సాక్షి, విశాఖ: రాష్ట్రంలో వాయుగుండం ఎఫెక్ట్‌తో తీరప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రానున్న 12 గంటల్లో వాయుగుండం మరింత బలపడనున్న నేపథ్యంలో అన్ని పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీరం వెంబడి భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.కాగా ఇప్పటికే ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తీర ప్రాంత వాసులని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
ఇది చదవండి: ఏపీకి రెడ్ అలర్ట్


