‘చంద్రబాబు, లోకేష్‌లు చట్టం రుచి, పదునేంటో చూస్తారు’ | YSRCP Leader Ambati Rambabu Warns Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు, లోకేష్‌లు చట్టం రుచి, పదునేంటో చూస్తారు’

Sep 22 2026 5:43 PM | Updated on Sep 22 2026 5:49 PM

YSRCP Leader Ambati Rambabu Warns Chandrababu And Lokesh

తాడేపల్లి: నిన్న విజయవాడ శాప్‌ కార్యాలయం ఎదుట డీఎస్సీలో జరిగిన అక్రమాలపై నిరసన తెలిపిన తమ పార్టీ నాయకులపై దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఉద్యమ కారుల మీద దాడుల చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సుమారు 250 మంది వైఎస్సార్‌సీపీ నేతల మీద విభిన్న కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒకవైపు దాడులు చేస్తూ, మరొకవైపు అక్రమ కేసులకు ఉసిగొల్పుతున్న చంద్రబాబు, లోకేష్‌ చట్టం రుచి ఏంటో, చట్టం పదునేంటో చూస్తారని అంబటి హెచ్చరించారు.

ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్‌ 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ఖాకీలు చేసే దుర్మార్గాలను బట్టబయలు చేస్తామన్నారు. గేదెల రమేష్‌ ఒక కార్పొరేటర్‌ భర్త ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టారని, వైఎస్‌ జగన్‌ను కలిసి వెళ్తున్న కొరిటిపాటి వినయ్‌ కుమార్‌ను పట్టుకెళ్లారన్నారు. నోటీసులు ఇవ్వడానికి లాక్కెళ్తారా?, మఫ్టీలో ఉండి అన్యాయంగా లాక్కెళ్లారన్నారు. 

‘లోకేష్‌ నీకు శిక్ష పడేలా చేస్తాం. చంద్రబాబు, లోకేష్‌ చట్టం రుచి ఏంటో, చట్టం పదునేంటో చూస్తారు. శాప్‌ దగ్గర ధర్నాలో పాల్గొనని వారి మీద కూడా అక్రమంగా, అన్యాయంగా కేసులు పెట్టారు. లోకేష్‌ పిల్ల చేష్టలు మానుకోవాలి. లోకేష్‌ వెంట ఉండే వాళ్లు గుర్తుపెట్టుకోండి.. ఎప్పుడూ మీరు ఉండరు. ఉండవల్లిలో రైతులను పరామర్శించడానికి వెళ్తే మాపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. విజయవాడ ఘటనలో విజయవాడకు రాని వారి మీద కేసులు పెడుతున్నారు. ఇవన్నీ లోకేష్‌ డైరెక్షన్‌లో జరుగుతున్నాయి. లోకేష్‌ కలకాలం మీరు అధికారంలో ఉండరు. లోకేష్‌ మాటలు విని, అన్యాయంగా కేసులు పెడితే మేం కోర్టుకు వెళ్తాం. అక్రమ కేసులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి’ అని సూచించారు.

ఇదీ చదవండి:  వైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల జులుం.. మాజీ కార్పొరేటర్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement