సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై శాప్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వైఎస్సార్‌సీపీ శ్రేణులలపై టీడీపీ మూకలు దౌర్జన్యాయానికి దిగాయని వైస్సార్‌సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ప్రభుత్వమే గూండాగురీకి దిగింది.శాంతియుత నిరసన ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులు చేస్తారా?.పోలీసుల చేతిలోని లాఠీలను లాక్కుని దాడులకు దిగుతారా?.నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దివ్యాంగుల చేతిలోని కర్రలను లాక్కుని దాడి చేశారు. లోకేష్‌ని ఎవరైనా ఏమైనా అంటే చంపేస్తామని వారు బెదిరిస్తున్నారు. అసలు శాప్ ఆఫీసు దగ్గర ఈ ప్రైవేటు వ్యక్తులకు ఏం పని?.
మా ఇష్టం వచ్చినట్లు పాలన చేస్తామని చంద్రబాబు, లోకేష్ అంటున్నారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఎందుకు తట్టుకోలేక పోతున్నారు?. యువగళంలో పాల్గొన్న వారికి టీచరు ఉద్యోగాలు ఇచ్చేస్తారా?.అర్హులకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వటం సబబేనా?.విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అనర్హుడు.టీచర్లను రెచ్చగొట్టి పోటీ ధర్నాలు చేయించటం ఇక్కడే చూస్తున్నాం.
రేపు ప్రభుత్వం మారితే వారి పరిస్థితి ఏంటి?. డీఎస్సీ అక్రమాలపై కచ్చితంగా సీబిఐ విచారణ జరపాల్సిందే.ఇలా దాడులు చేయించేవారు విద్యాశాఖకు మంత్రిగా పనికి రారు.అధికారులను పంపటం కాకుండా లోకేష్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు?. డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది.అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించరా?.ఈ అక్రమాలపై కచ్చితంగా సీబిఐతో విచారణ జరపాల్సిందే. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు నోరు మెదపటం లేదు?’అని ప్రశ్నించారు.


