తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించడానికి భయమెందుకని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. లక్షల మంది లక్ష్యాలను ధ్వంసం చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నారంటూ సీదిరి ధ్వజమెత్తారు. రౌడీయిజం చేసిన వారు గురువులంటూ చంద్రబాబు అండ్ కంపెనీ చెప్పడాన్ని సీదిరి తీవ్రంగా తప్పుబట్టారు. రౌడీయిజం చేసిన వారు గురువులా? చంద్రబాబు అని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. అదే శాప్ కార్యాలయం ముందు టెంట్ వేయించడమంటే రెచ్చగొట్టడం కాదా? చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన సీదిరి అప్పలరాజు.. డీఎస్సీ పేపర్ లీకేజ్ మీద సీఎం, మంత్రులు ఎవరైనా ఇప్పటివరకూ వివరణ ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. ‘ డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించడానికి భయం ఎందుకు?, శాప్ కార్యాలయం దగ్గర టెంట్ వేయించడమంటే రెచ్చగొట్టడం కాదా..?, స్పోర్ట్స్ అసోసియేషన్ లెటర్‌లకు ఒక్కరైనా సమాధానం ఇచ్చారా?, స్పోర్ట్ సంఘాలు మేం లెటర్‌లు ఇవ్వలేదని చెప్పినా ఒక్క మంత్రి మాట్లాడరు.
శాప్ కార్యాలయం ముందు ధర్నాకు వైఎస్సార్‌సీపీ పిలుపు ఇవ్వగానే కుట్రలు మొదలు పెట్టారు. లోకేష్ మీడియా ముందుకు రాకుండా అధికారులతో మాట్లాడిస్తున్నారు. క్రెడిట్ కోసం పాకులాడే లోకేష్ డీఎస్సీ లీకేజీ మీద ఎందుకు మాట్లాడరు..?, ఉద్యోగార్థుల భవిష్యత్ అంధకారమవుతుంటే సీఎం సహా మంత్రులు ఎందుకు మాట్లాడరు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది?, రౌడీలను పట్టుకుని గురువలంటూ చంద్రబాబు ప్రవచనాలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ నిరసనకు పిలుపునిస్తే.. మీరు రౌడీలను ఉసిగొల్పడమంటే అర్థమేంటి?,
గతంలో సాక్షి కార్యాలయాల మీద దాడి చేసిన వారే.. శాప్ దగ్గర దాడులు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అవినాష్ మీద పోలీసులు దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ నేత గౌతంరెడ్డి మీద దారుణంగా దాడి చేశారు. రౌడీలను పట్టుకుని గురువులని ప్రచారం చేస్తున్నారు. లోకేష్ జోలికి వ స్తే చంపుతాం, చచ్చిపోతాం అన్నవాళ్లు గురువులా..?, రౌడీయిజం చేసింది ఎవరు చంద్రబాబూ?, నారా లోకేష్ టీమ్, యువ గళం సభ్యులమంటూ టీడీపీ రౌడీలు దాడులు చేశారు.
గతంలో సాక్షి కార్యాలయాల మీద దాడి చేసిన వారే.. శాప్ దగ్గర దాడులు చేశారు. లక్షల మంది లక్ష్యాలను ధ్వంసం చేశారు. కుట్రపూరితంగా పేపర్ లీకేజీ చేసి అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తే భౌతిక, మానసిక దాడులు చేస్తున్నారు. నిజాలను నిగ్గుతేల్చడానికే వైఎస్సార్‌సీపీ సీబీఐ విచారణ అడుగుతోంది. కలెక్టర్ల మీటింగ్‌లో తప్పంతా అధికారుల మీదనే తోసేశారు. టీడీపీ సోషల్ మీడియా వాళ్లు కొంచమైనా బుర్రవాడాలి బ్రో. టీడీపీ సోషల్ మీడియాలో ఉంది యువకులే కదా.. యువత గురించి ఆలోచించరా?’ అని సీదిరి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ‘ఆ గూండాలకు పోలీసులే రక్షణ కల్పించటం దుర్మార్గం’


