విజయవాడ: వైఎస్సార్‌సీపీ నాయకులపై ప్రభుత్వం దారుణ కుట్ర పన్నింది. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు అసాధారణ ఆదేశాలు ఇచ్చారు. 51 మందిపై రౌడీ షీట్ తెరవాలని ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఉన్న వారందరిపైన రౌడీ షీట్ తెరుస్తూ ఆదేశాలు జారీ చేశారు.
డీఎస్సీపై ఉద్యమాన్ని అంగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఐదేళ్ల కిందటి కేసుపై ఇప్పుడు రౌడీ షీట్ తెరవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ముఖ్య నాయకులపై సైతం రౌడీ షీట్ తెరవాలని ఆదేశాలు వచ్చాయి. జాబితాలో ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్ సహా 51 మంది పేర్లు ఉన్నాయి.


