ఏపీలో కొనసాగుతున్న వైసీపీ శ్రేణుల అక్రమ అరెస్టులు | Widespread Arrests of YSRCP Leaders Following Vijayawada DSC Protests | Sakshi
Sakshi News home page

ఏపీలో కొనసాగుతున్న వైసీపీ శ్రేణుల అక్రమ అరెస్టులు

Sep 22 2026 10:41 PM | Updated on Sep 22 2026 10:43 PM

Widespread Arrests of YSRCP Leaders Following Vijayawada DSC Protests

ఎన్టీఆర్ జిల్లా: ఏపీలో వైసీపీ శ్రేణుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్లీ అక్రమ అరెస్టులు జరిగాయి. విజయవాడలో జరిగిన డీఎస్సీ ఆందోళనలో పాల్గొన్న మండలంలోని వైసీపీ నాయకులను అరెస్టు చేశారు. 

కాలే పుల్లారావు, మండలి వెంకట సుబ్బారావు, మన్నెం జగదీష్, కురిటి శివను చిల్లకల్లు పోలీసులు అరెస్టు చేశారు.  షేక్ నాగుల్ మీరా, సుంకర ఆంజనేయులు, పెద్దిరెడ్డి నరసింహస్వామి, గడ్డం రామకృష్ణ, బైరబోయిన బాబు, బండి ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో  బైరబోయిన బాబు, గడ్డం రామకృష్ణ,, బండి ఆంజనేయులును విచారణకు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీస్ స్టేషన్‌కు పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరావు చేరుకున్నారు. అక్రమంగా తమ నాయకులను అరెస్ట్ చేశారంటూ పోలీసుల చర్యలను తప్పు పట్టారు.  తమ నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ పోలీస్‌ స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మాచవరం సీఐ లాఠీచార్జ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement