కృష్ణా జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టినా వారికి అండగా నిలవాలన్నారు. మనుషులను డబ్బుతో కొనలేరని, కష్టంలో ఉన్న ప్రతీ ఒక్కరి వద్ద జగన్ మనిషి ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతకై నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.
‘వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం కాలువ నుంచి రైతులకు నీరిచ్చేవాడు. రైతుల మోటార్ల మీద చెయ్యి వేసే దమ్ము కూడా ఎవరికీ ఉండేవి కాదు.మోటార్లు పీకేస్తున్నా మీ ఎమ్మెల్యే ఏం చేయలేకపోయాడు. వంశీ చంద్రబాబుకు లెటర్ రాసి మోటార్లు పీకేయకుండా అడ్డుకున్నాడు. చంద్రబాబు మాట్లాడితే కరెంట్ బిల్లులు తగ్గిస్తానంటాడు. కానీ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుంది. సాగుకు నీరు ఇవ్వలేరు కానీ సారాయి మాత్రం ఏరులై పారిస్తున్నారు
పోలవరం కాలువ కింద నీరు ఇవ్వలేరు కానీ కాల్వ గట్లను మాత్రం తవ్వేస్తున్నారు. వందల లారీలు తరలి పోతున్నాయి. ఈ మట్టిలో మంత్రి కొల్లు రవీంద్రకు వాటా ఎంత?, ఇంకా మీకు మిగిలింది రెండేళ్లే. నున్న పోలవరం కాలువ గట్టు మీద మట్టి దోచుకున్నోళ్ల మీద కేసులుండవా?, రోజులు లెక్కబెట్టండి. మీరు తిన్న ప్రతీ రూపాయి జనం కక్కిస్తారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు జీతం తీసుకోవడానికే పనికొస్తాడు. రైతులకు ఎరువులు ఇచ్చే నాథుడు లేడు. రైతులను ఎరువుల ధరలు పెంచేసి దోచుకుంటున్నారు.
చంద్రబాబు రెండేళ్లలో ఒక్క కౌలు రైతుకు డబ్బులు ఇచ్చాడా?, వైఎస్ జగన్ సెంటున్నర భూమి ఇస్తే చంద్రబాబు, లోకేష్ హేళనగా మాట్లాడారు. 30 లక్షల మంది సొంతింటి కలను జగన్ నెరవేర్చారు. 3 సెంట్లు ఇస్తానని చెప్పి మూడేళ్లైంది ఒక్కరికైనా ఇచ్చారా చంద్రబాబు. ఆరోగ్శ్రీ కి ఈ ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. జనం నానా అవస్థలు పడుతున్నారు. సముద్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని ఆలోచిస్తున్నా అని చంద్రబాబు అంటున్నాడు. సముద్రం సంగతి తర్వాత పెరిగిపోతున్న ఉప్పు, పప్పు రేట్లు తగ్గించు.
ఐదేళ్లలో జగన్ రెండున్నర లక్షల కోట్లు జనానికి ఇచ్చారు. మరి మీరు ఈ రెండున్నరేళ్లలో జనానికి ఏం ఇచ్చారు?, లోకేష్ మాట్లాడితే గొడ్డలి పార్టీ అంటాడు. గొడ్డలి మీ దొడ్లోనే ఉంది లోకేష్. మాట్లాడితే డీఎస్సీ పై చర్చకురా జగన్ అని సవాల్ చేస్తున్నావ్. నీలాగా ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుని బెయిల్ తెచ్చుకోలేదు. సొల్లు కబుర్లు చెప్పడం కాదు. నీకు దమ్ముంటే డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేయించి నీ సత్తా నిరూపించుకో’ అని సవాల్ విసిరారు.
మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలి
పేద, మధ్య తరగతి ప్రజలు బతకాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. పేద బ్రతుకుల జీవితాల్లో వెలుగులు రావాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. చంద్రబాబు రైతులకు సాగునీరు ఇవ్వడం లేదు కానీ మద్యం షాపులు మాత్రం ఊరికి నాలుగైదు పెట్టారన్నారు.
ఇదీ చదవండి: ‘చంద్రబాబు, లోకేష్‌లు చట్టం రుచి, పదునేంటో చూస్తారు’


