విశాఖ: డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ శాప్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన చేపట్టిన తమ పార్టీ శ్రేణులపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. పోలీసుల చేతిలో లాఠీలు తీసుకుని మరి దాడికి పాల్పడటం అరాచక పాలనకు నిదర్శనం కాదా?, అని ప్రశ్నించారు.
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్‌సీపీ బయటపెట్టిన ఆధారాలను చూసి మంత్రి లోకేష్ భయపడుతున్నారన్నారు. అసలు ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు వరుదు కళ్యాణి.
ఇదీ చదవండి: ‘లక్షల మంది లక్ష్యాలను ధ్వంసం చేశారు’


