2026 8:14 PM

Chandrababu Naidu government sets a record in debt

సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో కూటమి ప్రభుత్వం తన రికార్డును తానే బద్ధలు కొడుతుంది. తాజాగా ఈరోజు మంగళవారం రూ. 2,600 కోట్లు అప్పు చేసింది. ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు చేసింది.ఈ తాజా అప్పుతో మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 27 నెలల్లో 3.97 లక్షల కోట్లు అప్పు చేసి దేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఈ మెుత్తం నిధులలో రూ.2.24 లక్షల కోట్లు బడ్జెటరీ అప్పు కాగా రూ. 1.25 లక్షల కోట్లు కార్పొరేషన్‌ ద్వారా చేసిన అప్పు అదేవిధంగా అమరావతి కోసం రూ. 47, 687 కోట్లు చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. ఈ మెుత్తం అప్పులతో రూ. 4 లక్షల కోట్ల అప్పుకు చేరువలోకి కూటమి ప్రభుత్వం చేరుకుంది. చరిత్రలో ఏ సిీఎం చేయనంతగా చంద్రబాబు అప్పులు చేయడంతో ఆర్థిక శాఖ అధికారుల్లో ఆందోళన నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement